త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

RS Praveen Kumar | మేడిగడ్డ‌ది సిట్ వేయాల్సిన కేసు.. డీజీపీకి లేఖ రాస్తం

RS Praveen Kumar | మేడిగ‌డ్డ కేసు (Medigadda Case) క్లోజ్ చేయాల్సింది కాద‌ని.. దానిపై సిట్ వేసి సాంకేతిక ప‌రిజ్ఞానంతో విచార‌ణ చేయాల్సిన కేసు అని.. ఇందుకోసం తాము డీజీపీకి లేఖ రాయ‌బోతున్నామ‌ని బీఆర్ఎస్‌ప ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఆర్ఎస్ ప్ర‌వీణ్‌కుమార్ (RS Praveen Kumar) అన్నారు.

S

Telangana | Published On Oct 22, 2026, 1.07 pm IST

RS Praveen Kumar | మేడిగడ్డ‌ది సిట్ వేయాల్సిన కేసు.. డీజీపీకి లేఖ రాస్తం
Advertisement
  • రేవంత్ ద‌గ్గ‌ర హోంశాఖ పెట్టుకొని కేసు క్లోజ్ చేశారు
  • ఎప్పుడూ నోరెత్త‌ని కిష‌న్‌రెడ్డి మేడిగ‌డ్డ బ్యారేజ్ విష‌యంలో మాత్రం జాతీయ విప‌త్తు అని లేఖ రాసిండు
  • కిష‌న్‌రెడ్డి, బండి సంజ‌య్‌పై కూడా విచార‌ణ జ‌ర‌పాలి
  • కాఫ‌ర్ డ్యామ్ క‌ట్ట‌కుండా ఏపీకీ నీళ్లొదులుతున్నారు
  • మీడియా స‌మావేశంలో బీఆర్ఎస్‌ప ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఆర్ఎస్ ప్ర‌వీణ్‌కుమార్‌

RS Praveen Kumar | త్రినేత్ర న్యూస్‌: మేడిగ‌డ్డ కేసు (Medigadda Case) క్లోజ్ చేయాల్సింది కాద‌ని.. దానిపై సిట్ వేసి సాంకేతిక ప‌రిజ్ఞానంతో విచార‌ణ చేయాల్సిన కేసు అని.. ఇందుకోసం తాము డీజీపీకి లేఖ రాయ‌బోతున్నామ‌ని బీఆర్ఎస్‌ప ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఆర్ఎస్ ప్ర‌వీణ్‌కుమార్ (RS Praveen Kumar) అన్నారు. రేవంత్ హోంశాఖ మంత్రి త‌న ద‌గ్గ‌ర పెట్టుకొని విచార‌ణ చేయ‌కుండా కేసును మూసేశార‌న్నారు. దేశంలోని ప్రాజెక్టుల‌పై ఎప్పుడూ నోరెత్త‌ని కిష‌న్‌రెడ్డి (Kishan Reddy) మేడిగ‌డ్డ విష‌యంలో మాత్రం జాతీయ విప‌త్తు అని లేఖ రాయ‌డం విడ్డూర‌మ‌న్నారు. కిష‌న్‌రెడ్డి, బండి సంజ‌య్‌పై కూడా విచార‌ణ చేయాల‌ని డిమాండ్ చేశారు. రేవంత్ ప్ర‌భుత్వం కాఫ‌ర్ డ్యాం క‌ట్ట‌కుండా ఏపీకి నీళ్లు వ‌దులుతున్నార‌ని ఆరోపించారు. గురువారం తెలంగాణ భ‌వ‌న్‌లో నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడారు.

తెలంగాణ ప్రజలకు, తెలంగాణ రైతాంగానికి దసరా పండుగ శుభాకాంక్షలు. కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన ప్రాజెక్ట్ లక్ష్మీ బ్యారేజ్, మేడిగడ్డను కూల్చారు అని రవికాంత్ అనే ఒక్క ఇంజనీర్ ఫిర్యాదు చేసి మూడేండ్లు అవుతుంది. 3 ఏండ్లు అవుతున్న ఆ కేసులో పురోగతి లేదు. మొద్దు నిద్రలో ఉన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వంను మేల్కొలుపు చేయాలని మీడియా సమావేశం పెడుతున్నాం.

