Chicken Prices | ఇక కోడి కూర ఖరీదే.. కిలో చికెన్ రూ. 300 పైనే..!
Chicken Prices | తెలంగాణ వ్యాప్తంగా చికెన్ ధరలకు( Chicken Prices ) రెక్కలొచ్చాయి. కోడిగుడ్ల( Eggs ) ధరలు కూడా ఆకాశాన్నంటాయి. దీంతో సామాన్యుడు చికెన్ షాపులపై కన్నెత్తి చూడాలంటేనే భయపడిపోతున్నారు. గత నెల రోజుల నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతోంది.
Chicken Prices | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణ వ్యాప్తంగా చికెన్ ధరలకు( Chicken Prices ) రెక్కలొచ్చాయి. కోడిగుడ్ల( Eggs ) ధరలు కూడా ఆకాశాన్నంటాయి. దీంతో సామాన్యుడు చికెన్ షాపులపై కన్నెత్తి చూడాలంటేనే భయపడిపోతున్నారు. గత నెల రోజుల నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతోంది.
ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్‌లో ఒక్కో కోడి గుడ్డు ధర రూ. 9 పలుకుతోంది. జూన్ చివరలో ఒక్కో కోడిగుడ్డు ధర రూ. 7గా ఉండే. కానీ నెల రోజుల వ్యవధిలోనే రెండు రూపాయాలు పెరిగి.. ఎగ్ లవర్స్‌ను ఆందోళనకు గురి చేస్తోంది. ఇక చికెన్ ధరలు కూడా భారీగా పెరిగిపోయాయి. కేజీ చికెన్ ధర రూ. 300పైనే పలుకుతోంది.
ట్రే కోడిగుడ్ల ధర రూ. 260
వ్యాపారుల ప్రకారం.. ఒక్కో కోడిగుడ్డును పౌల్ట్రీ యజమానులు తమకు రూ. 7.15 నుంచి రూ. 7.20 వరకు విక్రయిస్తున్నారు. హోల్‌సేల్ మార్కెట్‌కు వచ్చేసరికి ఒక్కో కోడిగుడ్డును రూ. 8.50 పైనే విక్రయించాల్సి వస్తుందన్నారు. ఇక ట్రే కోడిగుడ్లను రూ. 255 నుంచి రూ. 260 వరకు విక్రయిస్తున్నారు.
భారీగా పెరిగిన మొక్కజొన్న, సోయాబీన్ ధరలు
ప్రధానంగా వేసవి కాలంలో కోళ్లు భారీ సంఖ్యలో చనిపోవడం, దాణా ఖర్చులు పెరిగిపోవడం మూలంగానే ప్రస్తుతం కోడిగుడ్లు, చికెన్ ధరలు పెరిగిపోయాయని పౌల్ట్రీ యజమానులు చెబుతున్నారు. కోళ్లకు దాణాగా ఉపయోగించే మొక్కజొన్న, సోయాబీన్ ధరలు కూడా ఆకాశాన్నంటాయని తెలిపారు. ఈ ధరలకు తోడు కోళ్లు కూడా ఎండలకు తట్టుకోలేక విలవిలలాడిపోయి, చనిపోయాయని పేర్కొన్నారు.
బేకరీలకు భారీ నష్టం
ఈ సందర్భంగా ఓ బేకరీ యజమాని మాట్లాడుతూ.. ప్రతి రోజు తాము సుమారు 1000 కోడిగుడ్ల వరకు వినియోగిస్తాం. ఎందుకంటే కేకులు, పేస్ట్రీలతో పాటు ఇతర పదార్థాల తయారీ కోసం. ప్రస్తుతం కోడిగుడ్ల ధరలు భారీగా పెరగడంతో.. కేకులు, పెస్ట్రీల తయారీ తగ్గిస్తున్నామని చెప్పారు. మొత్తానికి బేకరీ వ్యాపారులు తీవ్ర నష్టాల్లోకి కూరుకుపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ ఏడాది సుమారు 2 వేల కోళ్ల వరకు
ఇక బాయిలర్ కోళ్ల ధరలు నెల రోజుల వ్యవధిలోనే రూ. 50 పెరిగాయి. నెల రోజుల క్రితం కిలో చికెన్ ధర రూ. 250 ఉండగా, ప్రస్తుతం రూ. 300 పలుకుతోంది. ఈ వేసవి తీవ్ర నష్టాలను కలిగిందని పౌల్ట్రీ యజమాని ఒకరు తెలిపారు. సాధారణంగా ప్రతి వేసవిలో 10 వేల కోళ్లల్లో కనీసం 1000 కోళ్లు.. వాతావరణ మార్పుల కారణంగా చనిపోతాయి. కానీ ఈ ఏడాది సుమారు 2 వేల కోళ్ల వరకు మరణించాయని, దీంతో తీవ్ర నష్టం చవిచూడాల్సి వచ్చిందని వాపోయారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●BRS Party | కర్ణాటక అక్రమ చెక్‌డ్యాంల పరిశీలనకు బీఆర్ఎస్ బృందం..!
- ●Sri Lanka Tour | బుమ్రా ఫిట్‌నెస్‌పై ఉత్కంఠ.. వచ్చే వారం శ్రీలంక టూర్‌కు జట్టు ఎంపిక..!
- ●Revanth Reddy Speech | 58 ఇంచుల ఛాతీని ఓడించిన 'జెన్-జీ' యువత
- ●Komatireddy | నల్లగొండ అభివృద్ధిలో మరో ముందడుగు.. మర్రిగూడ జంక్షన్ ఫ్లైఓవర్ ప్రారంభం
- ●Pralhad Joshi Education Minister | ధర్మేంద్ర ప్రధాన్ ఔట్.. కేంద్ర నూతన విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి
- ●IND Vs ZIM | జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. అయ్యర్ కెప్టెన్ తొలి సిరీస్ కైవసం..

BRS Party | కర్ణాటక అక్రమ చెక్‌డ్యాంల పరిశీలనకు బీఆర్ఎస్ బృందం..!

Sri Lanka Tour | బుమ్రా ఫిట్‌నెస్‌పై ఉత్కంఠ.. వచ్చే వారం శ్రీలంక టూర్‌కు జట్టు ఎంపిక..!

Revanth Reddy Speech | 58 ఇంచుల ఛాతీని ఓడించిన 'జెన్-జీ' యువత

Komatireddy | నల్లగొండ అభివృద్ధిలో మరో ముందడుగు.. మర్రిగూడ జంక్షన్ ఫ్లైఓవర్ ప్రారంభం






