త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

IPO | ఐపీఓ మార్కెట్‌ల‌లో జోరు.. ఈ నాలుగు ఇష్యూలపై ఇన్వెస్టర్ల ఫోకస్..

IPO | ఈ వారం ఐపీఓ మార్కెట్‌ సందడిగా కొనసాగుతోంది. ప్రస్తుతం నాలుగు పబ్లిక్‌ ఇష్యూలు ఇన్వెస్టర్ల కోసం అందుబాటులో ఉన్నాయి. స్కైవేస్‌ ఎయిర్‌ సర్వీసెస్‌, సింబయోటెక్‌ ఫార్మాల్యాబ్‌, హై-టెక్‌ ఇంజినీర్స్‌ ఐపీఓలకు సబ్‌స్క్రిప్షన్‌ ఆగస్టు 27న ముగియనుంది. మరోవైపు అను ప్రాజెక్ట్స్‌ ఐపీఓ ఆగస్టు 28 వరకు కొనసాగుతుంది.

S

Business | Published On Aug 26, 2026, 3.39 pm IST

IPO | ఐపీఓ మార్కెట్‌ల‌లో జోరు.. ఈ నాలుగు ఇష్యూలపై ఇన్వెస్టర్ల ఫోకస్..
Advertisement

IPO | ఈ వారం ఐపీఓ మార్కెట్‌ సందడిగా కొనసాగుతోంది. ప్రస్తుతం నాలుగు పబ్లిక్‌ ఇష్యూలు ఇన్వెస్టర్ల కోసం అందుబాటులో ఉన్నాయి. స్కైవేస్‌ ఎయిర్‌ సర్వీసెస్‌, సింబయోటెక్‌ ఫార్మాల్యాబ్‌, హై-టెక్‌ ఇంజినీర్స్‌ ఐపీఓలకు సబ్‌స్క్రిప్షన్‌ ఆగస్టు 27న ముగియనుంది. మరోవైపు అను ప్రాజెక్ట్స్‌ ఐపీఓ ఆగస్టు 28 వరకు కొనసాగుతుంది. స్కైవేస్‌ ఎయిర్‌ సర్వీసెస్‌ ఐపీఓ ద్వారా రూ.582.8 కోట్లను సమీకరించాలని లక్ష్యంగా నిర్ణ‌యించుకుంది. ఇందులో రూ.398.8 కోట్ల తాజా షేర్ల జారీతోపాటు రూ.184 కోట్ల ఆఫర్‌ ఫర్‌ సేల్‌ ఉంది. ఈ సంస్థ సమగ్ర లాజిస్టిక్స్‌, సరఫరా గొలుసు పరిష్కారాలను అందిస్తోంది. ఎయిర్‌ ఫ్రైట్‌, ఓషన్‌ ఫ్రైట్‌, వేర్‌హౌసింగ్‌, కస్టమ్స్‌ క్లియరెన్స్‌ వంటి సేవలను అందిస్తోంది. ఈ ఐపీఓకు ఒక్కో షేరుకు రూ.131 నుంచి రూ.138 ధరల శ్రేణిని నిర్ణయించారు. ఒక లాట్‌లో 100 షేర్లు ఉంటాయి. ఎగువ ధర రూ.138 ప్రకారం రిటైల్‌ ఇన్వెస్టర్‌ కనీసం రూ.13,800 పెట్టుబడి పెట్టాలి. ఆగస్టు 24న ప్రారంభమైన ఐపీఓ ఆగస్టు 27న ముగుస్తుంది. ఆగస్టు 28న షేర్ల కేటాయింపు జరిగే అవకాశం ఉంది. సెప్టెంబర్‌ 1న బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈల్లో షేర్లు లిస్ట్‌ అయ్యే అవకాశం ఉంది.

స్కైవేస్‌ ఎయిర్‌ సర్వీసెస్‌..

