Khandala | తెలంగాణ కశ్మీర్.. చుట్టూ కొండలు.. గుట్టలు.. జాలువారే సెలయేర్లు
Khandala | చుట్టూ పచ్చని అడవులు, జలపాతాలు, కొండలు, లోయలు, సెలయేర్లు.. ఇలా సహజసిద్ధమైన అందాలకు నిలయం ఆదిలాబాద్ (Adilabad) జిల్లా. వర్షాకాలంలో నీటితో కళకళలాడుతూ పర్యాటకులను ఆకర్షించే కుంటాల, పొచ్చెర, గాయత్రి జలపాతాలు కూడా ఈ జిల్లాలోనే ఉన్నాయి.
Khandala | త్రినేత్ర.న్యూస్: చుట్టూ పచ్చని అడవులు, జలపాతాలు, కొండలు, లోయలు, సెలయేర్లు.. ఇలా సహజసిద్ధమైన అందాలకు నిలయం ఆదిలాబాద్ (Adilabad) జిల్లా. వర్షాకాలంలో నీటితో కళకళలాడుతూ పర్యాటకులను ఆకర్షించే కుంటాల, పొచ్చెర, గాయత్రి జలపాతాలు కూడా ఈ జిల్లాలోనే ఉన్నాయి. అయితే అందరికీ అంతగా తెలియని మరో ప్రకృతి రమణీయ ప్రదేశం కూడా ఆదిలాబాద్‌లో ఉంది. అదే తెలంగాణ కశ్మీరం (Telangana Kashmir) ఖండాల (Khandala) ప్రాంతం. ఇక్కడి సహజ అందాలు అటుగా వెళ్లేవారిని చూపు తిప్పుకోనీయవంటే అతిశయోక్తి కాదు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామం పచ్చని అడవులు, ఎత్తయిన గుట్టలు, ఉప్పొంగే జలపాతాలు, అందమైన దృశ్యాలకు ప్రసిద్ధి. గ్రామానికి సమీపంలో ఉన్న మొలాల్ గుట్ట జలపాతం ప్రత్యేక ఆకర్షణ. ఎండా, వానా, చలి అని తేడా లేకుండా అన్ని కాలాల్లోనూ ఇక్కడ కశ్మీర్‌ను (Kashmir) తలపించేలా ప్రకృతి సౌందర్యం కనివిందు చేస్తుంది.

దారి పొడవునా వంపులు తిరుగుతూ కొండల మీద నుంచి వెళ్లే రహదారి (Khandala Ghat), ఎటు చూసినా మైమరిపించే పచ్చటి అడవి, గిరిజన గూడాలను తాకుతూ వెళ్లే మేఘాలు, పొగమంచు దృశ్యాలను మనం కళ్లారా వీక్షించాల్సిందే. ఖండాల జలపాతంతోపాటు ఇచ్చోడ మండలంలోని గుండి వాగుపై సుమారు 350 అడుగుల ఎత్తు నుంచి జాలువారే గాయత్రి జలపాతం కనువిందు చేస్తుంది. ఇక వర్షాకాల అందాలను వీక్షించాలనుకుంటున్నారా? అయితే ఒకసారి ఖండాలకు వచ్చేయండి..!

సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●TTD | అలిపిరి మెట్ల మార్గంలో చిరుత సంచారం.. భక్తులు అప్రమత్తంగా ఉండాలన్న టీటీడీ
- ●DGCA | రూ.2.5 లక్షల లంచం కేసు.. డీజీసీఏ డిప్యూటీ డైరెక్టర్, విమానయాన సంస్థ డైరెక్టర్ అరెస్ట్
- ●Balapur | బాలాపూర్‌లో భారీ అగ్నిప్రమాదం.. పేలిన కెమికల్ డ్రమ్ములు
- ●Separate Food | జాతరలో కుల వివక్ష.. దళితులకు విడిగా భోజనాలు
- ●Horoscope | అక్టోబర్ 5 రాశిఫలాలు.. సహోద్యోగులతో ఇబ్బందులు ఎదురవుతాయి!
- ●Asaduddin Owaisi Jail Allegations | చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు అవాస్తవం: స్పష్టతనిచ్చిన తెలంగాణ జైళ్ల శాఖ

TTD | అలిపిరి మెట్ల మార్గంలో చిరుత సంచారం.. భక్తులు అప్రమత్తంగా ఉండాలన్న టీటీడీ

DGCA | రూ.2.5 లక్షల లంచం కేసు.. డీజీసీఏ డిప్యూటీ డైరెక్టర్, విమానయాన సంస్థ డైరెక్టర్ అరెస్ట్

Balapur | బాలాపూర్‌లో భారీ అగ్నిప్రమాదం.. పేలిన కెమికల్ డ్రమ్ములు

Separate Food | జాతరలో కుల వివక్ష.. దళితులకు విడిగా భోజనాలు






