BRSLP | బీఆర్ఎస్ సభ్యుల వాకౌట్
BRSLP | మూసీనదీ పునరుజ్జీవంపై శాసనసభ (Assembly)లో బీఆర్ఎస్ (BRS) సభ్యులు అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం నుంచి సరైన సమాధానం చెప్పనందుకు నిరసనగా బీఆర్ఎస్ శాసనసభ్యులు వాకౌట్ చేశారు. అంతకుముందు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (KTR) మాట్లాడుతూ ప్రభుత్వమే రెండు రకాలుగా చెబుతున్నదని మండిపడ్డారు.
BRSLP | త్రినేత్ర.న్యూస్ : మూసీనదీ పునరుజ్జీవంపై శాసనసభ (Assembly)లో బీఆర్ఎస్ (BRS) సభ్యులు అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం నుంచి సరైన సమాధానం చెప్పనందుకు నిరసనగా బీఆర్ఎస్ శాసనసభ్యులు వాకౌట్ చేశారు. అంతకుముందు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (KTR) మాట్లాడుతూ ప్రభుత్వమే రెండు రకాలుగా చెబుతున్నదని మండిపడ్డారు. డీపీఆర్ లేదని ఎంఆర్‌డీసీఎల్ ఎండీ వారం క్రితం చెప్పగా, ఇప్పుడు డీపీఆర్ ఉందని మంత్రి చెబుతున్నారని వివరించారు. 50 మీటర్ల బఫర్‌జోన్ అని ఆర్డర్లు ఇచ్చామని చెప్పారని, కానీ అయిదు కిలోమీటర్ల అవతల ఉన్న హనుమాన్ నగర్ వాసులకు నోటీసులు జారీ చేశారని మండిపడ్డారు. మరోవైపు ఏడీబీ అప్పివ్వలేమని చెబుతున్నారని గుర్తు చేశారు. 18 నెలల్లో డీపీఆర్ వస్తుందని చెప్పి, రెండు నెలల్లోనే ఎలా తీసుకువచ్చారని ప్రశ్నించారు. అసలు బఫర్ జోన్ ఎంత చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్ని నిర్మాణాలను కూలుస్తున్నారని, ఈ సంఖ్య ఒక్కోసారి ఒక్కోలా చెబుతున్నారని దుయ్యబట్టారు. ఎడమ చేయి చేసేది కుడి చేయికి తెలియనట్లుగా ఉంది పరిస్థితని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి చెప్పేది మంత్రులు చెప్పే దానికి పొంతన ఉండడం లేదని విమర్శించారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించారు.
సంబంధిత వార్తలు

Chamala Kiran Kumar Reddy | బండి సంజయ్.. గత ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి రాకుండా అడ్డుకున్నదెవరు?: ఎంపీ చామల
ఆగస్టు 19, 2026

Harish Rao | బీఆర్ఎస్ నేతల సనత్‌నగర్ టిమ్స్ సందర్శన.. హరీశ్ రావు, తలసాని హౌస్ అరెస్ట్..
ఆగస్టు 19, 2026

Danam Nagender | బీఆర్ఎస్కి రాజీనామా చేయలే.. కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకోలే: దానం నాగేందర్
ఆగస్టు 19, 2026
తాజావార్తలు
- ●Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.43వేలు పెరిగిన పసిడి ధర.. పెట్టుబడిదారుల్లో కొనుగోళ్ల ఉత్సాహం..
- ●Knowledge Corner | ఉద్యోగార్థుల కోసం హైదరాబాద్‌లో ఫ్రీ నాలెడ్జ్ కార్నర్.. ఎక్కడ ఉందంటే?
- ●‘సురేఖ’ సైలెంట్.. సుష్మిత యాక్టివ్: కాంగ్రెస్‌లో క్లైమాక్స్ చేరిన పరకాల పంచాయితీ!
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లలో మళ్లీ జోష్.. 7 రోజుల నష్టాలకు బ్రేక్..
- ●Helicopter Crash | కెన్యాలో హెలికాప్టర్ ప్రమాదం.. ఈక్వెడార్ ఇంటెలిజెన్స్ చీఫ్ సహా ఏడుగురు దుర్మరణం
- ●Harish Rao | మంత్రి పొంగులేటిని వెంటనే బర్తరఫ్ చేయండి.. రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ

Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.43వేలు పెరిగిన పసిడి ధర.. పెట్టుబడిదారుల్లో కొనుగోళ్ల ఉత్సాహం..

Knowledge Corner | ఉద్యోగార్థుల కోసం హైదరాబాద్‌లో ఫ్రీ నాలెడ్జ్ కార్నర్.. ఎక్కడ ఉందంటే?

‘సురేఖ’ సైలెంట్.. సుష్మిత యాక్టివ్: కాంగ్రెస్‌లో క్లైమాక్స్ చేరిన పరకాల పంచాయితీ!

Stock Markets | స్టాక్ మార్కెట్లలో మళ్లీ జోష్.. 7 రోజుల నష్టాలకు బ్రేక్..



