త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ponnam Prabhakar | రాష్ట్రంలో జిల్లాల ప‌రిధుల్లో మార్పులు త‌థ్యం: మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌

Ponnam Prabhakar | తెలంగాణ (Telangana) రాష్ట్రంలో జిల్లాల ప‌రిధుల్లో మార్పులు త‌థ్య‌మ‌ని రాష్ట్ర ర‌వాణా శాఖ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ (Ponnam Prabhakar) స్ప‌ష్టం చేశారు. ప్ర‌స్తుతం సిద్దిపేట (Siddipet) జిల్లా ప‌రిధిలో ఉన్న హుస్నాబాద్‌ (Husnabad) ను తిరిగి క‌రీంన‌గ‌ర్ (Karimnagar) జిల్లా ప‌రిధిలోకి తీసుకురావ‌డం ఖాయ‌మ‌ని చెప్పారు.

A

Telangana | Published On Jan 11, 2026, 2.15 pm IST

Ponnam Prabhakar | రాష్ట్రంలో జిల్లాల ప‌రిధుల్లో మార్పులు త‌థ్యం: మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌
Advertisement

Ponnam Prabhakar | తెలంగాణ (Telangana) రాష్ట్రంలో జిల్లాల ప‌రిధుల్లో మార్పులు త‌థ్య‌మ‌ని రాష్ట్ర ర‌వాణా శాఖ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ (Ponnam Prabhakar) స్ప‌ష్టం చేశారు. ప్ర‌స్తుతం సిద్దిపేట (Siddipet) జిల్లా ప‌రిధిలో ఉన్న హుస్నాబాద్‌ (Husnabad) ను తిరిగి క‌రీంన‌గ‌ర్ (Karimnagar) జిల్లా ప‌రిధిలోకి తీసుకురావ‌డం ఖాయ‌మ‌ని చెప్పారు. హుస్నాబాద్ ప్రాంత ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌కు అనుగుణంగా క‌రీంన‌గ‌ర్‌లో చేర్చుతామ‌న్నారు. ఈ ప్రాంతాన్ని బ‌ల‌వంతంగా సిద్దిపేట జిల్లాలో చేర్చార‌ని ఆరోపించారు. ప్ర‌స్తుత ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి గ‌తంలో పీసీసీ అధ్య‌క్షుడిగా ఉన్న స‌మ‌యంలో హుస్నాబాద్‌లోని అంబేద్క‌ర్ చౌర‌స్తాలో జిల్లా మార్పుపై హామీ ఇచ్చార‌ని గుర్తు చేశారు. ఈ అంశాన్ని స్థానిక శాస‌న‌స‌భ్యుడిగా ముఖ్య‌మంత్రి దృష్టికి తీసుకెళ్లి, హామీని నెర‌వేరుస్తామ‌ని చెప్పారు.

మంత్రి వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో హుస్నాబాద్‌ను తిరిగి క‌రీంన‌గ‌ర్ జిల్లాలో క‌ల‌ప‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. మ‌రి సిద్దిపేట జిల్లా ప‌రిధి త‌గ్గుతుందా.. ఇత‌ర జిల్లాల ప‌రిధిలోని ప్రాంతాల‌ను సిద్దిపేట జిల్లాలో క‌లుపుతారా.. అస‌లు సిద్దిపేట జిల్లాను ఉంచుతారా.. తొల‌గిస్తారా.. అనేవి ప్ర‌శ్నార్థ‌కంగా మారాయి.

రాష్ట్రంలో జిల్లాల పున‌ర్విభ‌జ‌న‌పై ఇప్ప‌టికే జ‌రుగుతున్న చ‌ర్చ‌కు మంత్రి పొన్నం వ్యాఖ్య‌ల‌తో మరింత ఆజ్యం పోసిన‌ట్ల‌యింది. ఒక‌వైపు సిద్దిపేట‌, సిరిసిల్లతో పాటు ప‌లు జిల్లాల‌ను తొల‌గిస్తార‌ని పుకార్లు షికారు చేస్తున్నాయి. జిల్లాల ప‌రిధి మార్చితే పెద్ద‌గా ప్ర‌తిబంధ‌కాలు ఎదురుకాక‌పోవ‌చ్చుకానీ, జిల్లాలు తొల‌గిస్తే ప్ర‌జ‌లు ఉద్య‌మించే అవ‌కాశాలు ఉంటాయ‌ని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement