Harish Rao | ఏఈఈ పరీక్షను వెంటనే వాయిదా వేయాలి
Harish Rao | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారూ.. తెలంగాణ ఇంజినీరింగ్ విద్యార్థుల ఉద్యోగ అవకాశాలను దెబ్బతీయకుండా.. నవంబర్ 6న జరగనున్న టీజీపీఎస్సీ ఏఈఈ( TGPSC AEE ) పరీక్షను వెంటనే వాయిదా వేయాలని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు( Harish Rao ) కోరారు.
ఇంజినీరింగ్ విద్యార్థుల ఉద్యోగ అవకాశాలను దెబ్బతీయొద్దు
ఎస్సెస్సీ జేఈ పరీక్ష రోజే.. ఏఈఈ పరీక్ష రాయడం ఎలా సాధ్యం..?
ఇతర రాష్ట్రాల్లో పరీక్షల తేదీలు మార్చినప్పుడు
తెలంగాణలో ఎందుకు సాధ్యం కాదు..?
రేవంత్ సర్కార్‌ను నిలదీసిన మాజీ మంత్రి హరీశ్‌రావు
Harish Rao | త్రినేత్ర న్యూస్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారూ.. తెలంగాణ ఇంజినీరింగ్ విద్యార్థుల ఉద్యోగ అవకాశాలను దెబ్బతీయకుండా.. నవంబర్ 6న జరగనున్న టీజీపీఎస్సీ ఏఈఈ( TGPSC AEE ) పరీక్షను వెంటనే వాయిదా వేయాలని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు( Harish Rao ) కోరారు. ఎస్సెస్సీ జేఈ( SSC JE ), టీజీపీఎస్సీ ఏఈఈ పరీక్షలు ఒకే తేదీలో ఉండటంతో వేలాది మంది తెలంగాణ ఇంజినీరింగ్ అభ్యర్థులు ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నారని ఆయన తెలిపారు.
ఇతర రాష్ట్రాల్లో SSC JE పరీక్ష రాసే అభ్యర్థులు వెంటనే తెలంగాణకు తిరిగొచ్చి AEE పరీక్ష రాయడం ఎలా సాధ్యం? ఏళ్ల తరబడి కష్టపడి సిద్ధమైన రెండు పోటీ పరీక్షల్లో ఒకదాన్ని వదులుకోవాల్సిన దుస్థితిలో నిరుద్యోగ యువత ఉన్నారు. పరీక్షల తేదీలు మార్చాలని పలుమార్లు విజ్ఞప్తులు చేసినా TGPSC స్పందించకపోవడం దారుణమన్నారు.
పరీక్షల తేదీలను పునఃపరిశీలించాలని అక్టోబర్ 14నే టీజీపీఎస్సీకి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లేఖ రాశారు. నిరుద్యోగ యువత కోరుతున్నది ఉద్యోగాలు ఇవ్వకుండా పరీక్షలు వాయిదా వేయాలని కాదు.. రెండు పరీక్షలు రాసే అవకాశం కల్పించాలని మాత్రమే. ఒడిశా, బీహార్ వంటి రాష్ట్రాల్లో పరీక్షల తేదీలు మార్చినప్పుడు తెలంగాణలో ఎందుకు సాధ్యం కాదు? రేవంత్ రెడ్డి గారూ.. బేషజాలకు పోయి నిరుద్యోగ యువత భవిష్యత్తును బలి చేయొద్దు. తక్షణమే జోక్యం చేసుకొని నవంబర్ 6న జరగనున్న TGPSC AEE (సివిల్) పరీక్షను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నాం. భవిష్యత్తులో ఇలాంటి గందరగోళం పునరావృతం కాకుండా ప్రభుత్వం, TGPSC ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి అని హరీశ్‌రావు సూచించారు.
తాజావార్తలు
- ●Automatic Emergency Braking System | ఇక కార్లలో ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ సిస్టమ్.. ఏంటిది.. ఎలా పనిచేస్తుంది..?
- ●RBI | అయిదేళ్ల గరిష్ఠానికి దేశంలో చలామణిలో ఉన్న కరెన్సీ
- ●Ponnam Prabhakar | రూ.3.22 కోట్లతో ఉప్పల్‌లో సిటీ బస్ టెర్మినల్‌కు శంకుస్థాపన
- ●TTD | జనవరి నెల టీటీడీ ప్రత్యేక దర్శనం టోకెన్లు విడుదల.. అర గంటలోనే 4,24,000 టికెట్లు బుకింగ్
- ●Swiggy Share Price | కనిష్ట స్థాయిలో స్విగ్గీ షేర్లు.. కొనాలా.. అమ్మాలా..?
- ●Road Accidents | నెత్తురోడిన రహదారులు.. వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు మృతి

Automatic Emergency Braking System | ఇక కార్లలో ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ సిస్టమ్.. ఏంటిది.. ఎలా పనిచేస్తుంది..?

RBI | అయిదేళ్ల గరిష్ఠానికి దేశంలో చలామణిలో ఉన్న కరెన్సీ

Ponnam Prabhakar | రూ.3.22 కోట్లతో ఉప్పల్‌లో సిటీ బస్ టెర్మినల్‌కు శంకుస్థాపన

TTD | జనవరి నెల టీటీడీ ప్రత్యేక దర్శనం టోకెన్లు విడుదల.. అర గంటలోనే 4,24,000 టికెట్లు బుకింగ్