ఇవాళ రాష్ట్రంలో పత్తి రైతులు తల్లడిల్లిపోతున్నారు. వరి రైతులకు కూడా చాలా చోట్ల నీళ్లు అందలేదు. పంట చివరి దశలో ఉన్నందున నీళ్లు ఇవ్వాలని ప్రజలు, రైతాంగం తల్లడిల్లుతున్నారు. ఎల్ నినో అని తప్పించుకునే పనిలో ఉన్నారు ఈ ప్రభుత్వం పెద్దలు. కేసీఆర్ ఉంటే ఇవాళ ఎల్ నినో విషయంలో ఎలా చేసేవారు. మేడిగడ్డ బ్యారేజ్ ను కొంత మంది దుండగులు డిటోనేటర్లు పెట్టి పేల్చి ఉంటారని గతంలో మేం కూడా చెప్పాం. 85 పియర్స్ ఉంటాయి, దాదాపు 16 టీఎంసీల నీటి నిల్వ ఉంటుంది. పియర్ నెంబర్ 20వద్ద పెద్ద ఎత్తున శబ్దం వచ్చింది అని మూడు ఏండ్ల కింద రవికాంత్ అనే అసిస్టెంట్ ఇంజనీర్ మహదేవ్ పూర్ పీఎస్ లో ఫిర్యాదు చేస్తాడు.

పీడీపీపీ యాక్ట్ కింద కేసు బుక్ చేశారు.పెద్ద ఎత్తున‌ శబ్దం వచ్చింది. ఎవరో బాంబులు పెట్టే ఉంటారని అనుమానం వ్యక్తం చేక‌స్తూ ఫిర్యాదు చేశారు. ఇంత అనుమానం వ్యక్తం చేసినప్పుడు భూపాలపల్లి జిల్లా ఎస్పీ, డీజీపీ వెంటనే అక్కడికి వెళ్లి బాంబు స్క్వాడ్ తో పరిశీలించి సాంకేతిక పరిజ్ఞానంతో దానిపై విచారణ చేయాల్సి ఉండే. భూకంపం వస్తే ఎంత వచ్చింది అనే కోణంలో సర్వే ఆఫ్ ఇండియా, జియోలాజికల్ వాళ్లతో విచారణ చేయాల్సి ఉండే.

2025 సంవత్సరంలో ఈ కేసును క్లోజ్ చేశారు. ఈ కేసు క్లోజ్ చేస్తూ అన్‌డిటెక్ట్ అంటూ క్లోజ్ చేశారు. మేడిగడ్డపై అప్పటికే విషం చిమ్ముతున్న బండి సంజయ్, కిషన్ రెడ్డిల కాల్ డేటా తీశారా! మాకు ఆధారాలు రావడం లేదని ఈ కేసును క్లోజ్ చేశారు. అంటే హోమ్ మంత్రి రేవంత్ రెడ్డి ఆయన దగ్గర హోమ్ శాఖ పెట్టుకొని విచారణ చేయాల్సి కేసును క్లోజ్ చేశారు. అత్యంత కీలకమైన సాంకేతిక పరిజ్ఞానంతో కేసు విచారణ చేయాల్సి ఉండే. జెనివా ఒప్పందాల ప్రకారం ఇది అత్యంత ప్రాధాన్యం ఉన్న కేసు.

కేసీఆర్ మీద బుర‌దజ‌ల్లేందుకే

2025లో హుజూరాబాద్ నియోజకవర్గంలో తనుగులలో చెక్ డ్యామ్ ను దుండగులు పేల్చిన‌ ఆ కేసును క్లోజ్ చేశారు. కాంగ్రెస్ నాయకులు ఇసుక మాఫియా కోసమే ఇదంతా చేశారని అనేక సందర్భాల్లో నిరూపితం అయ్యింది. కేసీఆర్ ప్రభుత్వం మీద బురద జెల్లెందుకు ఇదంతా చేశారని అనుమానం. కిషన్ రెడ్డి ఎందుకు దేశంలో జరిగిన అనేక డ్యామ్ ప్రమాదాలకు స్పందించని కిషన్ రెడ్డి కేవలం మేడిగడ్డ బ్యారేజ్ విషయంలో మాత్రం జాతీయ విపత్తు అని లేఖ రాశారు. వారికి సంబంధించిన పోల్ వ్యూహ కర్తలపై పై విచారణ జరపాలి.

