Sangameswara Temple | కృష్ణమ్మ ఒడిలోకి సంగమేశ్వరుడు.. మళ్లీ పూజలందుకునేది మార్చిలోనే!
Sangameswara Temple | ఏడాదిలో నాలుగు నెలలు మాత్రమే భక్తులకు దర్శనమిచ్చే సంగమేశ్వరుడు (Sangameswarudu) కృష్ణమ్మ ఒడిలో చేరిపోయాడు. కృష్ణానది, తుంగభద్ర నుంచి వరద భారీగా వస్తుండటంతో శ్రీశైలంలో (Srisailam) నీటిమట్టం క్రమంగా పెరుగుతున్నది.
Sangameswara Temple | త్రినేత్ర.న్యూస్: ఏడాదిలో నాలుగు నెలలు మాత్రమే భక్తులకు దర్శనమిచ్చే సంగమేశ్వరుడు (Sangameswarudu) కృష్ణమ్మ ఒడిలో చేరిపోయాడు. కృష్ణానది, తుంగభద్ర నుంచి వరద భారీగా వస్తుండటంతో శ్రీశైలంలో (Srisailam) నీటిమట్టం క్రమంగా పెరుగుతున్నది. దీంతో బ్యాక్ వాటర్‌లో (Srisailam Back Water) సంగమేశ్వర ఆలయం (Sangameswara Temple) పూర్తిగా మునిగిపోయింది. శనివారం రాత్రి ఆలయ గర్భగుడిలోకి వరద నీరు చేరగా, ఆదివారం రాత్రి ఆలయ గోపురం నీటిలో మునిగిపోయింది. ఈ నేపథ్యంలో పురోహితులు వేపదారు శివలింగానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గంగమ్మ తల్లికి భక్దిశ్రద్ధలతో చీర, సారె సమర్పించారు. దీంతో మరో ఎనిమిది నెలలపాటు సంగమేశ్వరుడు కృష్ణమ్మ (Krishna River) ఒడిలోనే ఉండిపోనున్నారు.
గతేడాది జూన్ 15వ తేదీనే సంగమేశ్వర స్వామి గర్భాలయంలోకి నీరు ప్రవేశించగా.. ఈ ఏడాది ఆగస్టు 1వ తేదీన నీరు వచ్చిందని ఆలయ అర్చకులు తెలిపారు. గత సంవత్సరం జూన్ 15వ తేదీన స్వామివారు జలాధివాసం కాగా.. తిరిగి మార్చి నెలలో నీరు తగ్గి ఆలయం బయటపడింది. దాంతో అప్పటి నుంచి భక్తులు సంగమేశ్వర ఆలయానికి వచ్చి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది మార్చిలో కృష్ణా నది నుంచి బయటకు వచ్చిన సంగమేశ్వర స్వామి 131 రోజుల పాటు స్వామివారు పూజలు అందుకున్నారు.

సుమారు 7వ శతాబ్దంలో చాళుక్యుల కాలంలో రెండో పులకేశి ఈ ఆలయాన్ని నిర్మించారని చెబుతారు. ఈ శివలింగాన్ని ధర్మరాజు ప్రతిష్టించారని ప్రతీతి. భీముడు కాశీ నుంచి లింగం తెచ్చేలోపు అమృత గడియలు దాటిపోవడంతో వేప చెట్టును లింగంగా మార్చి పూజించారని నమ్ముతారు. ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలంలో ఉన్న ఈ ఆలయాన్ని.. శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణంతో పురావస్తు శాఖ వారు పూర్తిగా విడదీసి అలంపూర్ (Alampur) సమీపంలో పునఃనిర్మించారు.
అయితే సంగమేశ్వరాలయంలో వేల సంవత్సరాల క్రితం ప్రతిష్టించిన వేపలింగం ఇప్పటికీ చెక్కు చెదరలేదు. ఏడాదిలో ఎనిమిది నెలలు నీటిలో మునిగి ఉన్నప్పటికీ శివలింగం రూపంలో ఎలాంటి మార్పు రాలేదు. ఈ ఆలయం మొదట నది ఒడ్డున ఉండేది. శ్రీశైలం డ్యామ్ (Srisailam Dam) నిర్మాణంతో నీట మునిగింది. డ్యామ్ నిర్మాణం తర్వాత 23 సంవత్సరాలు నీటిలోనే ఉంది. అక్కడ ఆలయం అనేది ఒకటి ఉందనే విషయాన్ని కూడా జనం మర్చిపోయారు. 2003 తర్వాత శ్రీశైలం డ్యామ్ నీటిమట్టం భారీగా పడిపోయింది. దీంతో ఆలయం నీటి నుంచి బయటపడింది. అప్పటి నుంచి ఆలయంలో పూజలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికీ జూలై నుంచి మార్చి ఆరంభం వరకు నీటిలోనే ఉంటుంది.

