త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

BRSV | బీఆర్ఎస్వీ నిర‌స‌న స‌భ‌కు అనుమ‌తివ్వండి.. గాంధీన‌గ‌ర్ ఏసీపీకి ద‌ర‌ఖాస్తు

BRSV | ఢిల్లీలో విద్యార్థి, యువతపైన కేంద్ర ప్రభుత్వ అణిచివేతకు వ్యతిరేకంగా శుక్ర‌వారం ఉదయం 10 గంటలకు ఇందిరా పార్కులో బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేప‌ట్టాల‌ని నిర్ణ‌యించారు.

S

Telangana | Published On Jul 23, 2026, 3.15 pm IST

BRSV | బీఆర్ఎస్వీ నిర‌స‌న స‌భ‌కు అనుమ‌తివ్వండి.. గాంధీన‌గ‌ర్ ఏసీపీకి ద‌ర‌ఖాస్తు
Advertisement

BRSV | త్రినేత్ర‌.న్యూస్ : ఢిల్లీలో విద్యార్థి, యువతపైన కేంద్ర ప్రభుత్వ అణిచివేతకు వ్యతిరేకంగా శుక్ర‌వారం ఉదయం 10 గంటలకు ఇందిరా పార్కులో బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేప‌ట్టాల‌ని నిర్ణ‌యించారు. ఈ నేప‌థ్యంలో నిర‌స‌న స‌భ‌కు అనుమ‌తివ్వాల‌ని కోరుతూ గాంధీన‌గ‌ర్ ఏసీపీకి బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్య‌క్షుడు గెల్లు శ్రీనివాస్ యాద‌వ్, బీఆర్ఎస్ నేత ముఠా జ‌య‌సింహ‌తో పాటు ప‌లువురు విద్యార్థి నేత‌లు ద‌ర‌ఖాస్తు స‌మ‌ర్పించారు.

విద్యార్థుల పోరాటానికి సంఘీభావంగా బీఆర్ఎస్వీ చేపట్టే ఈ కార్యక్రమానికి భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరుకానున్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, యువత పెద్దఎత్తున పాల్గొనబోతున్నారు.

Advertisement
Advertisement