Cartoonist Shankar | అవునూ.. ఆ ఫోటో చూసి చిరంజీవి ఏమో అంటుండే..!
Cartoonist Shankar | ప్రముఖ కార్టూనిస్ట్ శేఖర్ స్మారక అవార్డు ప్రదానోత్సవ సభలో కార్టూనిస్ట్ శంకర్.. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌తో తనకు జరిగిన ఆత్మీయ సంభాషణను నెమరేసుకున్నారు. కేసీఆర్ గారిపై కార్టూన్ గీసినందుకు కేసు పడుతుందనుకుంటే, ఆయన ప్రేమగా ఇంటికి పిలిచి భోజనం పెట్టారు అని గుర్తు చేశారు.
Cartoonist Shankar | త్రినేత్ర.న్యూస్ : ప్రముఖ కార్టూనిస్ట్ శేఖర్ స్మారక అవార్డు ప్రదానోత్సవ సభలో కార్టూనిస్ట్ శంకర్.. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌తో తనకు జరిగిన ఆత్మీయ సంభాషణను నెమరేసుకున్నారు. కేసీఆర్ గారిపై కార్టూన్ గీసినందుకు కేసు పడుతుందనుకుంటే, ఆయన ప్రేమగా ఇంటికి పిలిచి భోజనం పెట్టారు అని గుర్తు చేశారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన ఈ సమావేశంలో కేటీఆర్‌కు ఉన్న సెన్స్ ఆఫ్ హ్యుమర్‌ను కూడా శంకర్ వివరించారు.
కేసీఆర్, కేటీఆర్ సెన్స్ ఆఫ్ హ్యుమర్‌పై కార్టూనిస్ట్ శంకర్ ఇలా..
ఇప్పటికీ అభిమాన పొలిటికల్ లీడర్ కేటీఆర్ గారూ.. ఒక కార్టూనిస్ట్‌గా అది నేను గర్వంగా చెప్పగలుగుతా. ఆ రోజు నేను కేటీఆర్ గారు వస్తే ఆహ్వానించడానికి ముందు వచ్చాను. ఇట్లనే కారు దిగి వస్తున్నడు. ఇదే నా బ్యాగు సంకకు వేసుకుని మెట్లు ఎక్కుతున్న.. వెనుకాల కేటీఆర్ గారు ఉన్నారు. అన్నా ఈ బ్యాగు లేకుంటే నీకు ఏమన్న బ్యాలెన్స్ తప్పుతదా..? అన్నడు. ఎంత సెన్స్ ఆఫ్ హ్యుమర్.. నైట్ కూడా బ్యాగు సంకకు వేసుకుని పడుకుంటవా అన్న అని కూడా అన్నడు. ఇంత పొలిటికల్ లీడర్ స్విచ్ఛాఫ్.. స్విచ్ఛాన్ లాగా, ఇంట్లోకి పోతే హజ్బెండ్ లాగా, తండ్రి దగ్గర కొడుకులాగా ఎట్ల సాధ్యం.. ఎందుకంటే ఇంటి నిండా కూడా వీరికి కార్యకర్తలే ఉంటరు. వీళ్లకి సెన్స్ ఆఫ్ హ్యుమర్ ఎక్కువ.. అది నాకు చాలా ఆశ్చర్యమనిపించి తర్వాత మీ మీద చాలా అభిమానం కూడా పెరిగింది.
2005లో నేను ఆర్ట్ గ్యాలరీలో ఎగ్జిబిషన్ పెట్టాను. అప్పుడు కేసీఆర్ గారికి రింగ్ రింగ్‌లుగా ఎత్తుగా జుట్టు ఉండేది. కార్టూనిస్ట్‌లు సాధారణంగా ఏం చేస్తారంటే ఒక కార్టూన్ ఐడెంటిఫికేషన్ కోసం ఒక క్యారెక్టర్‌ను డిసైడ్ చేసుకుంటం. యస్ హైలెట్ చేయడం.. అయితే కేసీఆర్ గారికి ఏం చేశానంటే.. ఆయన నెత్తిలో తెలంగాణ మ్యాప్ పెట్టాను.. అది కుదిరింది ఆయనకు. ఆ ఎగ్జిబిషన్‌కు వచ్చిండు.. దాన్ని చిరంజీవి ఇన్యాగురేషన్ చేసిండు. ఆ అబ్బాయిని లంచ్‌కు పిలుద్దామని అన్నాడు. అసలు ఒక పొలిటికల్ లీడర్ నా మీద ఇట్ల వేసిండు అని కేసులు పెడుతడు. లంచ్‌కు పిలవడమనేది కూడా నాకు చాలా విచిత్రమైంది. పిలిచినా రూమ్‌లో వేసి ఏమన్న చేస్తారా..? ఫీచర్స్ కుదిరాయా లేవా..? నా వర్షన్‌లో నేను ఇట్ల అనుకుని వేసినా.. వాళ్లకు ఎట్ల ఉందో, ఫ్యామిలీ పరంగా బయటి నుంచి చూస్తే ఎట్ల ఉందో.. ఇక ఒక మధ్యవర్తి వచ్చిండు తీసుకుని పోయిండు. అసలు ఈనుంచి ఆడిదాకా ఐటెమ్స్ పెట్టిండు.. తర్వాత ఏమైతదో తెల్వదు. మంచిగా తిన్న తర్వాత ఆ చిరంజీవి నెత్తిన వేలు పెట్టి ఏమో అంటుండే అన్నడు. అంటే నెత్తిన తెలంగాణ ఎందుకు వేసినవ్ అని అడిగిండు అంటే.. నువ్వేం చెప్పినవ్ అంటే.. కేసీఆర్ తల తాకట్టు పెట్టైనా తెలంగాణ తెస్తాడు అని తలలో తెలంగాణను గీశాను అని చెబితే హగ్ చేసుకున్నడు. బహుషా నా లైఫ్‌లో ఒక అద్భుతం జరిగిందంటే అదేనేమో..! ఒక పెద్ద అంటే చూస్తానికి కూడా దొరకని మనిషి.. ఒక కార్టూన్.. మా హీరో మా కార్టూన్.. క్యారికేచరే. అదే సమయంలో మీకు చెబుతున్నా.. ఒక పత్రికాధిపతి మీద క్యారికేచర్ వేసినప్పుడు ఆ కేసు మూడున్నర సంవత్సరాలు నడిచింది.. తమిళనాడు, బెంగాల్‌లో చాలా చోట్ల యూపీలో కానీ కార్టూనిస్టులపై భయంకరంగా కేసులు పెడుతున్నరు అని కార్టూనిస్ట్ శంకర్ తెలిపారు.
సంబంధిత వార్తలు

