Vehicle Theft | కొత్త అద్దె ఇంటికి అడ్వాన్స్ కడదామని వాహనం చోరీ.. ఎక్కడ జరిగిందంటే!
Vehicle Theft in Attapur | ఇంటికి అద్దె కట్టడం లేదని ఖాళీ చేయమని ఓనర్ ఒత్తిడి తెచ్చాడు. అసలే రెంట్ డబ్బులు లేకపోగా కొత్త అద్దె ఇంటికి అడ్వాన్స్ కడదామని వాహనం చోరీ (Vehicle Theft) చేశాడు.
Vehicle Theft in Attapur | త్రినేత్ర న్యూస్: ఇంటికి అద్దె కట్టడం లేదని ఖాళీ చేయమని ఓనర్ ఒత్తిడి తెచ్చాడు. అసలే రెంట్ డబ్బులు లేకపోగా కొత్త అద్దె ఇంటికి అడ్వాన్స్ కడదామని వాహనం చోరీ (Vehicle Theft) చేశాడు. చివరికి అత్తాపూర్ పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యాడు. ఈ ఆసక్తికర చోరీ ఘటన ఎక్కడ జరిగిందంటే..
రాజేంద్రనగర్ జోన్ డీసీపీ ఎస్.శ్రీనివాస్ కథనం ప్రకారం.. మలక్ పేటకు చెందిన మహమ్మద్ అబ్దుల్ రబ్ (28) గత 6 నెలలుగా ఇంటి అద్దె చెల్లించడం లేదు. దీంతో ఓనర్లు ఖాళీ చేయాలని ఒత్తిడి తేవడంతో కొత్త ఇంటికి అడ్వాన్స్, అద్దె డబ్బుల కోసం అత్యవసరంగా నగదు అవసరమయ్యాయి. ఏంచేయాలో తోచక నిందితుడు చోరీకి పథకం పన్నాడు.
నిందితుడికి అత్తాపూర్ పిల్లర్ నంబర్ 123 సమీపంలో నివసించే ఫ్యామిలీ ఫ్రెండ్ ప్రవీణ్ నివాసానికి తరచుగా వెళ్లే అలవాటు ఉంది. ప్రవీణ్ ఇంటిపై అంతస్తులోనే సదరు సెక్యూరిటీ సంస్థ ఆఫీస్ ఉంది. అక్కడ రాజు అనే డ్రైవర్ రోజూ వాహనాన్ని కడిగి దాని తాళాలను గేటు వద్దే ఉంచడం నిందితుడు గమనించాడు. ఈనెల 19న ప్రవీణ్ ఇంటికి వచ్చిన నిందితుడు గేటు వద్ద ఉన్న తాళాలు తీసి సుమారు 10 లక్షల రూపాయల విలువైన బొలేరో వాహనాన్ని (TG07 6965) ఎత్తుకెళ్లాడు.
బాధితుడు అంకాలా వినోద్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అత్తాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. తాజాగా చేపట్టిన తనిఖీల్లో నిందితుడిని పట్టుకుని అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి బొలేరో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.
రాజేంద్రనగర్ జోన్ డీసీపీ ఎస్.శ్రీనివాస్, అడిషనల్ డీసీపీ కే.ఎస్.రావు, రాజేంద్రనగర్ డివిజన్ ఏసీపీ టి.శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ కేసును ఛేదించిన అత్తాపూర్ పీఎస్ ఎస్‌హెచ్‌వో ఎ.సీతయ్య సీఐ కే.రవి, డీఐ బి.రాజు నాయక్, డీఎస్ఐ నయీముద్దీన్‌ను పోలీసు ఉన్నతాధికారులు అభినందించారు. వారికి తగిన పారితోషికం అందించనున్నట్లు తెలిపారు.
సంబంధిత వార్తలు

Chinese Manja Ban Hyderabad | నగరంలో ప్రాణాంతక చైనీస్ మాంజా విక్రయాలు: ముగ్గురు అరెస్ట్.. రూ.1.89 లక్షల స్టాక్ సీజ్!
అక్టోబర్ 26, 2026

Tummidihetti Barrage | మా వాళ్లు వ్యతిరేకించకపోతేనే.. మేం తుమ్మిడిహెట్టి ఎత్తుపై పరిశీలిస్తాం
అక్టోబర్ 26, 2026

Harish Rao | తుమ్మిడిహెట్టి వద్ద నీళ్లే లేవు
అక్టోబర్ 26, 2026
తాజావార్తలు
- ●Chinese Manja Ban Hyderabad | నగరంలో ప్రాణాంతక చైనీస్ మాంజా విక్రయాలు: ముగ్గురు అరెస్ట్.. రూ.1.89 లక్షల స్టాక్ సీజ్!
- ●Tummidihetti Barrage | మా వాళ్లు వ్యతిరేకించకపోతేనే.. మేం తుమ్మిడిహెట్టి ఎత్తుపై పరిశీలిస్తాం
- ●Harish Rao | తుమ్మిడిహెట్టి వద్ద నీళ్లే లేవు
- ●Hyderabad Police Nepal Gang Arrest | ఇంటి గుట్టు పట్టి.. యజమానురాలిని మట్టుబెట్టి: జూబ్లీహిల్స్ ఐపీఎస్ భార్య హత్య క్రైమ్ మిస్టరీ వీడింది!
- ●Telugu Web Series | కమల్ హాసన్ సూపర్ హిట్ మూవీ టైటిల్‌తో తెలుగు వెబ్‌సిరీస్ - స్ట్రీమింగ్ డేట్, ప్లాట్‌ఫామ్ ఇవే
- ●Honey Trap Case | ‘మూన్ బేబి 5973’ ఇన్‌స్టా ఐడీతో మల్లారెడ్డి స్టూడెంట్‌కు వల.. హనీట్రాప్ కేసులో వెలుగులోకి సంచలన విషయాలు

Chinese Manja Ban Hyderabad | నగరంలో ప్రాణాంతక చైనీస్ మాంజా విక్రయాలు: ముగ్గురు అరెస్ట్.. రూ.1.89 లక్షల స్టాక్ సీజ్!

Tummidihetti Barrage | మా వాళ్లు వ్యతిరేకించకపోతేనే.. మేం తుమ్మిడిహెట్టి ఎత్తుపై పరిశీలిస్తాం

Harish Rao | తుమ్మిడిహెట్టి వద్ద నీళ్లే లేవు

Hyderabad Police Nepal Gang Arrest | ఇంటి గుట్టు పట్టి.. యజమానురాలిని మట్టుబెట్టి: జూబ్లీహిల్స్ ఐపీఎస్ భార్య హత్య క్రైమ్ మిస్టరీ వీడింది!