బుధవారం నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ డేటా ప్రకారం స్కైవేస్‌ ఎయిర్‌ సర్వీసెస్‌ ఐపీఓ 3.53 రెట్లు సబ్‌స్క్రైబ్‌ అయింది. అందుబాటులో ఉన్న 1,79,27,144 షేర్లకు గాను 35,08,93,398 షేర్లకు బిడ్లు వచ్చాయి. క్యూఐబీ వాటా 0.48 రెట్లు, రిటైల్‌ ఇన్వెస్టర్‌ వాటా 5.05 రెట్లు, ఎన్‌ఐఐ విభాగం 4.06 రెట్లు సబ్‌స్క్రైబ్‌ అయ్యాయి. ఎన్‌ఐఐ విభాగంలో చిన్న ఎన్‌ఐఐ వాటా 6.12 రెట్లు, పెద్ద ఎన్‌ఐఐ వాటా 3.04 రెట్లు సబ్‌స్క్రైబ్‌ అయ్యాయి. గ్రే మార్కెట్‌లో స్కైవేస్‌ ఎయిర్‌ సర్వీసెస్‌ ఐపీఓకు ప్రస్తుతం రూ.29 ప్రీమియం ఉంది. అంటే గరిష్ఠ ఐపీఓ ధర రూ.138తో పోలిస్తే సుమారు 21.01 శాతం ప్రీమియం సూచిస్తోంది. సింబయోటెక్‌ ఫార్మాల్యాబ్‌ ఐపీఓ ఈ నాలుగు ఇష్యూల్లో అతిపెద్దది. మొత్తం రూ.1,757 కోట్లను సమీకరించనుంది. ఇందులో రూ.150 కోట్ల తాజా షేర్ల జారీ ఉండగా, రూ.1,607 కోట్ల విలువైన ఆఫర్‌ ఫర్‌ సేల్‌ ఉంది. ఈ ఫార్మాస్యూటికల్‌ సంస్థ ఏపీఐలు, కాంట్రాక్ట్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ సర్వీసెస్‌, కాంప్లెక్స్‌ ఇంజెక్టబుల్‌ ఉత్పత్తుల విభాగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. స్టెరాయిడల్‌, కార్టికోస్టెరాయిడ్‌ ఏపీఐలలో సంస్థకు గణనీయమైన ఉనికి ఉంది. అంతర్జాతీయ మార్కెట్లలోని కస్టమర్లకు సేవలు అందిస్తోంది.

సింబయోటెక్‌ ఫార్మాల్యాబ్‌..

సింబయోటెక్‌ ఫార్మాల్యాబ్‌ ఐపీఓ ధరల శ్రేణిని ఒక్కో షేరుకు రూ.938 నుంచి రూ.988గా నిర్ణయించారు. ఒక లాట్‌లో 15 షేర్లు ఉంటాయి. గరిష్ఠ ధర ప్రకారం కనీస పెట్టుబడి రూ.14,820. ఆగస్టు 24న ప్రారంభమైన ఇష్యూ ఆగస్టు 27న ముగుస్తుంది. ఆగస్టు 28న కేటాయింపు జరిగే అవకాశం ఉంది. సెప్టెంబర్‌ 1న షేర్ల లిస్టింగ్‌ జరగనుంది. ఈ ఐపీఓ ఇప్ప‌టి వ‌ర‌కు 3.38 రెట్లు సబ్‌స్క్రైబ్‌ అయింది. మొత్తం 1,24,60,533 షేర్లకు గాను 4,20,88,380 షేర్లకు బిడ్లు వచ్చాయి. క్యూఐబీ వాటా 0.58 రెట్లు, రిటైల్‌ విభాగం 3.61 రెట్లు, ఎన్‌ఐఐ విభాగం 6.56 రెట్లు సబ్‌స్క్రైబ్‌ అయ్యాయి. చిన్న ఎన్‌ఐఐ వాటా 8.37 రెట్లు, పెద్ద ఎన్‌ఐఐ వాటా 5.66 రెట్లు బుక్‌ అయ్యాయి. సింబయోటెక్‌ ఫార్మాల్యాబ్‌ ఐపీఓకు గ్రే మార్కెట్‌లో రూ.345 ప్రీమియం ఉంది. రూ.988 గరిష్ఠ ఇష్యూ ధరతో పోలిస్తే ఇది 34.92 శాతం ప్రీమియాన్ని సూచిస్తోంది.

హై-టెక్‌ ఇంజినీర్స్‌..

