త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Germany Vs Ivory coast | డెనిజ్ డబుల్‌.. నాకౌట్‌కు జర్మనీ

Germany Vs Ivory coast | ఫిఫా వరల్డ్‌కప్‌ 2026లో జర్మనీ మరోసారి పోరాట స్ఫూర్తిని చాటుకుంది. టొరొంటోలో జరిగిన గ్రూప్‌–ఈ మ్యాచ్‌లో ఐవరీ కోస్ట్‌పై 2-1 తేడాతో విజయం సాధించి నాకౌట్‌ దశకు మరింత చేరువైంది. ఆల్టర్నేటివ్‌ ఆటగాడిగా బరిలోకి దిగిన డెనిజ్‌ ఉండవ్‌ రెండో అర్ధభాగంలో రెండు గోల్స్‌ చేసి జర్మనీ విజయంలో కీలకపాత్ర పోషించాడు.

P

Sports | Published On Jun 21, 2026, 9.25 am IST

Germany Vs Ivory coast | డెనిజ్ డబుల్‌.. నాకౌట్‌కు జర్మనీ
Advertisement
  • ఐవరీ కోస్ట్‌పై సంచలన విజయం
  • డ్రాగా ముగుస్తుందనుకున్న మ్యాచ్‌లో 2-1 తేడాతో విక్టరీ
  • ఐవరీ కోస్ట్‌ కొంప ముంచిన ఇంజ్యురీ టైమ్‌

Germany Vs Ivory coast | ఫిఫా వరల్డ్‌కప్‌ 2026లో జర్మనీ మరోసారి పోరాట స్ఫూర్తిని చాటుకుంది. టొరొంటోలో జరిగిన గ్రూప్‌–ఈ మ్యాచ్‌లో ఐవరీ కోస్ట్‌పై 2-1 తేడాతో విజయం సాధించి నాకౌట్‌ దశకు మరింత చేరువైంది. ఆల్టర్నేటివ్‌ ఆటగాడిగా బరిలోకి దిగిన డెనిజ్‌ ఉండవ్‌ రెండో అర్ధభాగంలో రెండు గోల్స్‌ చేసి జర్మనీ విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఇంజ్యురీ టైమ్‌లో నాలుగో నిమిషంలో సాధించిన గోల్‌ మ్యాచ్‌ను మలుపు తప్పింది. మ్యాచ్‌ ఆరంభం నుంచే జర్మనీ ఎటాక్‌కు ప్రయత్నించింది. రెండో నిమిషంలోనే కై హావెర్ట్‌జ్‌ గోల్‌ ప్రయత్నించినా సాధ్యం కాలేదు. ఆ తర్వాత సైతం జర్మనీ ఆధిపత్యాన్ని కొనసాగించింది. తొమ్మిదో నిమిషంలో హావెర్ట్‌జ్‌ హెడ్డర్‌తో గోల్‌ మలిచేందుకు ప్రయత్నించగా.. ఐవరీ కోస్ట్‌ గోల్‌ కీపర్‌ ఫొఫొనా అడ్డుకున్నాడు.

తొలి గోల్‌ ఐవరీ కోస్ట్‌దే..

