Australia Visa | ఆస్ట్రేలియా వీసా రూల్స్‌లో మార్పులు.. భారతీయులకు బయోమెట్రిక్స్ తప్పనిసరి..
Australia Visa | ఆస్ట్రేలియా వీసా కోసం దరఖాస్తు చేసుకునే భారతీయులకు కీలక మార్పులు అమల్లోకి వచ్చాయి. వీసా దరఖాస్తు ప్రక్రియలో భాగంగా వేలిముద్రలు, ముఖచిత్రాన్ని సమర్పించాల్సిన నిబంధనలను ఆస్ట్రేలియా విస్తరించింది. అక్టోబర్ 26 నుంచి ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చినట్లు న్యూఢిల్లీలోని ఆస్ట్రేలియా హైకమిషన్ వెల్లడించింది.
International | Published On Oct 27, 2026, 11.54 am IST
Australia Visa | ఆస్ట్రేలియా వీసా కోసం దరఖాస్తు చేసుకునే భారతీయులకు కీలక మార్పులు అమల్లోకి వచ్చాయి. వీసా దరఖాస్తు ప్రక్రియలో భాగంగా వేలిముద్రలు, ముఖచిత్రాన్ని సమర్పించాల్సిన నిబంధనలను ఆస్ట్రేలియా విస్తరించింది. అక్టోబర్ 26 నుంచి ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చినట్లు న్యూఢిల్లీలోని ఆస్ట్రేలియా హైకమిషన్ వెల్లడించింది. ఆస్ట్రేలియా బయోమెట్రిక్ సమాచార సేకరణ నిబంధనల విస్తరణ పరిధిలో భారత్‌తో పాటు దాదాపు 60 దేశాలు ఉన్నాయి. సురక్షితమైన, సమర్థవంతమైన, విశ్వసనీయమైన వీసా వ్యవస్థను కొనసాగించడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు హైకమిషన్ తెలిపింది.
బయోమెట్రిక్స్ ఎందుకు..?
బయోమెట్రిక్స్ అంటే వ్యక్తులను గుర్తించేందుకు ఉపయోగించే వేలిముద్రలు, ముఖచిత్రం వంటి శారీరక గుర్తింపు వివరాలు. వీసా కోసం దరఖాస్తు చేసుకున్న వ్యక్తి, దరఖాస్తులో పేర్కొన్న వ్యక్తేనా అనే విషయాన్ని నిర్ధారించేందుకు వీటిని ఉపయోగిస్తారు. ఆస్ట్రేలియా వీసా కోసం దరఖాస్తు చేసుకునే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా బయోమెట్రిక్స్ సమర్పించాల్సిన అవసరం లేదు. కొంతమంది దరఖాస్తుదారులను మాత్రమే వీటిని సమర్పించాలని కోరే అవకాశం ఉంది. ఎవరికి బయోమెట్రిక్స్ అవసరమో ఆస్ట్రేలియా హోం అఫైర్స్ విభాగం వ్యక్తిగతంగా తెలియజేస్తుంది. ఏయే వీసా కేటగిరీలకు ఈ నిబంధనలు వర్తిస్తాయనే వివరాలను అధికారులు వెల్లడించలేదు. బయోమెట్రిక్స్ సమర్పించాల్సిన వారికి ప్రక్రియను ఎలా పూర్తి చేయాలనే సూచనలు అందిస్తారు.
కొత్త దరఖాస్తుదారులకు మాత్రమే..
ఇప్పటికే వీసా కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఈ కొత్త నిబంధనలు వర్తించవు. అక్టోబర్ 26 నుంచి కొత్తగా సమర్పించే వీసా దరఖాస్తులకు మాత్రమే ఇవి వర్తిస్తాయి. అంతకుముందే దరఖాస్తు చేసిన వారి ప్రక్రియపై ఈ మార్పులు ప్రభావం చూపవు. దరఖాస్తుదారుల పరిస్థితిని బట్టి బయోమెట్రిక్స్ సమర్పించేందుకు రెండు మార్గాలు ఉన్నాయి. కొంతమంది ఆస్ట్రేలియన్ బయోమెట్రిక్స్ కలెక్షన్ సెంటర్ (ఏబీసీసీ)కు వ్యక్తిగతంగా వెళ్లి వేలిముద్రలు, ముఖచిత్రాన్ని సమర్పించాలి. మరికొందరు ఆస్ట్రేలియన్ ఇమ్మీ యాప్ ద్వారా డిజిటల్ పద్ధతిలో ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు. గతంలో ఏబీసీసీ కేంద్రంలో బయోమెట్రిక్స్ సమర్పించి, ప్రస్తుతం చెల్లుబాటులో ఉన్న పాస్‌పోర్ట్ కలిగి ఉన్న అర్హులైన దరఖాస్తుదారులు ఈ యాప్‌ను ఉచితంగా ఉపయోగించుకునే అవకాశం ఉంది. అయితే, ఈ సౌకర్యం అర్హత కలిగిన వారికి మాత్రమే అందుబాటులో ఉంటుంది.
