త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | రైతుల కోపాగ్నిలో మాడి మసైపోతావ్ రేవంత్ : హ‌రీశ్‌రావు

Harish Rao | రాష్ట్రంలో నెల‌కొన్న క‌రువు ప‌రిస్థితుల‌ను గ‌మ‌నించి.. ఇప్ప‌టికైనా క‌ళ్లు తెరిచి కాళేశ్వ‌రం నీళ్ల‌ను ఎత్తిపోయాల‌ని కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హ‌రీశ్‌రావు డిమాండ్ చేశారు. లేకుంటే యావ‌త్ తెలంగాణ రైతుల కోపాగ్నిలో మాడి మ‌సైపోతావ్ రేవంత్ రెడ్డి అని ఆయ‌న హెచ్చ‌రించారు.

S

Telangana | Published On Jul 19, 2026, 5.54 pm IST

Harish Rao | రైతుల కోపాగ్నిలో మాడి మసైపోతావ్ రేవంత్ : హ‌రీశ్‌రావు
Advertisement

Harish Rao | త్రినేత్ర‌.న్యూస్ : రాష్ట్రంలో నెల‌కొన్న క‌రువు ప‌రిస్థితుల‌ను గ‌మ‌నించి.. ఇప్ప‌టికైనా క‌ళ్లు తెరిచి కాళేశ్వ‌రం నీళ్ల‌ను ఎత్తిపోయాల‌ని కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హ‌రీశ్‌రావు డిమాండ్ చేశారు. లేకుంటే యావ‌త్ తెలంగాణ రైతుల కోపాగ్నిలో మాడి మ‌సైపోతావ్ రేవంత్ రెడ్డి అని ఆయ‌న హెచ్చ‌రించారు. సాగునీటి కోసం సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల రైతులు క‌దం తొక్కారు. అన్న‌పూర్ణ సాగ‌ర్ నుంచి రంగనాయక సాగర్ వరకు వేలాది మంది రైతులు పాద‌యాత్ర చేప‌ట్టి.. రిజ‌ర్వాయ‌ర్ల‌లో నీళ్లు నింపాల‌ని ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ రైతుల పాద‌యాత్ర‌లో మాజీ మంత్రి హ‌రీశ్‌రావు పాల్గొని ప్ర‌సంగించారు.

ఈ యాత్ర బీఆర్ఎస్ పార్టీ పెట్టింది కాదు, ఇది చిన్నకోడూరు మండల రైతుల పాదయాత్ర అని తెలిపారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు, రేవంత్ తెచ్చిన కరువు అని మండిప‌డ్డారు. ఆనాడు కాళేశ్వరంతో రంగనాయక సాగర్ నింపుకుని ఎండాకాలంలో కూడా పొలాల్లోకి నీళ్లు తెచ్చుకున్నాం. నేడు రేవంత్ రెడ్డి పగతో, ప్రతీకారంతో కాళేశ్వరం కటక ఒత్తుతలేడు.. కేసీఆర్‌ను తిట్టితే నీళ్లు రావు, కటక ఒత్తితేనే నీళ్లు వస్తాయి రేవంత్ రెడ్డి అని సూచించారు.

పోయిన ఆరేండ్లు కరువేందో మనకు తెలియదు..

ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు, రేవంత్ తెచ్చిన కరువు అన్నారు. పోయిన ఆరేండ్లు కరువేందో మనకు తెలియదు. పోయిన ఆరేండ్లు.. మీరు ఫోన్ చేసుడు.. కాలువ గేట్లు ఎత్తుడు. మీ ఊర్లళ్ల పొలాలళ్లకు నీళ్లు వచ్చుడు. మీ చెరువులు ఎండాకాలంలో అలుగులు దుంకినయ్‌. మత్తుళ్లు దుంకిన చెరువులు చూసుకున్నం. బ్రహ్మాండంగా రెండు పంటలు కూడా పండించుకొని బతికినం. నేడు రేవంత్ రెడ్డి పగతో, ప్రతీకారంతో కాళేశ్వరం కటక ఒత్తుతలేడని హరీశ్ రావు ఫైర్ అయ్యారు.

Advertisement
Advertisement