త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Fee Reimbursement | వెన‌క్కి మ‌ళ్లిన కేంద్ర నిధులు.. ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ చేసేదెలా?

Fee Reimbursement | అధికారులు నిర్ల‌క్ష్యం విద్యార్థుల‌కు శాపంగా మారింది. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఫీజు రీయింబ‌ర్స్‌మెంటు (Fee Reimbursement) కోసం కేంద్రం ప్ర‌భుత్వం త‌న వాటాగా రూ.276 కోట్లు విడుదల చేసింది. రాష్ట్ర ప్ర‌భుత్వం కూడా త‌న వాటాగా నిధులు విడుద‌ల చేయాల్సి ఉంది.

G

Telangana | Published On Apr 4, 2026, 8.15 am IST

Fee Reimbursement | వెన‌క్కి మ‌ళ్లిన కేంద్ర నిధులు.. ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ చేసేదెలా?
Advertisement

Fee Reimbursement | త్రినేత్ర‌.న్యూస్‌: అధికారులు నిర్ల‌క్ష్యం విద్యార్థుల‌కు శాపంగా మారింది. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఫీజు రీయింబ‌ర్స్‌మెంటు (Fee Reimbursement) కోసం కేంద్రం ప్ర‌భుత్వం త‌న వాటాగా రూ.276 కోట్లు విడుదల చేసింది. రాష్ట్ర ప్ర‌భుత్వం కూడా త‌న వాటాగా నిధులు విడుద‌ల చేయాల్సి ఉంది. అయితే అధికారుల నిష్క్రియా ప‌ర‌త్వంతో నిర్ణీత గ‌డువు ముగిసిపోయింది. దీంతో కేంద్ర నిధులు వెనక్కి వెళ్లాయి. ఈ వ్య‌వ‌హారంపై కేంద్ర గిరిజనశాఖ కార్యదర్శి రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ కోరారు. సర్కారు ఇచ్చే వివరణతో కేంద్రం సంతృప్తి చెందకపోతే ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల గతేడాది ఫీజు రీయుంబర్స్‌మెంట్‌ నిధులకు కోత పడనుంది. దీంతో ఆ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాల్సి ఉంటుంది.

రాష్ట్రంలో ఇంజినీరింగ్‌, ఫార్మసీ, ఇతర వృత్తివిద్యా కోర్సులు చదివే ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు కేంద్రం ప్రతీ సంవ‌త్స‌రం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులు అందిస్తున్న‌ది. ఈమేరకు 2025-26 విద్యా సంవత్సరానికి గాను రూ. 276 కోట్లు విడుదల చేసింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా రూ.69 కోట్లు (25శాతం) మార్చి 31లోపు చెల్లించాలి. ఈ మేరకు ప్రభుత్వాన్ని విద్యాశాఖ కోరినప్ప‌టికీ సీఎం కార్యాలయం నుంచి స్పందన రాలేదు. గ‌డువు ముగిసిపోవ‌డంతో కేంద్ర నిధులు వెనక్కిమళ్లాయి. రాష్ట్రంలో కాలేజీల‌కు చెల్లించాల్సిన‌ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు భారీగా పేరుకుపోయిన విష‌యం తెలిసిందే. గత నాలుగేండ్లుగా బాకీపడ్డ రూ.7500 కోట్ల నిధుల‌ను ఎలా స‌ర్దుబాటు చేయాలని ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతున్న‌ది. అధికారుల అనాలోచిత ప‌నుల‌తో ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల కోసం కేంద్రం ఇచ్చిన నిధులను కూడా స‌ద్వినియోగం చేసుకోలేక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

 

Advertisement

తాజావార్తలు

Advertisement