Stock Markets | నష్టాల్లో ట్రేడ్ అవుతున్న స్టాక్ మార్కెట్లు.. నమ్మకం కోల్పోతున్న పెట్టుబడిదారులు..
Stock Markets | ఇరాన్‌తో అమెరికా చేస్తున్న యుద్ధం త్వరగా ముగుస్తుందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పిన నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లకు కొత్త ఉత్సాహం వచ్చింది. అన్ని దేశాలకు చెందిన ప్రధాన సూచీలు భారీ లాభాలను నమోదు చేశాయి.
Stock Markets | ఇరాన్‌తో అమెరికా చేస్తున్న యుద్ధం త్వరగా ముగుస్తుందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పిన నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లకు కొత్త ఉత్సాహం వచ్చింది. అన్ని దేశాలకు చెందిన ప్రధాన సూచీలు భారీ లాభాలను నమోదు చేశాయి. అయితే హోర్ముజ్ జలసంధిని మూసేయడంతోపాటు యుద్ధం ఇప్పుడప్పుడే ముగియదు అన్న సంకేతాలు వెలువడుతుండడంతో పెట్టుబడిదారుల నమ్మకం క్రమ క్రమంగా తగ్గుతోంది. దీంతో దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం నాటి ట్రేడింగ్ సెషన్‌లో స్వల్ప నష్టాల్లో కొనసాగుతున్నాయి. క్రితం సెషన్‌లో నిఫ్టీ భారీగా లాభపడి 24,261 వద్ద ముగియగా, సెన్సెక్స్ 78,205 వద్ద ముగిసింది. అయితే ప్రస్తుతం దాదాపు అన్ని ప్రధాన దేశీయ సూచీలు స్వల్ప నష్టాల్లోనే ఉన్నాయి. నిఫ్టీ ఫ్లాట్‌గా ఓపెన్ అయి బుధవారం ఉదయం 10 గంటల వరకు 96 పాయింట్ల మేర నష్టపోయి 24,166 వద్ద ట్రేడ్ అవుతుండగా, సెన్సెక్స్ 350 పాయింట్లకు పైగా పతనం అయ్యి 77,840 వద్ద ట్రేడ్ అవుతోంది.
ఆసియా మార్కెట్లు లాభాల్లోనే..
అయితే ఆసియా మార్కెట్లు మాత్రం లాభాల్లోనే కొనసాగుతుండడం గమనార్హం. జపాన్ టోపిక్స్ 1.7 శాతం మేర లాభపడగా, ఆస్ట్రేలియా ఎస్ అండ్ పీ లేదా ఏఎస్ఎక్స్ (200) 0.4 శాతం పెరిగింది. హాంగ్‌కాంగ్ హాంగ్‌సెంగ్ సూచీ 0.3 శాతం పెరగ్గా, షాంగై కంపోజిట్ ఇండెక్స్ మాత్రం 0.1 శాతం మేర తగ్గింది. ఎంసీఎక్స్‌లో సిల్వర్ ధర 0.69 శాతం తగ్గింది. కేజీకి 2,76,000 వద్ద కొనసాగుతోంది. బంగారం ధర 0.28 శాతం తగ్గి 162,858 వద్ద ట్రేడవుతోంది. ఇక బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 4.66 శాతం మేర తగ్గి బ్యారెల్‌కు 85 డాలర్ల వద్ద కొనసాగుతుండగా, డబ్ల్యూటీఐ క్రూడ్ ఆయిల్ ధర 4.15 శాతం తగ్గి బ్యారెల్‌కు 81 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది.
మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ లాభాల్లో..
అయితే ఎన్ఎస్ఈలో నిఫ్టీ50, నిఫ్టీ 100 స్టాక్స్ నష్టాల్లో ఉండగా, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ షేర్లు మాత్రం లాభాల్లో కొనసాగుతుండడం విశేషం. సెక్టార్లవారీగా చూస్తే నిఫ్టీ రియాల్టీ, నిఫ్టీ ఫార్మా, పీఎస్‌యూ బ్యాంక్, ఆయిల్ అండ్ గ్యాస్, మెటల్, ఎంఎన్‌సీ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, మానుఫాక్చరింగ్ హెల్త్‌కేర్, ఎనర్జీ, కన్‌జ్యూమర్ డ్యూరబుల్స్ రంగాలు లాభాల్లో ఉన్నాయి. నిఫ్టీ సర్వీసెస్, ప్రైవేట్ బ్యాంక్, నిఫ్టీ ఇండియా డిజిటల్, ఐటీ, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎఫ్ఎంసీజీ, నిఫ్టీ బ్యాంక్, నిఫ్టీ ఆటో రంగాలు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.43వేలు పెరిగిన పసిడి ధర.. పెట్టుబడిదారుల్లో కొనుగోళ్ల ఉత్సాహం..
ఆగస్టు 20, 2026

Stock Markets | స్టాక్ మార్కెట్లలో మళ్లీ జోష్.. 7 రోజుల నష్టాలకు బ్రేక్..
ఆగస్టు 20, 2026

Stock Markets | వరుసగా ఏడో రోజూ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. పెట్టుబడిదారులపై అమ్మకాల ఒత్తిడి..
ఆగస్టు 19, 2026
తాజావార్తలు
- ●Google AI | విద్యార్థులకు గూగుల్ బంపర్ ఆఫర్.. ఏడాదిపాటు జెమిని ఏఐ ప్లాన్ ఫ్రీ..
- ●Sushmita Konidela | ప్రకాష్‌రాజ్‌తో చిరంజీవి కూతురు తెలుగువెబ్సిరీస్ - సుకుమార్ శిష్యుడు డైరెక్టర్ - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
- ●Bihar Government | ఆ వీడియోలు తీస్తే రూ.లక్ష ప్రైజ్‌మనీ.. ఇన్‌ఫ్ల్యూయెన్సర్లకు బీహార్ ప్రభుత్వం బంపర్ ఆఫర్
- ●Meta | మెటా పాలసీలపై ఓవర్‌సైట్ బోర్డు కీలక సూచనలు.. కొత్త మార్గదర్శకాలు జారీ..
- ●BRSV | పాలిటెక్నిక్ కోర్సులను రద్దు చేసేందుకు ప్రభుత్వం కుట్ర : గెల్లు శ్రీనివాస్ యాదవ్
- ●Talasani Srinivas Yadav | ముఖ్యమంత్రి నోటి దురద తగ్గించుకో : మాజీమంత్రి తలసాని

Google AI | విద్యార్థులకు గూగుల్ బంపర్ ఆఫర్.. ఏడాదిపాటు జెమిని ఏఐ ప్లాన్ ఫ్రీ..

Sushmita Konidela | ప్రకాష్‌రాజ్‌తో చిరంజీవి కూతురు తెలుగువెబ్సిరీస్ - సుకుమార్ శిష్యుడు డైరెక్టర్ - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Bihar Government | ఆ వీడియోలు తీస్తే రూ.లక్ష ప్రైజ్‌మనీ.. ఇన్‌ఫ్ల్యూయెన్సర్లకు బీహార్ ప్రభుత్వం బంపర్ ఆఫర్

Meta | మెటా పాలసీలపై ఓవర్‌సైట్ బోర్డు కీలక సూచనలు.. కొత్త మార్గదర్శకాలు జారీ..



