Accident in America | అమెరికాలో చెట్టును ఢీకొట్టిన కారు.. ముగ్గురు తెలంగాణ విద్యార్థుల దుర్మరణం
Accident in America | అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో జరిగిన కారు ప్రమాదంలో తెలంగాణకు చెందిన ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఒకరు నిజామాబాద్‌కు చెందిన విద్యార్థిగా అక్కడి పోలీసులు గుర్తించారు.
Accident in America | త్రినేత్ర.న్యూస్: ఎన్నో కలలు, కన్నోళ్ల ఊసులను మోసుకుంటూ మూడు నెలల క్రితమే వారు అమెరికా వెళ్లారు. బాగా చదువుకొని జీవితంలో స్థిరపడి తల్లిదండ్రులను చూసుకోవాలని అనుకున్నారు. కానీ విధికి కన్ను కుట్టిందో ఏమో.. రోడ్డు ప్రమాదం వారిని కబళించింది. మూడు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో జరిగిన కారు ప్రమాదంలో తెలంగాణకు చెందిన ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఒకరు నిజామాబాద్‌కు చెందిన విద్యార్థిగా అక్కడి పోలీసులు గుర్తించారు.
ఫ్లోరిడా పోలీసు అధికారుల ప్రకారం.. అమెరికా కాలమాన ప్రకారం ఫ్లోరిడా హైవేలోని బ్రెవార్డ్ కౌంటీ ప్రాంతంలో ఉదయం 10 గంటలకు పామ్ బేలోని 172వ మైలురాయి వద్ద ఓ ప్రమాదం చోటు చేసుకుంది. రహదారిపై ఉత్తరం వైపు ప్రయాణిస్తున్న ఓ వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కనున్న చెట్టును బలంగా ఢీ కొట్టింది. దీంతో వాహనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ మంటల్లో చిక్కుకుని ముగ్గురు యువకులు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరి వివరాలతో పాటు, ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మృతుల్లో ఒకరిని నిజామాబాద్ జిల్లా నవీపేట్‌కు చెందిన రాహుల్‌గా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన సమాచారాన్ని బాధిత కుటుంబ సభ్యులకు తెలియజేశారు. కుమారుడి మరణవార్త తెలుసుకున్న హరిబాబు, నాగమణి కన్నీరుమున్నీరవుతున్నారు.
నా కుమారుడు రాహుల్ ఎంఎస్ అయిపోయింది. సౌత్ ఫ్లోరిడాలో పీహెచ్డీ చేయాలని అక్కడే ఉన్నాడు. ఉదయం 3 గంటలకు రోడ్డు ప్రమాదం జరిగినట్లు తెలిసింది. కారులో మొత్తం ముగ్గురున్నారు. ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. రాహుల్ ఈరోజు చనిపోయాడని చెబుతున్నారు. అక్కడ దర్యాప్తు జరుగుతుంది. మా రాహుల్ మృతదేహం తొందరగా ఇక్కడి వచ్చేలా ప్రభుత్వం సాయం చేయాలి అని రాహుల్ తండ్రి హరిబాబు విజ్ఞప్తి చేశారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Dasoju Sravan Kumar | కుల గణనలో ఓబీసీ కేటగిరీ చేర్చాలి
- ●IPO | ఐపీఓ మార్కెట్లలో జోరు.. ఈ నాలుగు ఇష్యూలపై ఇన్వెస్టర్ల ఫోకస్..
- ●Vemula Prashanth Reddy | ఎథిక్స్ గురించి మాట్లాడే అర్హత సీఎంకు ఉందా..?
- ●Konda Murali | కాంగ్రెస్‌ను వీడం.. నా బిడ్డ వ్యాఖ్యలతో మాకు సంబంధం లేదు: కొండా మురళి
- ●Konda Surekha Resignation | కొండా సురేఖ వ్యవహారం : మీరే చూసుకోండి.. అంతా భట్టికే వదిలేసిన హైకమాండ్
- ●Onam 2026 | ఓనం స్పెషల్.. ట్రెడిషనల్ లుక్‌లో మెరిసిన తారలు

Dasoju Sravan Kumar | కుల గణనలో ఓబీసీ కేటగిరీ చేర్చాలి

IPO | ఐపీఓ మార్కెట్లలో జోరు.. ఈ నాలుగు ఇష్యూలపై ఇన్వెస్టర్ల ఫోకస్..

Vemula Prashanth Reddy | ఎథిక్స్ గురించి మాట్లాడే అర్హత సీఎంకు ఉందా..?

Konda Murali | కాంగ్రెస్‌ను వీడం.. నా బిడ్డ వ్యాఖ్యలతో మాకు సంబంధం లేదు: కొండా మురళి