హై-టెక్‌ ఇంజినీర్స్‌ ఐపీఓ పారిశ్రామిక అవసరాలకు ఉపయోగించే హైడ్రాలిక్‌ ఫిట్టింగ్స్‌, సంబంధిత ఉత్పత్తులను తయారు చేసే ఇంజినీరింగ్‌ సంస్థకు సంబంధించినది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లో సంస్థకు ఆరు తయారీ కేంద్రాలు ఉన్నాయి. ఈ ఐపీఓలో ఒక్కో షేరు ధరను రూ.50 నుంచి రూ.53గా నిర్ణయించారు. ఒక లాట్‌లో 283 షేర్లు ఉంటాయి. గరిష్ఠ ధర రూ.53 ప్రకారం ఒక లాట్‌కు కనీస పెట్టుబడి రూ.14,999. ఆగస్టు 24న ప్రారంభమైన ఇష్యూ ఆగస్టు 27న ముగుస్తుంది. ఆగస్టు 28న కేటాయింపు జరిగే అవకాశం ఉండగా, సెప్టెంబర్‌ 1న బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈల్లో లిస్టింగ్‌ కానుంది. సబ్‌స్క్రిప్షన్‌ పరంగా హై-టెక్‌ ఇంజినీర్స్‌ ఐపీఓ దూసుకెళ్తోంది. ఇప్ప‌టి వరకు 33.69 రెట్లు సబ్‌స్క్రైబ్‌ అయింది. 1,79,27,144 షేర్లకు గాను 60,38,98,794 షేర్లకు బిడ్లు వచ్చాయి. క్యూఐబీ వాటా 0.68 రెట్లు మాత్రమే సబ్‌స్క్రైబ్‌ కాగా, రిటైల్‌ విభాగం ఏకంగా 45.88 రెట్లు బుక్‌ అయింది. ఎన్‌ఐఐ విభాగం 49.24 రెట్లు సబ్‌స్క్రైబ్‌ అయింది. ఇందులో చిన్న ఎన్‌ఐఐ వాటా 84.66 రెట్లు, పెద్ద ఎన్‌ఐఐ వాటా 31.52 రెట్లు సబ్‌స్క్రైబ్‌ అయ్యాయి. హై-టెక్‌ ఇంజినీర్స్‌ ఐపీఓ గ్రే మార్కెట్‌ ప్రీమియం ప్రస్తుతం రూ.38గా ఉంది. రూ.53 గరిష్ఠ ఇష్యూ ధరతో పోలిస్తే ఇది 71.70 శాతం ప్రీమియాన్ని సూచిస్తోంది.

అను ప్రాజెక్ట్స్‌..

అను ప్రాజెక్ట్స్‌ ఐపీఓ ద్వారా రూ.175.06 కోట్లను తాజా షేర్ల జారీ ద్వారా సమీకరిస్తోంది. ఇందులో ఆఫర్‌ ఫర్‌ సేల్‌ భాగం లేదు. టెలికాం మౌలిక వసతులు, మురుగునీటి మౌలిక వసతులు, గ్యాస్‌ పైప్‌లైన్‌ ప్రాజెక్టులతో పాటు పలు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ పనుల్లో సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఈ ఐపీఓ ధరల శ్రేణిని ఒక్కో షేరుకు రూ.94 నుంచి రూ.99గా నిర్ణయించారు. ఒక లాట్‌లో 151 షేర్లు ఉంటాయి. గరిష్ఠ ధర ప్రకారం ఒక లాట్‌కు కనీస పెట్టుబడి రూ.14,949. ఆగస్టు 25న ప్రారంభమైన ఐపీఓ ఆగస్టు 28 వరకు కొనసాగుతుంది. ఆగస్టు 31న షేర్ల కేటాయింపు జరిగే అవకాశం ఉంది. అదే సమయంలో రీఫండ్లు ప్రారంభం కానున్నాయి. సెప్టెంబర్‌ 1న షేర్లు డీమ్యాట్‌ ఖాతాల్లో జమ అవుతాయి. సెప్టెంబర్‌ 2న లిస్టింగ్‌ జరిగే అవకాశం ఉంది. అను ప్రాజెక్ట్స్‌ ఐపీఓకు మాత్రం ఇప్పటివరకు పెద్దగా స్పందన కనిపించలేదు. ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం ఇష్యూ 0.41 రెట్లు మాత్రమే సబ్‌స్క్రైబ్‌ అయింది. 1,76,83,000 షేర్లకు గాను 73,00,095 షేర్లకు బిడ్లు వచ్చాయి. క్యూఐబీ విభాగం 0.57 రెట్లు, రిటైల్‌ విభాగం 0.41 రెట్లు, ఎన్‌ఐఐ విభాగం 0.37 రెట్లు సబ్‌స్క్రైబ్‌ అయ్యాయి. చిన్న ఎన్‌ఐఐ విభాగం 0.46 రెట్లు, పెద్ద ఎన్‌ఐఐ విభాగం 0.33 రెట్లు మాత్రమే బుక్‌ అయ్యాయి. అను ప్రాజెక్ట్స్‌ ఐపీఓ గ్రే మార్కెట్‌ ప్రీమియం ప్రస్తుతం రూ.4గా ఉంది. రూ.99 గరిష్ఠ ఇష్యూ ధరతో పోలిస్తే ఇది కేవలం 4.04 శాతం ప్రీమియాన్ని సూచిస్తోంది.

Advertisement
Advertisement