త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | తండ్రి చేసిన చ‌ట్టాన్నే గౌర‌వించ‌లేని అస‌మ‌ర్థ నేత రాహుల్ గాంధీ.. పార్టీ ఫిరాయింపుల‌పై కేటీఆర్ ధ్వ‌జం

KTR | పార్టీ ఫిరాయింపుల‌ను తోసిపుచ్చిన స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్‌పై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. అసెంబ్లీ సాక్షిగా ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ పార్టీ నిలువునా ఖూనీ చేసింద‌ని ఆయ‌న ధ్వ‌జ‌మెత్తారు.

S

Telangana | Published On Dec 17, 2025, 7.40 pm IST

KTR | తండ్రి చేసిన చ‌ట్టాన్నే గౌర‌వించ‌లేని అస‌మ‌ర్థ నేత రాహుల్ గాంధీ.. పార్టీ ఫిరాయింపుల‌పై కేటీఆర్ ధ్వ‌జం
Advertisement

KTR | హైద‌రాబాద్ : పార్టీ ఫిరాయింపుల‌ను తోసిపుచ్చిన స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్‌పై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. అసెంబ్లీ సాక్షిగా ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ పార్టీ నిలువునా ఖూనీ చేసింద‌ని ఆయ‌న ధ్వ‌జ‌మెత్తారు.

దేశ అత్యున్నత న్యాయస్థానాలపైనే కాదు.. చివరికి రాజ్యాంగంపై కూడా రాహుల్ గాంధీకి ఏమాత్రం గౌరవం లేదని మరోసారి తేలిపోయింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇంటికి వెళ్లి మరీ సీఎం రేవంత్ పార్టీ ఫిరాయింపులకు తెరతీసిన నాటి నుంచి నేటి స్పీకర్ నిర్ణయం వరకూ కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని అడుగడుగునా అపహాస్యం చేస్తూనే ఉందని కేటీఆర్ అన్నారు.

అభివృద్ధి కోసం పార్టీ మారినట్టు సాక్షాత్తు ఫిరాయింపు ఎమ్మెల్యేలే అనేక సార్లు ప్రకటించినా వారిని కాపాడటం రాహుల్ రెండు నాల్కల ధోరణికి నిదర్శనం. కేవలం ఫోటోలకు ఫోజులిచ్చేందుకు చేతిలో రాజ్యాంగాన్ని పట్టుకుని తిరిగితే సరిపోదు. తండ్రి చేసిన చట్టాన్నే గౌరవించలేని అసమర్థ నాయకుడిగా రాహుల్ గాంధీ చరిత్రలో మిగిలిపోతారు అని కేటీఆర్ ధ్వ‌జ‌మెత్తారు.

రేవంత్ రెండేళ్ల పాలనా వైఫల్యాలపై పంచాయతీ ఎన్నికల్లో పల్లెపల్లెనా వెల్లువెత్తుతున్న ప్రజావ్యతిరేకతకు భయపడే కాంగ్రెస్ పార్టీ బై ఎలక్షన్స్ అంటే జంకుతోంది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్య తీసుకోకుండా వెనకడుగు వేయడానికి ప్రధాన కారణం ఇదేనని తెలంగాణ సమాజానికి స్పష్టంగా అర్థమైపోయింది. గోడ దూకిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తాత్కాలికంగా కాపాడినట్టు కాంగ్రెస్ అనుకున్నా.. ప్రజాక్షేత్రంలో వారిని ఎమ్మెల్యే పదవికి అనర్హులుగా ఆయా నియోజకవర్గాల ప్రజలు ఎప్పుడో ప్రకటించేశారు అని కేటీఆర్ పేర్కొన్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement