త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | విప్ల‌వ సూర్యుడు కుమ్రం భీం : కేటీఆర్

KTR | జల్, జంగల్, జమీన్ అని నినదించి ఆదివాసీల హక్కుల కోసం, నిరంకుశత్వ నిర్మూలన కోసం వీరోచితంగా పోరాడిన గోండు బెబ్బులి కుమ్రం భీం అని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్( KTR ) కొనియాడారు.

S

Telangana | Published On Oct 22, 2026, 1.13 pm IST

KTR | విప్ల‌వ సూర్యుడు కుమ్రం భీం : కేటీఆర్
Advertisement

KTR | త్రినేత్ర న్యూస్ : జల్, జంగల్, జమీన్ అని నినదించి ఆదివాసీల హక్కుల కోసం, నిరంకుశత్వ నిర్మూలన కోసం వీరోచితంగా పోరాడిన గోండు బెబ్బులి కుమ్రం భీం అని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్( KTR ) కొనియాడారు. పీడిత ప్రజల పక్షాన నిలుస్తూ... ఆదివాసీ చైతన్య ప్రతీకగా ఎదిగిన విప్లవ సూర్యుడు కుమ్రం భీం అని పేర్కొన్నారు.

కేసీఆర్ హయాంలో వారి ఆశయాల సాధన కోసం పాటుపడ్డాం.. కుమ్రం భీం స్ఫూర్తిగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టాం. ఆసిఫాబాద్ జిల్లాకు కుమ్రం భీం పేరు పెట్టుకున్నాం, జోడేఘాట్‌లో సుందరమైన స్మృతి వనాన్ని ఏర్పాటు చేసుకున్నాం, హైదరాబాద్ మహానగరంలో కుమ్రం భీం పేరిట ఆదివాసీ భవనాన్ని నిర్మించుకున్నాం. అక్టోబ‌ర్ 22న కుమ్రం భీం జయంతి సందర్భంగా వారికి జోహార్లు తెలుపుతూ... ఘన నివాళులు అర్పిస్తున్నాను అని కేటీఆర్ పేర్కొన్నారు.

బ‌హుజ‌న వీరుడు పండుగ సాయ‌న్న‌

బహుజన వీరుడు, పేదల పక్షపాతి, పండుగ సాయన్న అని కేటీఆర్ పేర్కొన్నారు. అన్యాయానికి, దోపిడీకి ఎదురొడ్డి పోరాడి, బడుగు బలహీన వర్గాల బాగు కోసం పాటుపడిన యోధుడు పండుగ సాయన్న... వారి పోరాట స్ఫూర్తి భావితరాలకు ఆదర్శం. పండుగ సాయన్న జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అని కేటీఆర్ అన్నారు.

Advertisement
Advertisement