20 వేల కోట్ల పంట న‌ష్టం రిపోర్ట్‌

ఇవాళ మేడిగడ్డ వద్ద నీటి ఎత్తిపోయాక పోవడంతో ఏపీకి నీళ్లు పోతున్నాయి. అవన్నీ కన్నెపల్లి పంపు హౌస్ వద్ద మోటర్లు ఆన్ చేయచ్చు కదా. బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తే పంపులు ఆన్ చేశారు మళ్ళీ వాటిని తిరిగి ఇప్పుడు ఆఫ్ చేశారు. రూ.40 కోట్లతో కాఫర్ డ్యామ్ కడితే నీళ్ళు లిఫ్ట్ చేయవచ్చు. ఎల్ నినో ప్రభావంతో, ఈ ప్రభుత్వం చేయకపోవడంతో 20 వేల కోట్ల పంట నష్టం జరుగుతుంది అని వ్యవసాయ విశ్వవిద్యాలయం రిపోర్ట్ ఇచ్చింది.

డ్యామ్ క‌ట్ట‌డం రేవంత్‌కు ఇష్టం లేదు

కరువు ఉన్నప్పుడు నీళ్లు వాడుకోవడం కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు కేసీఆర్. కరువును ఎదుర్కునే సత్తా ఉన్న ప్రభుత్వం చేయడం లేదు. కాఫర్ డ్యామ్ కడితే ఏపీ నీళ్ళు పోవు.. అందుకే డ్యామ్ కట్టడం రేవంత్ రెడ్డికి ఇష్టం లేదు. ఆంధ్రా అధికారిని తెచ్చి ఇక్కడ సలహాదారుగా పెట్టారు. రోజుకు ఒక్క టీఎంసీ నీళ్ళు అయిన లిఫ్ట్ చేయవచ్చు చేయదు.. ఎందుకంటే ఏపీకి నీళ్లు పోవాలి.

ప్రభుత్వం దగ్గర 25లక్షలు లేవా.. ఉన్నాయి, కానీ ఖర్చు చేయదు. ఫోర్ బ్రదర్ కోసం ఫోర్త్ సిటీ పెట్టాడు. అక్కడ రియల్ ఎస్టేట్ పెంచాలి. జూపల్లి కృష్ణారావు బాత్రూమ్ కోసం కోటి రూపాయలు ఖర్చు చేశారు. మంత్రి హాజరుద్దీన్ బాత్రూం కోసం కోటి రూపాయలు ఖర్చు చేశారు. ఎంసీఆర్ హెచ్ఆర్డిలో బోధి పెవిలియన్ కు రూ.200 కోట్లు ఖర్చు చేశాడు రేవంత్ రెడ్డి. ఫుట్ బాల్ స్టేడియం కట్టారు ఆయన కోసం. ఎల్ నినో ప్రభావం ఉందని ఎప్పటి నుంచో శాస్త్రవేత్తలు హై హెచ్చరించారు. మరి ఎందుకు వీటన్నింటిపై ఖర్చు చేశారు. అనుభవజ్ఞులైన ఇంజనీర్లు ఉన్నారు గతంలో కూడా వీల్లే పని చేశారు.. కానీ వాళ్లను బెదిరించి జైలులో పెట్టారు. ఐదుగురు ఇంజినీర్లతో కమిటీ వేశారు. దామరచర్ల థర్మల్ పవర్ ప్లాంట్‌లో వాళ్ళు ఏం చేస్తారు. పోతున్నారు వస్తున్నారు. ఎన్ని కేసులు పెట్టిన తెలంగాణ రైతాంగం కోసం నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటాం అని ప్ర‌వీణ్‌కుమార్ హెచ్చ‌రించారు.

ఈ మీడియా స‌మావేశంలో కార్పొరేషన్ మాజీ చైర్మన్లు మెడే రాజీవ్ సాగర్, బాక్రి, గెల్లు శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు.

Advertisement
Advertisement