KTR | అర్హత లేని ప్రాంతాలకు వరాలు.. అర్హతలున్న సిరిసిల్లకు మొండిచెయ్యా..?
KTR | సిరిసిల్ల మెగా పవర్ లూమ్ క్లస్టర్ మంజూరు విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ఉద్దేశపూర్వక జాప్యం, వివక్షపూరిత వైఖరిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు కేంద్ర టెక్స్‌టైల్‌శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్‌కు ఆయన ఘాటు లేఖ రాశారు.
- సిరిసిల్ల మెగా క్లస్టర్ జాప్యంపై కేటీఆర్ ఫైర్
- కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్‌కు ఘాటు లేఖ
KTR | సిరిసిల్ల మెగా పవర్ లూమ్ క్లస్టర్ మంజూరు విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ఉద్దేశపూర్వక జాప్యం, వివక్షపూరిత వైఖరిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు కేంద్ర టెక్స్‌టైల్‌శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్‌కు ఆయన ఘాటు లేఖ రాశారు. సిరిసిల్లలో మెగా పవర్ లూమ్ క్లస్టర్ ఏర్పాటు చేయాలనే డిమాండ్ నిన్నా మొన్నటిది కాదని.. గత పదేళ్లుగా నిరంతరాయంగం పోరాడుతున్నామన్నారు. గతంలో మంత్రిగా, బీఆర్ఎస్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యేగా, టెక్స్‌టైల్‌శాఖ మాజీ మంత్రిగా అనేక లేఖలు, వ్యక్తిగత సమావేశాలు, అధికారిక విజ్ఞప్తులు చేసినా ఇప్పటి వరకు కేంద్రం సానుకూలంగా నిర్ణయం తీసుకోకపోవడం అన్యాయమన్నారు.
ప్రతిపాదనను పక్కనపెట్టడంలో మర్మం ఏంటీ?
సిరిసిల్ల క్లస్టర్ ఏర్పాటు కోసం గత పదేళ్లలో సుమారు పది సార్లు కేంద్రమంత్రులను స్వయంగా కలిసి మెగా పవర్ లూం క్లస్టర్ కోసం నివేదికలు, వినతులు ఇచ్చామని కేటీఆర్ గుర్తు చేశారు. అరుణ్ జైట్లీ, స్మృతి ఇరానీ మొదలుకొని నేటి వరకు ప్రతి ఒక్కరినీ బతిమిలాడామని, సీపీసీడీఎస్ నిబంధనల ప్రకారం.. సిరిసిల్లకు అన్ని అర్హతలు ఉన్నాయని కేంద్ర బృందాలు ధ్రువీకరించినా ఫైళ్లను పక్కన పెట్టడం వెనుక ఉన్న మర్మమేమిటి..? తెలంగాణ అంటే కేంద్రానికి ఎందుకంత కక్ష? అంటూ ప్రశ్నించారు. ఇది కేవలం నిర్లక్ష్యం కాదని, తెలంగాణ అభివృద్ధిని, ముఖ్యంగా ఇక్కడి నేతన్నల పట్ల కేంద్రం చూపుతున్న వివక్ష అంటూ ఆరోపించారు. సిరిసిల్ల తెలంగాణ వస్త్ర పరిశ్రమకు గుండెకాయని పేర్కొన్న కేటీఆర్, అక్కడ 30వేలకుపైగా పవర్ లూమ్స్ కలిగి ఉండి.. వేలాది కుటుంబాలకు ఉపాధి కల్పిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు.
తెలంగాణపై కేంద్రానికి కక్షే
సిరిసిల్ల కంటే తక్కువ సామర్థ్యం, తక్కువ కార్మిక శక్తి ఉన్న ఇతర రాష్ట్రాల్లో ప్రాంతాలకు మెగా క్లస్టర్లను మంజూరు చేసిన కేంద్రం, అన్ని అర్హతలు ఉన్న సిరిసిల్లను పక్కన పెట్టడం ప్రాంతీయ వివక్షకు పరాకాష్ట అన్నారు. సిరిసిల్లకు మెగా క్లస్టర్ రాకపోవడానికి కారణం మెరిట్ లేకపోవడం కాదని, కేంద్రానికి తెలంగాణపై ఉన్న కక్షే అని విమర్శించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం మెగా క్లస్టర్ ఏర్పాటుకు అవసరమైన భూమి కేటాయింపు, నిరంతర విద్యుత్, నీరు, సింగిల్ విండో అనుమతులు, రాష్ట్రస్థాయి ప్రోత్సాహకాలు.. ఇలా ప్రతి ఒక్క అర్హతను పూర్తి చేసిందని కేటీఆర్ వివరించారు.
ఇదేనా చిత్తశుద్ధి..?
ఇవన్నీ సిద్ధంగా ఉన్నాయని పదేపదే చెబుతున్నా.. ఎలాంటి సాంకేతిక, ఆర్థిక కారణాలు చూపకుండా కేంద్రం ప్రతిపాదనను పెండింగ్‌లో పెట్టడం సిగ్గుచేటన్నారు. ఒకవైపు 'మేక్ ఇన్ ఇండియా', 'ఆత్మనిర్భర్ భారత్' అని గొప్పలు చెప్పుకుంటున్న కేంద్రం, దేశంలోనే అత్యంత సామర్థ్యం కలిగిన సిరిసిల్ల వంటి వస్త్ర పరిశ్రమ కేంద్రానికి మద్దతు ఇవ్వకపోవడం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ద్వంద నీతికి, చిత్తశుద్ది లేమికి అద్దం పడుతుందని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం కేవలం నినాదాలకే పరిమితం అయిందన్నారు. కేంద్రం చేస్తున్న ఈ జాప్యం వల్ల సిరిసిల్ల నేతన్నలు భారీ మూల్యం చెల్లించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం తక్షణం క్లస్టర్ ఏర్పాటు చేసి నా్యయం చేయాలని డిమాండ్ చేశారు.
BRS Working President @KTRBRS has written a letter to Union Minister for Textiles, Shri @girirajsinghbjp pointing out the need and also the persistent delay and discriminatory approach in sanctioning a Mega Power Loom Cluster for Sircilla, Telangana.
This letter is a… pic.twitter.com/pf8cQYZuB8
— BRS Party (@BRSparty) January 19, 2026
సంబంధిత వార్తలు

KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
మే 21, 2026

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026

CM Revanth Reddy | బండి భగీరథ్ సరెండర్ కాలేదు.. అరెస్టు చేశాం : సీఎం రేవంత్ రెడ్డి
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



