Chicken Prices | కొండెక్కిన కోడి కూర ధరలు.. అర కిలోతోనే సరిపెట్టుకుంటున్న నాన్‌వెజ్ లవర్స్..!
Chicken Prices | నాన్ వెజ్ లవర్స్ షాకింగ్ న్యూస్.. కోడి కూర ధరలు కొండెక్కాయి. వారం రోజుల క్రితం వరకు భారీగా తగ్గిన చికెన్ ధరలు నిన్నటి నుంచి అమాంతం పెరిగాయి. దీంతో చికెన్ ప్రియులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
Chicken Prices | త్రినేత్ర.న్యూస్ : నాన్ వెజ్ లవర్స్ షాకింగ్ న్యూస్.. కోడి కూర ధరలు కొండెక్కాయి. వారం రోజుల క్రితం వరకు భారీగా తగ్గిన చికెన్ ధరలు నిన్నటి నుంచి అమాంతం పెరిగాయి. దీంతో చికెన్ ప్రియులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. రెండు కిలోలు, కిలోతో సరిపెట్టుకున్న వారు ఇప్పుడు అరకిలోతో సరిపెట్టుకుంటున్నారు.
కొద్ది రోజుల క్రితం వరకు స్కిన్‌తో రూ. 260 ఉండగా, ప్రస్తుతం రూ. 310 నుంచి రూ. 320కి చేరింది. అదే విధంగా స్కిన్‌లెస్ చికెన్ కిలోకు రూ. 280 ఉండగా, ప్రస్తుతం రూ. 350 నుంచి రూ. 360కి చేరింది. దీంతో చికెన్ కొనాలంటేనే నాన్ వెజ్ లవర్స్ వెనుకంజ వేస్తున్నారు. కేవలం అరకిలోతేనే సరిపెట్టుకుంటున్నారు. ప్రస్తుతం ధరలు మరింత పెరగడంతోపాటు జూన్ నెలాఖరు వరకు ఇలానే ఉంటాయని వ్యాపారులు చెబుతున్నారు.
భారీ ఉష్ణోగ్రతలే కారణమా..?
ఎండా కాలం వచ్చేసరికి 35 డిగ్రీల ఉష్ణోగ్రతలను బాయిలర్ కోళ్లు తట్టుకోవడం కష్టమవుతుంది. ప్రస్తుతం ఉష్ణోగ్రత 40 డిగ్రీలు దాటింది. ఈ నేపథ్యంలో ఎండను తట్టుకోలేక, విద్యుత్తు లేకపోయినా కోళ్లు చనిపోతుంటాయి. ఫారాల చుట్టూ జాలీలకు తట్లు ఏర్పాటు చేసి వాటిపై నీళ్లు చల్లుతుంటారు. ఎండాకాలం వచ్చిందంటే ఒక ఫాంలో 20 వేల కోడి పిల్లలను పెంచాల్సిన రైతులు కేవలం 5-10 వేల వరకు మాత్రమే పెంచుతారు. వేసవిలో కోడి పిల్లల ధరలు కూడా అధికంగా ఉంటాయి. ఒక్కో కోడి పిల్ల రూ.50 నుంచి రూ.60 వరకు ఉంది. ఈ సీజన్‌లో అవి వేడికి చనిపోతుంటాయి. దీంతో సహజంగానే బాయిలర్ కోళ్ల కొరత ఏర్పడింది, తద్వారా చికెన్ ధరలు పెరుగుతున్నాయి.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్




