త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ponnam Prabhakar | రూ.3.22 కోట్లతో ఉప్ప‌ల్‌లో సిటీ బ‌స్ టెర్మిన‌ల్‌కు శంకుస్థాప‌న‌

Ponnam Prabhakar | మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పరిధిలోని బోడుప్పల్ సర్కిల్‌–10, ఉప్పల్ జోనల్ వర్క్‌షాప్ వద్ద రూ.3.22 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న సిటీ బస్ టెర్మినల్‌కు రాష్ట్ర ర‌వాణా శాఖ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ శంకుస్థాపన చేశారు.

S

Telangana | Published On Oct 24, 2026, 1.16 pm IST

Ponnam Prabhakar | రూ.3.22 కోట్లతో ఉప్ప‌ల్‌లో సిటీ బ‌స్ టెర్మిన‌ల్‌కు శంకుస్థాప‌న‌
Advertisement

100 రోజుల్లోనే బ‌స్టాండ్ నిర్మాణం పూర్తి చేస్తాం
ఫిర్జాదిగూడ‌, బోడుప్ప‌ల్ ప్రాంతాల పేరుతోనే కొత్త బ‌స్టాండ్‌కు నామ‌క‌ర‌ణం
కాలుష్యాన్ని త‌గ్గించేందుకు ఎల‌క్ట్రిక్ బ‌స్సుల‌ను ప్రోత్స‌హిస్తున్నాం
రాష్ట్ర ర‌వాణా శాఖ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ వెల్ల‌డి

Ponnam Prabhakar | త్రినేత్ర న్యూస్ : మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పరిధిలోని బోడుప్పల్ సర్కిల్‌–10, ఉప్పల్ జోనల్ వర్క్‌షాప్ వద్ద రూ.3.22 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న సిటీ బస్ టెర్మినల్‌కు రాష్ట్ర ర‌వాణా శాఖ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ శంకుస్థాపన చేశారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ మాట్లాడుతూ.. రోజుకు సుమారు లక్ష మంది ప్రయాణికులకు సేవలందించేలా ఆధునిక మౌలిక సదుపాయాలతో ఈ బస్ టెర్మినల్‌ను నిర్మిస్తున్నామ‌ని తెలిపారు. 100 రోజుల్లో పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామ‌ని పేర్కొన్నారు. ఫిర్జాదిగూడ, బోడుప్పల్ ప్రాంతాల పేరుతోనే ఈ కొత్త బస్ స్టేషన్‌కు నామకరణం చేస్తామ‌ని హామీ ఇచ్చారు.

ఇప్పటికే 3,000కు పైగా కొత్త బస్సులను కొనుగోలు చేశామ‌ని తెలిపారు. పీఎం ఈ-డ్రైవ్ పథకం కింద మరో 2,200 ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయి. హైదరాబాద్‌లో కాలుష్యాన్ని తగ్గించేందుకు ఎలక్ట్రిక్ బస్సులను ప్రోత్సహిస్తున్నాం. రిటైర్డ్ కార్మికుల బకాయిల చెల్లింపుపైనా ముఖ్యమంత్రితో చర్చించాం. కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంద‌ని మంత్రి స్ప‌ష్టం చేశారు. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ సహకారంతో ఈ బస్ టెర్మినల్ నిర్మాణానికి రూ.3.22 కోట్లు కేటాయించినందుకు మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లారెడ్డి, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, మున్సిపల్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి, వజ్రేష్ యాదవ్, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. అనంతరం గ్రీన్ మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సులో ప్రయాణించారు.

Advertisement
Advertisement