సకాలంలో పూర్తి చేస్తే వీసా త్వరగా..
బయోమెట్రిక్స్ సమర్పించాల్సిన వారు ఆ ప్రక్రియను సకాలంలో పూర్తి చేస్తే వీసా దరఖాస్తుల పరిశీలనకు పట్టే సమయం మారదని అధికారులు భావిస్తున్నారు. అయితే, బయోమెట్రిక్స్ సమర్పించడంలో ఆలస్యం జరిగితే సంబంధిత వీసా దరఖాస్తు ప్రక్రియ కూడా ఆలస్యమయ్యే అవకాశం ఉంటుంది. బయోమెట్రిక్ సమాచారాన్ని ఆస్ట్రేలియా చట్టాలు, వర్తించే స్థానిక నిబంధనలకు అనుగుణంగా సేకరించి, భద్రపరిచి, నిర్వహిస్తామని హైకమిషన్ తెలిపింది. వ్యక్తిగత గోప్యత, సమాచార రక్షణకు సంబంధించిన భద్రతా చర్యలు కూడా అమలులో ఉంటాయని స్పష్టం చేసింది. ఆస్ట్రేలియా వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు దరఖాస్తు సమర్పించిన తర్వాత హోం అఫైర్స్ విభాగం నుంచి వచ్చే సూచనలను గమనించాలి. బయోమెట్రిక్స్ సమర్పించాలని కోరితే వీలైనంత త్వరగా ఆ ప్రక్రియను పూర్తి చేయాలి. మరిన్ని వివరాలను ఆస్ట్రేలియా హోం అఫైర్స్ అధికారిక వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.
వీసా, పౌరసత్వానికి సంబంధించిన సందేహాల కోసం ఆస్ట్రేలియా హైకమిషన్ హెల్ప్‌లైన్ నంబర్ +61 2 6196 0196ను సంప్రదించవచ్చు. ఈ సేవలు సోమవారం నుంచి శుక్రవారం వరకు స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉంటాయి.
తాజావార్తలు
- ●BTech student | స్నేహితుడిని బస్టాండ్‌లో దింపి వెళ్తుండగా ప్రమాదం.. బీటెక్ విద్యార్థి దుర్మరణం
- ●Gold And Silver Prices Today | బులియన్ మార్కెట్లలో అనిశ్చితి.. పసిడిపై ఒత్తిడి పెంచుతున్న డాలర్..
- ●Jayesh Ranjan | రిజ్వీ బాటలోనే జయేష్ రంజన్..? వీఆర్ఎస్కు దరఖాస్తు..?
- ●Stock Markets | క్రూడాయిల్ సెగ.. ఐటీ షేర్ల పతనం.. నష్టాల్లో సెన్సెక్స్, నిఫ్టీ..
- ●High Court CJ | హైకోర్టు కొత్త సీజేగా జస్టిస్ తపబ్రత చక్రవర్తి.. జస్టిస్ శ్యామ్ కోషికి పదోన్నతి
- ●Hyderabad | భార్యపై భర్త, ముగ్గురు స్నేహితుల సామూహిక లైంగికదాడి..

BTech student | స్నేహితుడిని బస్టాండ్‌లో దింపి వెళ్తుండగా ప్రమాదం.. బీటెక్ విద్యార్థి దుర్మరణం

Gold And Silver Prices Today | బులియన్ మార్కెట్లలో అనిశ్చితి.. పసిడిపై ఒత్తిడి పెంచుతున్న డాలర్..

Jayesh Ranjan | రిజ్వీ బాటలోనే జయేష్ రంజన్..? వీఆర్ఎస్కు దరఖాస్తు..?

Stock Markets | క్రూడాయిల్ సెగ.. ఐటీ షేర్ల పతనం.. నష్టాల్లో సెన్సెక్స్, నిఫ్టీ..



