KTR | వర్షాలు బాగా పడాలే.. రాష్ట్రం పచ్చగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నా
KTR | రాష్ట్రంలో వర్షాలు సృద్ధిగా పడాలని ఉజ్జయినీ అమ్మవారిని సమష్టిగా మొక్కుకున్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. రైతు సంతోషంగా ఉండాలని కోరుకున్నామన్నారు. రైతు సంతోషంగా ఉంటే రాష్ట్రం కళకళలాడుతుందన్నారు. రాష్ట్రం పచ్చగా ఉండడంతో పాటు శాంతిభద్రతలు బాగుండాలని కోరుకున్నామని పేర్కొన్నారు.
- రైతు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం కళకళలాడుతుంది
- సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళీ అమ్మవారి దర్శనలో కేటీఆర్ ఆకాంక్ష
త్రినేత్ర.న్యూస్: రాష్ట్రంలో వర్షాలు సృద్ధిగా పడాలని ఉజ్జయినీ అమ్మవారిని సమష్టిగా మొక్కుకున్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. రైతు సంతోషంగా ఉండాలని కోరుకున్నామన్నారు. రైతు సంతోషంగా ఉంటే రాష్ట్రం కళకళలాడుతుందన్నారు. రాష్ట్రం పచ్చగా ఉండడంతో పాటు శాంతిభద్రతలు బాగుండాలని కోరుకున్నామని పేర్కొన్నారు. తెలంగాణ పిల్లలందరికీ అమ్మవారిని ఆశీస్సులుండాని ఆకాంక్షించామన్నారు. లష్కర్ బోనాల సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్న అనంతరం బీఆర్ఎస్ సీనియర్ నాయకులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.
ఉజ్జయినీ ఆశీస్సులతోనే తెలంగాణ సాధించాం..
50 సంవత్సరాలుగా ఎన్నడూ కూడా ఈ ఉజ్జయినీ అమ్మవారి బోనాలను రాష్ట్ర పండుగగా గుర్తించాలన్న డిమాండ్‌ను ఎవరూ పట్టించుకోలే. కానీ కేసీఆర్ నాయకత్వంలో తలసాని శ్రీనివాస్‌యాదవ్, హైదరాబాద్‌కు చెందిన ఎమ్మెల్యేలు, నాయకులు వచ్చి ఇది తప్పకుండా మనం చేయాల్సిన పని అని అన్నరు. ఉజ్జయినీ ఆశీస్సులతోనే తెలంగాణ సాధించామని కేసీఆర్ చెప్పారు. అందుకే ఆ తల్లికి బంగారు బోనం సమర్పిద్దామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అందించారు.

ఇంకా రాష్ట్ర పండుగగా ఈ కార్యక్రమాన్ని చేస్తామని చెప్పి చేసి చూపెట్టాం కూడా. రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ నుంచి రూ. 1800 కోట్ల నిధులు కేటాయించి యాదాద్రి దేవాలయాన్ని అత్యద్భుతంగా నిర్మించిన నాయకుడు కేసీఆర్. హైదరాబాద్‌లోని ప్రతి గుడికి తలసాని నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి 25 వేల కోట్ల రూపాయలు విడుదల చేశాం. ప్రతి ఉత్సవ కమిటీకి, ఆలయ కమిటీకి డబ్బులు ఇచ్చాం. ఎవరి దగ్గరా చందా వసూలు చేసే అవసరం రాకుండా చూశాం. ఆలయాలు, పండుగల నిర్వహణ అద్భుతంగా చేసి చూపెట్టాం. భక్తి ప్రపత్తులతో, దైవ సంకల్పంతో ప్రతి కార్యక్రమాని నిర్వహించారు కేసీఆర్.
సంబంధిత వార్తలు

Telangana Jowar Farmers Payment | జొన్న రైతులకు శుభవార్త.. అకౌంట్లలో నేరుగా రూ.994 కోట్లు జమ
ఆగస్టు 6, 2026

KTR Felicitates Journalist | జాతీయ స్థాయిలో మెరిసిన తెలంగాణ ఫొటో జర్నలిస్ట్.. అభినందించిన కేటీఆర్
ఆగస్టు 6, 2026

Rakesh Reddy | 2028లో నేనే, 2033లో కూడా నేనే.. ఎంతసేపు ఇదే ధ్యాసనా రేవంత్?
ఆగస్టు 6, 2026
తాజావార్తలు
- ●Tellam Venkat Rao | డీసీఎంను ఢీకొట్టిన కారు.. భద్రాచలం ఎమ్మెల్యేకు తప్పిన ప్రమాదం
- ●DRDO | డీఆర్డీఓలో ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులు.. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక..
- ●Hyderabad | గణేశుడి లడ్డూ పంచాడు.. అపార్ట్మెంట్ వాసులను రూ.కోట్లలో ముంచాడు
- ●HYDRAA | హైడ్రాలో ఉద్యోగాలు.. రాతపరీక్ష లేకుండానే ఎంపిక
- ●Vastu Tips | వంట గదిలో చీపురు పెట్టొచ్చా..? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది..?
- ●High Court | సీనియర్ ఐఏఎస్ సందీప్ కుమార్ సుల్తానియాను అరెస్టు చేయండి.. హైదరాబాద్ సీపీకి హైకోర్టు ఆదేశం

Tellam Venkat Rao | డీసీఎంను ఢీకొట్టిన కారు.. భద్రాచలం ఎమ్మెల్యేకు తప్పిన ప్రమాదం

DRDO | డీఆర్డీఓలో ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులు.. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక..

Hyderabad | గణేశుడి లడ్డూ పంచాడు.. అపార్ట్మెంట్ వాసులను రూ.కోట్లలో ముంచాడు

HYDRAA | హైడ్రాలో ఉద్యోగాలు.. రాతపరీక్ష లేకుండానే ఎంపిక