Srinivas Goud | జూరాలకు వరదొస్తోంది.. అయినా నెట్టెంపాడు, భీమాకోయిల్ సాగర్ మోటార్లు ఎందుకు ఆన్ చేస్తలేరు?
జులై 27, 2026

Ramchandar Rao | ఖర్గేను తప్పించి యువ నాయకున్ని ఎన్నుకోండి.. మేం నితిన్ నబిన్‌కు అవకాశం ఇచ్చాం కదా..
జులై 27, 2026

Vakiti Srihari | పాలమూరు ప్రజలను మరోసారి మోసం చేయొద్దు: మంత్రి వాకిటి శ్రీహరి
జులై 27, 2026
తాజావార్తలు
- ●Venkatesh | ఫ్యామిలీ మ్యాన్‌గా వెంకటేష్ - ఆదర్శకుటుంబం నుంచి చిట్టిబాబు గ్లింప్స్ రిలీజ్
- ●Ramchandar Rao | ఖర్గేను తప్పించి యువ నాయకున్ని ఎన్నుకోండి.. మేం నితిన్ నబిన్‌కు అవకాశం ఇచ్చాం కదా..
- ●NEET Aspirant Dies | ఆగని నీట్ విద్యార్థుల ఆత్మహత్యలు.. మరో యువతి బలవన్మరణం
- ●Bhumi Pednekar | ఛత్రపతి శివాజీని ఓడించిన రాణి పాత్రలో బాలీవుడ్ హీరోయిన్ - రిషబ్ శెట్టి పాన్ ఇండియన్ మూవీపై అప్డేట్
- ●Dharmendra Pradhan | రాజీనామా తర్వాత తొలిసారి పార్లమెంట్‌కు వెళ్లిన ధర్మేంద్ర ప్రధాన్.. ఎంపీలు ఏం చేశారంటే..?
- ●Anti Paper Leak Bill | లోక్‌సభ ముందుకు యాంటీ పేపర్ లీక్ బిల్లు.. విపక్ష ఎంపీల ఆందోళన

Venkatesh | ఫ్యామిలీ మ్యాన్‌గా వెంకటేష్ - ఆదర్శకుటుంబం నుంచి చిట్టిబాబు గ్లింప్స్ రిలీజ్

Ramchandar Rao | ఖర్గేను తప్పించి యువ నాయకున్ని ఎన్నుకోండి.. మేం నితిన్ నబిన్‌కు అవకాశం ఇచ్చాం కదా..

NEET Aspirant Dies | ఆగని నీట్ విద్యార్థుల ఆత్మహత్యలు.. మరో యువతి బలవన్మరణం

Bhumi Pednekar | ఛత్రపతి శివాజీని ఓడించిన రాణి పాత్రలో బాలీవుడ్ హీరోయిన్ - రిషబ్ శెట్టి పాన్ ఇండియన్ మూవీపై అప్డేట్



