Chamala Kiran Kumar Reddy | లోక్‌సభలో భువనగిరి చామల కిరణ్ కుమార్ రెడ్డి వాయిదా తీర్మానం
Chamala Kiran Kumar Reddy | పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు (Monsoon Session) ప్రారంభమయ్యాయి. లోక్‌సభలో భువనగరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (Chamala Kiran Kumar Reddy) వాయిదా తీర్మానం (Adjournment Motion) ఇచ్చారు.
Chamala Kiran Kumar Reddy | త్రినేత్ర.న్యూస్: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు (Monsoon Session) ప్రారంభమయ్యాయి. లోక్‌సభలో భువనగరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (Chamala Kiran Kumar Reddy) వాయిదా తీర్మానం (Adjournment Motion) ఇచ్చారు. నీట్ పేపర్ లీకేజీపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని నోటీసులు ఇచ్చారు. నీట్ అక్రమాలు, ప్రశ్నాపత్రం లీక్ (NEET Paper Leak) అంశంపై చర్చించాలని పేర్కొన్నారు. కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhan) రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
మరోవైపు సమావేశాలు ప్రారంభమైన కొద్దిసేపటికే లోక్‌సభ (Lok Sabha) వాయిదా పడింది. ప్రశ్నోత్తరాల సమయంలో నీట్ పేపర్ లీక్, అయోధ్యలోని రామ మందిరంలో విరాళాల దుర్వినియోగం ఆరోపణలపై ప్రతిపక్ష ఎంపీలు నిరసనకు దిగారు. సభలో పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగించారు. దీంతో సభలో తీవ్ర గందరోగళ పరిస్థితి ఏర్పడింది. సభ్యులు హుందాగా వ్యవహరించాలని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా (Om Birla) విజ్ఞప్తి చేశారు. సభ సజావుగా కొనసాగేందుకు ఎంపీలంతా సహకరించాలని కోరారు. అయినా విపక్షాలు తమ నిరసనను కొనసాగించారు. దీంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 12 గంటల వరకూ వాయిదా వేశారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Peddi Sudarshan Reddy | బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి హఠాన్మరణం
- ●Kukatpally | క్రికెట్ ఆడటానికి వెళ్తూ.. కానరాని లోకాలకు..
- ●Komuravelli Railway Station | సాకారమైన దశాబ్దాల కల.. నేడు కొమురెల్లి మల్లన్న రైల్వే స్టేషన్ ప్రారంభం..
- ●Jurala Project | జూరాలను తాకిన కృష్ణమ్మ.. కాలువలకు నీరు విడుదల చేస్తారా?
- ●Pralhad Joshi | నూతన విద్యాశాఖ మంత్రి ఏం చదువుకున్నారంటే?
- ●Cheruvugattu | చెరువుగట్టులో భారీ అగ్నిప్రమాదం.. 15 దుకాణాలు అగ్నికి ఆహుతి

Peddi Sudarshan Reddy | బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి హఠాన్మరణం

Kukatpally | క్రికెట్ ఆడటానికి వెళ్తూ.. కానరాని లోకాలకు..

Komuravelli Railway Station | సాకారమైన దశాబ్దాల కల.. నేడు కొమురెల్లి మల్లన్న రైల్వే స్టేషన్ ప్రారంభం..

Jurala Project | జూరాలను తాకిన కృష్ణమ్మ.. కాలువలకు నీరు విడుదల చేస్తారా?





