త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Monkey Attack | కోతుల దాడి భయంతో పరుగెత్తి బాలుడి మృతి

Monkey Attack | స్నేహితుడితో క‌లిసి చెరువులో చేప‌లు ప‌ట్టేందుకు వెళ్తున్నాడు. మార్గ‌మ‌ధ్య‌లో కోతుల (Monkey Attack) గుంపు వారిపైకి ఎగ‌బ‌డింది. భ‌యంతో ప‌రుగులు పెట్ట‌డంతో కింద‌ప‌డిపోయి చ‌నిపోయిన ఘ‌ట‌న సూర్యాపేట జిల్లా న‌డిగూడెం (Nadigudem) మండ‌లం వ‌ల్లాపురంలో చోటుచేసుకుంది.

G

Telangana | Published On Oct 24, 2026, 6.14 am IST

Monkey Attack | కోతుల దాడి భయంతో పరుగెత్తి బాలుడి మృతి
Advertisement

Monkey Attack | త్రినేత్ర న్యూస్‌: స్నేహితుడితో క‌లిసి చెరువులో చేప‌లు ప‌ట్టేందుకు వెళ్తున్నాడు. మార్గ‌మ‌ధ్య‌లో కోతుల (Monkey Attack) గుంపు వారిపైకి ఎగ‌బ‌డింది. భ‌యంతో ప‌రుగులు పెట్ట‌డంతో కింద‌ప‌డిపోయి చ‌నిపోయిన ఘ‌ట‌న సూర్యాపేట జిల్లా న‌డిగూడెం (Nadigudem) మండ‌లం వ‌ల్లాపురంలో చోటుచేసుకుంది.

వ‌ల్లాపురం గ్రామానికి చెందిన మొక్క వీర‌బాబు దంప‌తులు హైదరాబాద్‌లో (Hyderabad) కూలిప‌నులు చేసుకుంటూ జీవ‌నం సాగిస్తున్నారు. వారికి ఇద్ద‌రు సంతానం. ద‌స‌రా సెల‌వులు కావ‌డంతో వారి కుమారుడు మొక్క నిశాంత్ (12) అమ్మ‌మ్మ ఇంటికి వ‌చ్చాడు. ఈ క్ర‌మంలో శుక్ర‌వారం సాయంత్రం స్నేహితుడైన దేశ‌గాని మ‌ణేంద‌ర్‌తో క‌లిసి గ్రామంలో ఉన్న చెరువులో చేపలు పట్టేందుకు వెళ్తున్నాడు. మార్గంమధ్యలో ఒక్కసారిగా కోతుల గుంపు వీరిపైకి దూసుకొచ్చాయి. ఇద్దరు భయాందోళనలకు గురై ప్రాణభయంతో పరుగు తీశారు. ఈ క్రమంలో నిశాంత్‌ కింద పడిపోవడంతో పక్కనే ఉన్న మణేందర్‌ గట్టిగా కేకలు వేశాడు.

దీంతో కోతులు అక్కడి నుంచి వెళ్లిపోయాయి. అదే సమయంలో అటుగా వెళ్తున్న ఇద్దరు యువకులు నిశాంత్ (Nishank Goud)ను ద్విచక్ర వాహనంపై స్థానిక ఆర్ఎంపీ వ‌ద్ద‌కు తీసుకెళ్లారు. అయితే అత‌డు అందుబాటులో లేకపోవడంతో 108కు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి వచ్చిన అంబులెన్స్‌లో పరీక్షించిన వైద్య సిబ్బంది నిశాంత్‌ అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. బాలుడి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అయితే కోతుల గుంపు ఎగ‌బ‌డ‌టంతో తీవ్ర భ‌యాందోళ‌న‌కు గురైన నిశాంత్‌.. గుండె ఆగిపోయి మ‌ర‌ణించి ఉండ‌వ‌చ్చ‌ని గ్రామ‌స్తులు అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు.

 

Advertisement
Advertisement