సంగమేశ్వరం (Sangameswaram) మునులు తపస్సు చేసిన పవిత్రమైన స్థలం. అగస్త్య మహాముని విశ్వామిత్రుడు (Viswamithrudu) ఇక్కడ తపస్సు చేశారు. స్కంద పురాణంలో సంగమేశ్వరం ప్రాధాన్యత వివరంగా ఉంది. అస్తికలు ఈ నదిలో కలిపిన పితృ దేవతలకు పిండతర్పణం చేసిన ముందు ఏడు జన్మలు తర్వాత ఏడు జన్మల్లో పాపాలు హరిస్తాయని భక్తుల విశ్వాసం. సంగమేశ్వరంలో స్నానం చేసిన వారికి 1000 రెట్ల ఫలం లభిస్తుందట. సర్వ పాపాలు హరిస్తాయట. సంగమేశ్వర క్షేత్రంలో గాయత్రీదేవి పాదముద్రలు మరింతగా భక్తులను ఆకర్షిస్తున్నాయి. గాయత్రీదేవి పాదముద్రల వద్ద సంధ్యావేళ గాయత్రీ మంత్రం జపిస్తే సమస్యలు పరిష్కారం అవుతాయని వేద పండితులు చెబుతున్నారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Vivo S2 | భారీ బ్యాటరీ, పవర్ఫుల్ డిస్ప్లేతో లాంచ్ అయిన వివో ఎస్2 స్మార్ట్ ఫోన్.. ధర ఎంతంటే..
- ●Doctor Suspended | తనకు బదులు విధులకు మరో వ్యక్తి.. జోగిపేట ఏరియా హాస్పిటల్ డాక్టర్‌పై సస్పెన్షన్ వేటు
- ●Shaking well | బావిలో నిరంతరం ఎగసిపడుతున్న అలలు.. వీడియో వైరల్
- ●Gold And Silver Prices Today | స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. పెట్టుబడిదారులకు ఇదే సమయం..?
- ●Husnabad | హుస్నాబాద్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు రూ.33.70 కోట్లు మంజూరు..
- ●Stock Markets | ఐటీ షేర్ల జోష్.. మార్కెట్లకు మళ్లీ బ్రేక్.. సెన్సెక్స్ 242 పాయింట్లు డౌన్..

Vivo S2 | భారీ బ్యాటరీ, పవర్ఫుల్ డిస్ప్లేతో లాంచ్ అయిన వివో ఎస్2 స్మార్ట్ ఫోన్.. ధర ఎంతంటే..

Doctor Suspended | తనకు బదులు విధులకు మరో వ్యక్తి.. జోగిపేట ఏరియా హాస్పిటల్ డాక్టర్‌పై సస్పెన్షన్ వేటు

Shaking well | బావిలో నిరంతరం ఎగసిపడుతున్న అలలు.. వీడియో వైరల్

Gold And Silver Prices Today | స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. పెట్టుబడిదారులకు ఇదే సమయం..?