21వ నిమిషంలో కార్నర్‌ కిక్‌ సమయంలో పావ్లోవిచ్‌ ఒత్తిడితో ఫొఫానా తప్పిదం చేయడంతో జర్మనీ గోల్‌ సాధించినట్లే కనిపించింది. ఫౌల్‌ జరిగిందని భావించిన రిఫరీ ఆ గోల్‌ను రద్దు చేశాడు. ఆ తర్వాత ఐవరీ కోస్ట్‌ మ్యాచ్‌పై పట్టు సాధించేందుకు ప్రయత్నించింది. 29వ నిమిషంలో యాన్‌ డియోమాండే ఎడమ వైపు నుంచి చేసిన ఎటాక్‌ను అమాద్‌ డియాలో కొనసాగించాడు. ఆ షాట్‌ను జర్మన్‌ డిఫెన్స్‌ అడ్డుకున్నప్పటికీ.. రీబౌండ్‌గా వచ్చిన బంతిని ఫ్రాంక్‌ కెస్సీ గోల్‌గా మలచి ఐవరీ కోస్ట్‌కు 1-0 ఆధిక్యం అందించాడు. వెనుకబడ్డ జర్మనీ గోల్‌ వేసేందుకు తీవ్రంగా ప్రయత్నించింది. తొలి అర్ధభాగంలో చివరలో హావెర్ట్‌జ్‌ బంతిని గోల్‌లోకి పంపినా.. అంతకముందే ముసియాలా చేసిన ఫౌల్‌ కారణంగా వీఏఆర్‌ గోల్‌ను రద్దు చేశారు. రెండో అర్ధభాగం ప్రారంభంలో ఐవరీ కోస్ట్‌ మరింత దూకుడుగా కనిపించింది. కెస్సీ, ఒలాయ్‌ గోల్స్‌కు దగ్గరగా వెళ్లినా అవకాశాలను వినియోగించుకోలేకపోయారు. దీంతో జర్మనీ కోచ్‌ జూలియన్‌ నాగెల్స్‌మన్‌ 60వ నిమిషంలో కీలక మార్పులు చేశాడు. డెనిజ్‌ ఉండావ్‌, నదీమ్‌ అమిరి, జామీ లెవెలింగ్‌లను మైదానంలోకి దింపాడు. ఈ మార్పులే జర్మనీ ఆటను పూర్తిగా మార్చేశాయి. 68వ నిమిషంలో అమిరి ఇచ్చిన అద్భుత క్రాస్‌ను ఉండావ్‌ గోల్‌గా మలచి స్కోరును 1-1తో సమం చేశాడు. దీంతో మ్యాచ్‌ మళ్లీ ఉత్కంఠభరితంగా మారింది. ఇరు జట్లు విజయ గోల్‌ కోసం ప్రయత్నించాయి. 88వ నిమిషంలో సైమన్‌ అడింగ్రాకు అద్భుత అవకాశం వచ్చినా.. ఆలస్యం చేయడంతో జర్మనీ ప్రమాదం నుంచి బయటపడింది.

చివరలో జర్మనీ దెబ్బ..

డ్రాగా ముగుస్తుందనుకున్న మ్యాచ్‌లో ఇంజ్యురీ టైమ్‌లో ఐవరీ కోస్ట్‌ను జర్మనీ చావుదెబ్బ కొట్టింది. ఫెలిక్స్‌ ఎన్‌మెచా అందించిన అద్భుత త్రూ బాల్‌ను అందుకున్న ఉండావ్‌ ప్రశాంతంగా గోల్‌ చేసి జర్మనీకి 2-1 ఆధిక్యం అందించాడు. ఆ తర్వాత ఐవరీ కోస్ట్‌కు తిరిగి కోలుకునే అవకాశం లేకపోయింది. ఇదే ఊపులో మూడో గోల్‌ వేసింది. గత రెండు వరల్డ్‌కప్‌లలో గ్రూప్‌ దశనే దాటలేకపోయిన జర్మనీ.. ఈసారి నాగెల్స్‌మన్‌ మార్గదర్శకత్వంలో నాకౌట్‌ దశకు అర్హత సాధించే దిశగా ముందడుగు వేసింది. ఉండావ్‌ తన అద్భుత ప్రదర్శనతో తుది జట్టులో స్థానం పదిలం చేసుకున్నాడు. మరో వైపు ఐవరీ కోస్ట్‌కు ఈ ఓటమి ఇబ్బందికరంగా మారింది. అవకాశాలు వచ్చినా గోల్స్‌గా మార్చలేకపోయింది. నాకౌట్‌కు చేరాలంటే తప్పనిసరిగా కురసావోపై విజయం సాధించాల్సిన పరిస్థితి ఎదురైంది. ఇక రెండు వరుస విజయాలతో జర్మనీ రౌండ్‌ ఆఫ్‌ 30కి అర్హత సాధించింది.

Advertisement
Advertisement