CJP | పీఎం కేర్స్ ఫండ్‌పై కూడా దర్యాప్తు కోరండి.. సూరత్ ఆర్టీఐ కార్యకర్తకు సీజేపీ కౌంటర్
CJP | సాధారణ ప్రభుత్వ ఉద్యోగి కొడుకు అయిన కొక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే (Abhijeet Dipke) విదేశాల్లో ఎలా చదివారని, ఆయన తండ్రి ఆదాయం, ఆర్థిక పరిస్థితిపై సమగ్ర విచారణ జరపాలంటూ ఓ ఆర్టీఐ కార్యకర్త (RTI activist) డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.
CJP | త్రినేత్ర.న్యూస్: సాధారణ ప్రభుత్వ ఉద్యోగి కొడుకు అయిన కొక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే (Abhijeet Dipke) విదేశాల్లో ఎలా చదివారని, ఆయన తండ్రి ఆదాయం, ఆర్థిక పరిస్థితిపై సమగ్ర విచారణ జరపాలంటూ ఓ ఆర్టీఐ కార్యకర్త (RTI activist) డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై సీజేపీ స్పందించింది. పీఎం కేర్స్ ఫండ్స్ పైనా ఇలాగే దర్యాప్తు కోరాలంటూ ఆర్టీఐ కార్యకర్తను డిమాండ్ చేశారు. అందుకుగాను ప్రధాని మిమ్మల్ని క్షమిస్తారంటూ చురకలంటించింది.
ఒక ప్రైవేట్ వ్యక్తి విద్యా ఖర్చులపై ఆర్టీఐలు దాఖలు చేసేవారు పీఎం కేర్స్ ఫండ్‌ను (PM CARES Fund) కూడా చూడాలి. మోదీజీ మిమ్మల్ని క్షమిస్తారు, చింతించకండి అంటూ సీజేపీ అధికార ప్రతినిధి వైష్ణవి గౌర్ (Vaishnavi Gaur) కౌంటర్ ఇచ్చారు. ఆ ఆర్టీఐ కార్యకర్త ఒక ప్రైవేట్ వ్యక్తిని లక్ష్యంగా చేసుకుని పక్షపాతంగా వ్యవహరిస్తున్నాడని ఆరోపించారు.

అభిజీత్ దిప్కే తండ్రి భగవాన్‌రావు దీప్కే ఆదాయం, ఆర్థిక పరిస్థితిపై సమగ్ర విచారణ జరపాలని కోరుతూ సూరత్‌కు చెందిన గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన అమిత్ తివారీ అనే ఆర్‌టీఐ కార్యకర్త ఎన్నికల సంఘానికి (ECI), , ఆదాయపు పన్ను శాఖకు (IT) లేఖలు రాశారు. మహారాష్ట్ర ప్రభుత్వంలో రిటైర్డ్ ఉద్యోగి అయిన భగవాన్‌రావు దీప్కే తన కుమారుడి విదేశీ చదువుల కోసం నిధులను ఎలా సమకూర్చారని ప్రశ్నించారు. అదేవిధంగా సీజేపీ ఆందోళనకారుల కోసం సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ ప్రకటించిన కోటి రూపాయల నిధుల చట్టబద్ధతపై కూడా దర్యాప్తు జరపాలని విజ్ఞప్తి చేశారు.
కొక్రోచ్ జనతా పార్టీ అనేది రిజిస్టర్ కాని సంస్థ అయినప్పటికీ, అది ఒక రాజకీయ పార్టీ మాదిరిగా కార్యకలాపాలు సాగిస్తున్నదని అమిత్ తివారీ అన్నారు. లీగల్ డిఫెన్స్ ఫండ్‌గా ఒక కోటి రూపాయలు అందజేస్తామని ప్రకటన వెలువడినందున, 1951 నాటి ప్రజా ప్రాతినిధ్య చట్టం సెక్షన్ 29-ఏ కింద సీజేపీ ఎన్నికల సంఘంలో రిజిస్టర్ అయిందా లేదా అని ఈసీ పరిశీలించాలని ఆయన డిమాండ్ చేశారు. ఒకవేళ ఆ పార్టీ రిజిస్టర్ కానట్లయితే, దాని పేరుతో నిధులు సమీకరించడం, వాటిని వినియోగించడం ఎంతవరకు చట్టబద్ధమనే కోణంలో దర్యాప్తు జరగాలని చెప్పారు.
ఎల్లుండి సీజేపీ కీలక భేటీ
ఈనెల 5వ తేదీన కాక్రోచ్ జనతా పార్టీ కీలక సభ్యులు భేటీ కానున్నారు. మహారాష్ట్ర సంభాజీనగర్‌లోని అభిజీత్ దీప్కే నివాసంలో ఈ సమావేశం జరగనుంది. ఢిల్లీ జంతర్ మంతర్ నిరసనల తర్వాత ఉద్యమ తదుపరి దశపై వ్యూహం, పార్టీ భవిష్యత్ కార్యాచరణపై అందులో చర్చిస్తారని తెలుస్తోంది. వాలంటీర్లు, విద్యార్థుల అభిప్రాయాలు, సూచనలు తెలుసుకొని సమావేశానికి రావాలని లీడర్లకు సూచించినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. అనంతరం తమ కార్యాచరణ నిర్ణయాలను మీడియాకు తెలియజేయనున్నట్లు వివరించాయి.
సంబంధిత వార్తలు

