KTR | 70 వేల ఉద్యోగాలు ఇచ్చినట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
KTR | కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం రేవంత్ రెడ్డి 70 వేల ఉద్యోగాలు ఇచ్చినట్లు నోటిఫికేషన్లతో సహా రుజువు చేస్తే శాశ్వతంగా రాజకీయ సన్యాసం తీసుకుంటానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. అవసరమైతే రాహుల్ గాంధీకి జై కొడుతా.. రుజువు చేసే దమ్ముందా రేవంత్ రెడ్డి అని కేటీఆర్ నిలదీశారు.
అవసరమైతే రాహుల్ గాంధీకి జైకొడుతా..!
రుజువు చేసే దమ్ముందా రేవంత్
కాంగ్రెస్ పార్టీ యువతరాన్ని మోసం చేసింది
ఉద్యోగాలివ్వమంటే ఎండ్రిన్ తాగమంటావా
నోటిఫికేషన్లు లేవు.. లూటిఫికేషన్లే
యువతరంతో పెట్టుకుంటే పుట్టగతులుండవు
దమ్ముంటే సెక్యూరిటీ లేకుండా రా రేవంత్
సరూర్‌నగర్ గ్రౌండ్‌లో ఉద్యోగాల లెక్క తేలుద్దాం
సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
KTR | త్రినేత్ర.న్యూస్ : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం రేవంత్ రెడ్డి 70 వేల ఉద్యోగాలు ఇచ్చినట్లు నోటిఫికేషన్లతో సహా రుజువు చేస్తే శాశ్వతంగా రాజకీయ సన్యాసం తీసుకుంటానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. అవసరమైతే రాహుల్ గాంధీకి జై కొడుతా.. రుజువు చేసే దమ్ముందా రేవంత్ రెడ్డి అని కేటీఆర్ నిలదీశారు. హైదరాబాద్ సరూర్‌నగర్‌లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ యువ సంగ్రామ సదస్సులో కేటీఆర్ పాల్గొని నిరుద్యోగులను ఉద్దేశించి ప్రసంగించారు.
యువ గళాలు గర్జిస్తే కుర్చీలు కూలిపోతాయి.. ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి మరో లెక్క. తెలంగాణ ఉద్యమంలో వేల మంది విద్యార్థులను చంపిన పార్టీ కాంగ్రెస్. జిత్తులమారి నక్కలాంటి కాంగ్రెస్ పార్టీ యువతను మోసం చేసింది. ఒక జిత్తులమారి ముసలి నక్క కాంగ్రెస్ యువజనాన్ని తెలివిగా చిత్తు చేసింది. ఒక నక్క ఎవరినీ మోసం చేయనని ప్రమాణం చేసిందట, తోటి జంతువులను ఇక చంపనని ఒక పులి పశ్చాత్తాపపడిందట అని కేటీఆర్ విమర్శించారు.
యువతరంతో పెట్టుకుంటే తరాలపాటు పుట్టగతులు లేకుండా పోతారు
యువతరంతో పెట్టుకుంటే తరాలపాటు పుట్టగతులు లేకుండా పోతారు. యూత్ డిక్లరేషన్‌లో రాహుల్ ఇచ్చిన హామీలు ఏమయ్యాయి. తెలంగాణలో నోటిఫికేషన్లు లేవు.. లూటిఫికేషన్లే. యువతకు జాబులు లేవు.. రాహుల్‌గాంధీ జేబులే నిండుతున్నాయి. ఇవాళ వీళ్ల మాటలు వింటుంటే 60 ఏళ్లు నెత్తురుకు మరిగిన కాంగ్రెస్ ఏ రకంగా మోసం చేసిందో గుర్తు తెచ్చుకోండి. పాత కేటుగాళ్లు, కొత్త డూప్లికేట్ గాళ్లు కలిసి తెలంగాణ యువత మీద నకిలీ ప్రేమను కురిపిస్తూ విసిరిన వల పేరే యూత్ డిక్లరేషన్. ఈ యూత్ డిక్లరేషన్‌లో 24 హామీలు ఇస్తే, ఒక్క హామీ కూడా నెరవేరలేదు అని కేటీఆర్ స్పష్టం చేశారు.
రాహుల్ గాంధీ.. ఇప్పుడెక్కడ అడ్డగాడిదలను కాస్తున్నవ్!
