Suicide Blast | పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి.. 14 మంది మృతి
Suicide Blast | పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా ప్రావిన్స్‌లో భారీ పేలుడు సంభవించింది. స్వాత్ లోయలోని (Swat Valley) కబల్ పట్టణంలో ఆదివారం సాయంత్రం శాంతియాత్ర (Peace Rally) నిర్వహిస్తున్నారు.
International | Published On Aug 3, 2026, 8.01 am IST
Suicide Blast | త్రినేత్ర.న్యూస్: పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా ప్రావిన్స్‌లో భారీ పేలుడు సంభవించింది. స్వాత్ లోయలోని (Swat Valley) కబల్ పట్టణంలో ఆదివారం సాయంత్రం శాంతియాత్ర (Peace Rally) నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా జరిగిన ఆత్మాహుతి దాడిలో (Suicide Blast) 14 మంది చనిపోగా, మరో 22 మంది గాయపడ్డారు. మృతుల్లో ఐదుగురు పోలీసులు కాగా, తొమ్మిది మంది సాధారణ పౌరులు.
శాంతికోసం ర్యాలీ..
స్వాత్ ప్రాంతంలో (Swat District) గత కొంతకాలంగా భద్రతా పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో అమన్ జిర్గా ఆధ్వర్యంలో స్థానిక ప్రజలు యాత్ర చేపట్టారు. ఇందులో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ఈ సమయంలో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. దీంతో భయాందోళనలకు గురైన ప్రజలు పరుగులు తీశారు. ఇది ఆత్మాహుతి దాడి అయి ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు ఏ సంస్థ కూడా బాధ్యతవహించలేదు. పేలుడు వెనుక ఏదైనా సంస్థ ఉందా లేదా వ్యక్తులే దీనికి పాల్పడ్డారా అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, పేలుడు తీవ్రత అధికంగా ఉండటం, గాయపడినవారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

Coal Mine Blast | బొగ్గు గనిలో భారీ పేలుడు.. 34 మంది మృతి
జులై 31, 2026

Khawaja Asif | పీవోకే నిరసనకారులు కూడా భారత్‌లాంటి శత్రువులే.. పాక్ రక్షణ మంత్రి సంచలన వ్యాఖ్యలు
జులై 29, 2026

CJP Protest | ఫేక్ అకౌంట్లతో జంతర్‌మంతర్ నిరసనపై తప్పుడు ప్రచారం.. పాక్‌కూ లింకులు: ఢిల్లీ పోలీసులు
జులై 25, 2026
తాజావార్తలు
- ●Harish Rao | రేవంత్ రెడ్డి.. బీఆర్ఎస్ నిలదీస్తే గానీ సోయి రాదా..?
- ●Amit Shah | చర్చకు నేను సిద్ధం.. విపక్షాలకు అమిత్ షా సవాల్
- ●KTR | ‘ఏఐ హబ్-స్విట్జర్లాండ్’ వచ్చేసింది.. ఇక సమాచార లోడ్‌ను నియంత్రించొచ్చు
- ●SpaceXAI | స్పేస్ఎక్స్ఏఐ నుంచి గ్రోక్ బాట్.. ఇక పనులన్నింటినీ ఏఐ ఏజెంట్లే చేస్తాయి..
- ●Post Office RD | రోజుకు రూ.300తో పోస్టాఫీస్ ద్వారా రూ.15 లక్షలు.. ఇలా చేస్తే సాధ్యం..
- ●HCU | హెచ్‌సీయూలో డ్రగ్స్ కలకలం.. 17 మంది విద్యార్థులకు పాజిటివ్

Harish Rao | రేవంత్ రెడ్డి.. బీఆర్ఎస్ నిలదీస్తే గానీ సోయి రాదా..?

Amit Shah | చర్చకు నేను సిద్ధం.. విపక్షాలకు అమిత్ షా సవాల్

KTR | ‘ఏఐ హబ్-స్విట్జర్లాండ్’ వచ్చేసింది.. ఇక సమాచార లోడ్‌ను నియంత్రించొచ్చు

SpaceXAI | స్పేస్ఎక్స్ఏఐ నుంచి గ్రోక్ బాట్.. ఇక పనులన్నింటినీ ఏఐ ఏజెంట్లే చేస్తాయి..