Kya Bolti Public Tour | క్యా బోల్తీ పబ్లిక్ : విద్యా వ్యవస్థలో సంస్కరణలు, నిరుద్యోగ సమస్యలపై అభిజీత్ డిప్కే దేశవ్యాప్త పర్యటన
ఆగస్టు 6, 2026

Abhijeet Dipke | రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తారా..? దిప్కే సమాధానం ఇదే
ఆగస్టు 5, 2026

Bhatti Vikramarka | తెలంగాణలో పెట్టుబడులు పెడితే.. ఎన్ఆర్ఐలకు సింగిల్ విండో విధానంతో అనుమతులిస్తాం
ఆగస్టు 3, 2026
తాజావార్తలు
- ●Hyderabad | గణేశుడి లడ్డూ పంచాడు.. అపార్ట్మెంట్ వాసులను రూ.కోట్లలో ముంచాడు
- ●HYDRAA | హైడ్రాలో ఉద్యోగాలు.. రాతపరీక్ష లేకుండానే ఎంపిక
- ●Vastu Tips | వంట గదిలో చీపురు పెట్టొచ్చా..? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది..?
- ●High Court | సీనియర్ ఐఏఎస్ సందీప్ కుమార్ సుల్తానియాను అరెస్టు చేయండి.. హైదరాబాద్ సీపీకి హైకోర్టు ఆదేశం
- ●Horoscope | ఆగస్టు 7 రాశిఫలాలు.. ఈ రాశి వారికి ప్రేమ వ్యవహారాలు అనుకూలం!
- ●India Smallest Airport | ఇండియాలో అతిచిన్న ఎయిర్పోర్ట్.. 15 ఏళ్లుగా ఒక్క ఫ్లైట్ టేకాఫ్ అవ్వలేదు.. అసలు కారణం ఇదే!

Hyderabad | గణేశుడి లడ్డూ పంచాడు.. అపార్ట్మెంట్ వాసులను రూ.కోట్లలో ముంచాడు

HYDRAA | హైడ్రాలో ఉద్యోగాలు.. రాతపరీక్ష లేకుండానే ఎంపిక

Vastu Tips | వంట గదిలో చీపురు పెట్టొచ్చా..? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది..?

High Court | సీనియర్ ఐఏఎస్ సందీప్ కుమార్ సుల్తానియాను అరెస్టు చేయండి.. హైదరాబాద్ సీపీకి హైకోర్టు ఆదేశం