కొలువుల కుంభమేళా అన్నారు.. కుంభకోణాల కుంభమేళా చేస్తున్నారు. ఉద్యోగాలు అడిగితే ఉరికించి కొడుతున్నారు. కొలువులు అడిగితే లాఠీచార్జీలు చేస్తున్నారు. అశోక్ నగర్‌లో, దిల్‌సుఖ్‌నగర్‌లో దమనకాండ, దౌర్జన్యకాండలు చేస్తున్నరు. నిరుద్యోగుల మీద నిర్బంధం జరుగుతుంటే. ఎక్కడ షికార్లు చేస్తున్నవ్ రాహుల్ గాంధీ? అశోక్ నగర్ చౌరస్తాలో అందమైన కబుర్లు చెప్పి అవతల పడ్డ రాహుల్ గాంధీ.. ఇప్పుడెక్కడ అడ్డగాడిదలను కాస్తున్నవ్! అని కేటీఆర్ ఫైర్ అయ్యారు.
ఉద్యోగాలు ఇవ్వమంటే ఎండ్రిన్ తాగమంటావా.. రేవంత్?
ఉద్యోగాలు ఇవ్వమంటే ఎండ్రిన్ తాగమంటావా.. రేవంత్? దమ్ముంటే.. సెక్యూరిటీ లేకుండా రేపు సరూర్ నగర్ గ్రౌండ్‌కు రా! కాంగ్రెస్ నాయకులు తలాతోక లేకుండా.. ఒక్కొక్కడు ఒక్కో లెక్క చెబుతున్నడు. ఒకడు 80 వేలు అంటడు, ఇంకొకడు 70 వేలు అంటడు, మరొకడు 60 వేలు అంటడు! ఇంతకుముందు దొంగ లెక్కలు చెబితే కాకి లెక్కలు అనేటోళ్లు, ఇప్పుడు కాంగ్రెస్ లెక్కలు అంటున్నరు. అసలు ఇచ్చింది 16,978 ఉద్యోగాలే అని శాసనసభ సాక్షిగా ప్రభుత్వమే ఒప్పుకుంది. అందులోంచి రీనోటిఫికేషన్లు తీసేస్తే మొత్తం పదివేలు ఉద్యోగాలు కూడా ఇయ్యలేదు అని కేటీఆర్ తేల్చిచెప్పారు.
హిట్లర్ కంటే దారుణంగా రేవంత్‌రెడ్డి క్లైమాక్స్
రాహుల్‌గాంధీని ప్రధానిని చేసేవరకు విశ్రమించనని రేవంత్‌రెడ్డి అంటున్నారు. రేవంత్‌కు పదవి ఇచ్చింది యువతకు జాబులు ఇచ్చేందుకా.. రాహుల్‌కు జాబ్ ఇచ్చేందుకా? తెలుగు, ఇంగ్లీష్ క్యాలెండర్లు మారాయి కానీ, జాబ్ క్యాలెండర్ మాత్రం మారట్లేదు. అసెంబ్లీలో ఇచ్చిన జాబ్ క్యాలెండర్‌ను చిత్తు కాగితంతో సమానం చేశారు. జంగ్ సైరన్ మోగించడానికి నేడు యువతరం కదిలివచ్చింది. రేవంత్‌రెడ్డి క్లైమాక్స్ హిట్లర్ కంటే దారుణంగా ఉంటుంది అని కేటీఆర్ హెచ్చరించారు.
టీ హబ్‌లో పురుడు పోసుకున్న స్కైరూట్
యువత ఊహలకు రెక్కలిచ్చి, వారి ఆలోచనలను ఆవిష్కరణలుగా మాలిచే టీ హబ్, టీ వర్క్స్ ను స్థాపించాం. మన టీ హబ్‌లో పురుడు పోసుకున్న స్కైరూట్ అనే కంపెనీ ఈరోజు శ్రీహరికోట నుంచి ప్రైవేట్ రాకెట్‌ను పంపింది. 79 ఏళ్ల భారతదేశ చరిత్రలో ఒక ప్రైవేట్ కంపెనీ రాకెట్‌ను పంపడం ఇదే మొదటిసారి అని కేటీఆర్ తెలిపారు.
గుజరాత్ కు గుంజుకుపోవడమే జాతీయ వాదమా?
కంపెనీలు పోతుంటే ఆపలేని కాంగ్రెస్ అసమర్థులనే కాదు.. కంపెనీలను ఎత్తుకుపోతున్న బీజేపీ వాళ్లను కూడా ప్రశ్నించాలి. తెలంగాణ ప్రయోజనాల గురించి మాట్లాడితే ప్రాంతీయ వాదం అంటున్నారు, తెలంగాణ యువకుల గుండెల మీద తన్ని ఇక్కడున్న పరిశ్రమలను గుజరాత్ కు గుంజుకుపోవడమే జాతీయ వాదమా? అని కేటీఆర్ నిలదీశారు.
అన్నగా మాటిస్తున్నా.. మీ బాధ్యత నేను తీసుకుంటా
తెచ్చుకున్న తెలంగాణ తెర్లు అవుతుంటే.. తెలంగాణ యువత చూస్తూ ఊరుకోవాలా? మీ అందరికీ ఒక అన్నగా మాటిస్తున్నా.. మీ బాధ్యత నేను తీసుకుంటా, మీ అందరికీ అండగా నిలుస్తాని కేటీఆర్ భరోసానిచ్చారు.
సంబంధిత వార్తలు

