KTR | కాంగ్రెస్ సర్కార్ వైఫల్యం వల్లే రిమ్స్‌లో అగ్నిప్రమాదం
KTR | ఆదిలాబాద్ జిల్లా రిమ్స్ ఆస్పత్రిలో అగ్నిప్రమాద ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. కాంగ్రెస్ సర్కార్ ఘోర వైఫల్యం వల్లే అగ్నిప్రమాదం జరిగిందన్నారు. విద్యుత్ షాక్‌తో ముగ్గురు చిన్నారులు మృతి చెందడం అత్యంత బాధాకరమని ఆయన పేర్కొన్నారు.
చిన్నారుల మృతి అత్యంత బాధాకరమన్న కేటీఆర్
KTR | త్రినేత్ర.న్యూస్ : ఆదిలాబాద్ జిల్లా రిమ్స్ ఆస్పత్రిలో అగ్నిప్రమాద ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. కాంగ్రెస్ సర్కార్ ఘోర వైఫల్యం వల్లే అగ్నిప్రమాదం జరిగిందన్నారు. విద్యుత్ షాక్‌తో ముగ్గురు చిన్నారులు మృతి చెందడం అత్యంత బాధాకరమని ఆయన పేర్కొన్నారు.
గాయపడ్డ 23 మంది పిల్లలకు మెరుగైన చికిత్స అందించాలని, వారి ప్రాణాలను కాపాడాలని కేటీఆర్ అన్నారు. రేవంత్ సర్కార్ వైఫల్యం వల్లే ఇంత పెద్ద ప్రమాదం జరిగి, అభం శుభం తెలియని పిల్లలు అన్యాయంగా బలైపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటినుంచి ప్రభుత్వ వైద్య రంగాన్ని పూర్తిగా విధ్వంసం చేసిన సీఎం రేవంత్ రెడ్డే ఈ సంఘటనకు పూర్తి బాధ్యత వహించాలి. రిమ్స్ ఆసుపత్రిలో నెలకొన్న దుస్థితులపై అనేకసార్లు బీఆర్ఎస్ జిల్లా నేతలు ప్రభుత్వాన్ని హెచ్చరించినా మొద్దునిద్ర పోయిన రేవంత్ సర్కారులో కనీస చలనం కనిపించలేదు. అత్యంత పకడ్బందీ చర్యలు తీసుకోవాల్సిన పిల్లల వార్డులో ప్రభుత్వ పర్యవేక్షణ పూర్తిగా లోపించడం, కనీస నిర్వహణ లేకపోవడం వల్లే ఈ దురదృష్టకర సంఘటన చోటుచేసుకుంది అని కేటీఆర్ పేర్కొన్నారు.
ఆదిలాబాద్ రిమ్స్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లోని పిల్లల వార్డులు, ఐసీయూలను నిపుణులతో తనిఖీ చేయించి ఇలాంటి సంఘటనలు జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలి. రేవంత్ సర్కారు చేతకానితనం వల్ల తమ పసిపిల్లలను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న బాధిత కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా చెల్లించి ఆదుకోవాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం అని కేటీఆర్ పేర్కొన్నారు.
సంబంధిత వార్తలు

మొదట కేటీఆర్.. తర్వాత హరీశ్.. చివరగా కేసీఆర్: రేవంత్ ‘త్రిముఖ’ వ్యూహం!
సెప్టెంబర్ 22, 2026

తెలంగాణలో “మిని” సమరశంఖం: స్థానిక పోరులో గెలుపెవరిది? పార్టీల ప్రాగ్రెస్ రిపోర్ట్‌కు రియల్ టెస్ట్!
సెప్టెంబర్ 22, 2026

Uttam Kumar Reddy | రైతులకు రూ.813 కోట్ల పరిహారం వెంటనే చెల్లించాలి : మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
సెప్టెంబర్ 21, 2026
తాజావార్తలు
- ●Hardeep Singh Puri | దేశంలో ఎల్పీజీ కొరత లేదు.. వదంతులు నమ్మొద్దు : కేంద్రం
- ●Vande Mataram Supreme Court | వందేమాతరం పాడకపోతే క్రిమినల్ నేరమా? కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీం కోర్టు
- ●MLA Premsagar Rao | వట్టిగ కాలేసి తొక్కితే సచ్చిపోతరు బిడ్డా.. మళ్లోసారి వార్నింగ్ ఇస్తున్నా
- ●Chiranjeevi | సినిమాలతో కోట్లు సంపాదిస్తున్నా.. అది చాలు - బ్లడ్ అమ్ముకుంటున్నారంటూ ఆరోపణలపై చిరంజీవి రియాక్షన్
- ●RIMS Adilabad | ఆదిలాబాద్ రిమ్స్‌లో అగ్నిప్రమాదం.. మూడుకు చేరిన మృతులు
- ●Supreme Court | కావేరి జలాల వివాదం.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

Hardeep Singh Puri | దేశంలో ఎల్పీజీ కొరత లేదు.. వదంతులు నమ్మొద్దు : కేంద్రం

Vande Mataram Supreme Court | వందేమాతరం పాడకపోతే క్రిమినల్ నేరమా? కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీం కోర్టు

MLA Premsagar Rao | వట్టిగ కాలేసి తొక్కితే సచ్చిపోతరు బిడ్డా.. మళ్లోసారి వార్నింగ్ ఇస్తున్నా

Chiranjeevi | సినిమాలతో కోట్లు సంపాదిస్తున్నా.. అది చాలు - బ్లడ్ అమ్ముకుంటున్నారంటూ ఆరోపణలపై చిరంజీవి రియాక్షన్



