త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bus Accident | ఎల‌క్ట్రిక్ బ‌స్సులో మంట‌లు.. ఆర్టీసీ బ‌స్సు ఢీకొని యువ‌తి మృతి

Bus Accident క‌రీంన‌గ‌ర్ జిల్లాలో పెను ప్ర‌మాదం (Bus Accident) త‌ప్పింది. అలుగునూర్ శివారులో ఆర్టీసీ ఎల‌క్ట్రిక్ బ‌స్సులో (Electric Bus) ఒక్క‌సారిగా మంట‌లు చెల‌రేగాయి. క్ర‌మంగా అవి బ‌స్సు మొత్తానికి వ్యాపించాయి.

G

Telangana | Published On Jun 21, 2026, 9.26 am IST

Bus Accident | ఎల‌క్ట్రిక్ బ‌స్సులో మంట‌లు.. ఆర్టీసీ బ‌స్సు ఢీకొని యువ‌తి మృతి
Advertisement

Bus Accident త్రినేత్ర‌.న్యూస్‌: క‌రీంన‌గ‌ర్ జిల్లాలో పెను ప్ర‌మాదం (Bus Accident) త‌ప్పింది. అలుగునూర్ శివారులో ఆర్టీసీ ఎల‌క్ట్రిక్ బ‌స్సులో (Electric Bus) ఒక్క‌సారిగా మంట‌లు చెల‌రేగాయి. క్ర‌మంగా అవి బ‌స్సు మొత్తానికి వ్యాపించాయి. అయితే అప్ర‌మ‌త్త డ్రైవ‌ర్ ప్ర‌యాణికుల‌ను కిందుకు దింపేశారు. దీంతో ప్రాణ న‌ష్టం త‌ప్పింది. స‌మాచారం అందుకున్న అగ్నిమాప‌క సిబ్బంది ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్నారు. అయితే అప్ప‌టికే ఆల‌స్య‌మ‌వ‌డంతో బ‌స్సు పూర్తిగా ద‌గ్ధ‌మ‌యింది.

మ‌రో ఘ‌ట‌న‌లో రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌లో జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో ఓ యువ‌తి మృతిచెందింది. శనివారం రాత్రి 10 గంట‌ల స‌మ‌యంలో బ్యూటీషియ‌న్‌గా (Beautician) ప‌నిచేస్తున్న ప్ర‌త్యూశ (20) అనే యువ‌తి.. విధులు ముగించుకుని స్కూటీపై ఇంటికి వెళ్తున్న‌ది. ఈ క్ర‌మంలో పుల్లారెడ్డి స్వీట్స్ సమీపంలో ఆమె స్కూటీని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది.

దీంతో తీవ్రంగా గాయ‌ప‌డిన ఆమెను స‌మీపంలోని ద‌వాఖాన‌కు త‌ర‌లించారు. చికిత్స పొందుతూ అర్ధరాత్రి స‌మ‌యంలో మృతిచెందింది. ప్రత్యూశ స్వస్థలం నాగర్‌కర్నూల్ జిల్లా పదర మండలం. ఆమె కుటుంబం పెద్ద అంబర్‌పేట్‌లో నివసిస్తోంది. ఈ ఘటనపై కేసు న‌మోదుచేసిన‌ హయత్‌నగర్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

 

Advertisement
Advertisement