Srinivas Goud | కృష్ణా, భీమా నదులపై కర్ణాటక అక్రమ ప్రాజెక్టులు.. తెలంగాణకు నీళ్లు వచ్చే పరిస్థితి లేదు : శ్రీనివాస్ గౌడ్
జులై 26, 2026

Talasani Srinivas Yadav | ప్రజలంతా సుఖసంతోషాలతో జీవించాలి.. విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్న తలసాని శ్రీనివాస్ యాదవ్
జులై 26, 2026

Rainfall | హైదరాబాద్‌లో లోటు వర్షపాతం.. దంచికొడుతున్న ఎండలు
జులై 26, 2026
తాజావార్తలు
- ●Agadha Movie | బోనమెత్తిన హీరోయిన్.. బల్కంపేట ఎల్లమ్మకు బోనం సమర్పించిన కామాక్షి భాస్కర్ల
- ●Serial Actress | మోడ్రన్ లుక్‌లో గుండె నిండా గుడి గంటలు మీనా
- ●PM Modi Exam Reforms | ఎగ్జామ్ పేపర్ లీక్స్‌కు చెక్: రంగంలోకి నందన్ నిలేకని.. టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసిన ప్రధాని మోదీ!
- ●Vaibhav Suryavanshi | మళ్లీ చితక్కొట్టిన వైభవ్.. టీ20ల్లో అరుదైన చరిత్ర సృష్టించిన సూర్యవంశీ
- ●Rasha Thadani | అమ్మ స్టార్ హీరోయిన్ - నాన్న పెద్ద ప్రొడ్యూసర్ - శ్రీనివాస మంగాపురం హీరోయిన్ బ్యాక్‌గ్రౌండ్ ఇదే!
- ●Malayalam OTT | ఓటీటీలోకి వచ్చేస్తోన్న మలయాళం మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ - సీన్ సీన్‌కో మలుపు

Agadha Movie | బోనమెత్తిన హీరోయిన్.. బల్కంపేట ఎల్లమ్మకు బోనం సమర్పించిన కామాక్షి భాస్కర్ల

Serial Actress | మోడ్రన్ లుక్‌లో గుండె నిండా గుడి గంటలు మీనా

PM Modi Exam Reforms | ఎగ్జామ్ పేపర్ లీక్స్‌కు చెక్: రంగంలోకి నందన్ నిలేకని.. టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసిన ప్రధాని మోదీ!

Vaibhav Suryavanshi | మళ్లీ చితక్కొట్టిన వైభవ్.. టీ20ల్లో అరుదైన చరిత్ర సృష్టించిన సూర్యవంశీ



