Ganesh Bigala | నిజామాబాద్ ప్రజలను పొంగులేటి మోసం చేశారు
Ganesh Bigala | నిజామాబాద్ అర్బన్‌లో 396 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను ఇందిరమ్మ ఇళ్లుగా పేర్కొంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రజలను మోసం చేశారని మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
- పట్టాలు ఇచ్చి చేతులు దులుపుకున్నరు
- 22-ఏ విషయంలో ప్రజల్లో ఆగ్రహం
- మాజీ ఎమ్మెల్యే గణేశ్ గుప్తా
Ganesh Bigala | నిజామాబాద్ అర్బన్‌లో 396 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను ఇందిరమ్మ ఇళ్లుగా పేర్కొంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రజలను మోసం చేశారని మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నిజామాబాద్ అర్బన్‌లో 1,500 ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని ప్రకటించి.. కేవలం 300 ఇళ్లు మాత్రమే నిర్మించారని విమర్శించారు. ఆడిటోరియంలో లబ్ధిదారులకు పట్టాలు అందజేసి మంత్రి చేతులు దులుపుకున్నారని ఆరోపించారు. పోచారం శ్రీనివాస్‌రెడ్డిని పక్కన కూర్చోబెట్టుకుని కేసీఆర్ ఇళ్లు నిర్మించలేదని పొంగులేటి చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. కేసీఆర్ హయాంలో బాన్సువాడలో 11 వేల డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు నిర్మించినట్లు తెలిపారు.
కాంగ్రెస్-బీజేపీ కుమ్మక్కు
నిజామాబాద్‌లో కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు రాజకీయాలు బయటపడ్డాయని బిగాల ఆరోపించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు 50 మందితో ధర్నా పేరుతో హడావుడి చేశారని, బీఆర్‌ఎస్ నేతలను మాత్రం హౌస్ అరెస్టులు చేస్తున్నారని అన్నారు. ధర్నాలు చేసుకునే అవకాశం బీజేపీకి ఇచ్చినట్లే బీఆర్‌ఎస్‌కు కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. 22-ఏ నిబంధనల విషయంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోందని అన్నారు. 22-ఏ పేరుతో డబ్బులు వసూలు చేసే పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు. సీఎం, మంత్రుల మధ్య.. మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య సఖ్యత లేదని వ్యాఖ్యానించారు. మంత్రులు 30, 12 శాతం కమీషన్లు వసూలు చేస్తున్నారంటూ ఆరోపణలు చేశారు.
సర్వేల్లో బీఆర్ఎస్ విజయం ఖాయమని తేలింది..
కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరు నెలల్లోనే ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని, కాంగ్రెస్, బీజేపీ నేతలు నిర్వహించిన సర్వేల్లో బీఆర్‌ఎస్ గెలుపు ఖాయమని తేలిందని బిగాల పేర్కొన్నారు. కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు రాజకీయాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని తెలిపారు. నిజామాబాద్ ప్రజలకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సుమిత్రానంద్, అల్లీపురం వెంకటేశ్వర్‌రెడ్డి, మన్నె గోవర్ధన్‌రెడ్డి, బొమ్మెర రామమూర్తి పాల్గొన్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●TGEHS | ఈహెచ్ఎస్పై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి.. దేవీప్రసాద్ డిమాండ్..
- ●Meenakshi Chaudhary | ‘కాకా’లో మీనాక్షి చౌదరి.. మెగాస్టార్ సినిమాలో అదిరిపోయే రోల్!
- ●Kiara Advani | హైదరాబాద్ నాకు మరో పుట్టిల్లు - టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కియారా అద్వానీ కామెంట్స్
- ●TG Weather | తెలంగాణలో మూడురోజులు అతిభారీ వర్షాలు.. హెచ్చరికలు జారీ చేసిన వాతావరణశాఖ
- ●Maharashtra Hill Tragedy | ఐఫోన్ EMI గొడవతో కొండపై నుంచి పడి కుటుంబం బలి.. తల్లి చివరి వీడియో వైరల్
- ●Auto Strike | సమ్మెకు వెళ్తున్నాం.. సహకరించండి.. రేపు వేలాది మందితో భారీ ప్రదర్శన చేపడతాం

TGEHS | ఈహెచ్ఎస్పై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి.. దేవీప్రసాద్ డిమాండ్..

Meenakshi Chaudhary | ‘కాకా’లో మీనాక్షి చౌదరి.. మెగాస్టార్ సినిమాలో అదిరిపోయే రోల్!

Kiara Advani | హైదరాబాద్ నాకు మరో పుట్టిల్లు - టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కియారా అద్వానీ కామెంట్స్

TG Weather | తెలంగాణలో మూడురోజులు అతిభారీ వర్షాలు.. హెచ్చరికలు జారీ చేసిన వాతావరణశాఖ



