త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | ఆ ముగ్గురు మొన‌గాళ్లు కాదు మోస‌గాళ్లు.. ఖ‌మ్మం మంత్రుల‌పై కేటీఆర్ ఫైర్

KTR | ఖ‌మ్మం జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రుల‌పై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాకు ప‌నికొచ్చే ఏ ఒక్క ప‌ని కూడా వారు చేయ‌లేద‌ని మండిప‌డ్డారు. ఈ ముగ్గురు మంత్రులు మొన‌గాళ్లు కాదు మోస‌గాళ్లు అని కేటీఆర్ విమ‌ర్శించారు.

S

Telangana | Published On Jan 7, 2026, 3.56 pm IST

KTR | ఆ ముగ్గురు మొన‌గాళ్లు కాదు మోస‌గాళ్లు.. ఖ‌మ్మం మంత్రుల‌పై కేటీఆర్ ఫైర్
Advertisement

KTR | త్రినేత్ర‌.న్యూస్ : ఖ‌మ్మం జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రుల‌పై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాకు ప‌నికొచ్చే ఏ ఒక్క ప‌ని కూడా వారు చేయ‌లేద‌ని మండిప‌డ్డారు. ఈ ముగ్గురు మంత్రులు మొన‌గాళ్లు కాదు మోస‌గాళ్లు అని కేటీఆర్ విమ‌ర్శించారు. ఈ ముగ్గురు మోస‌గాళ్ల‌కు అస‌లైన నాయ‌కుడు పైనున్న అలీబాబా అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఖ‌మ్మం జిల్లాలో పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో గెలిచిన బీఆర్ఎస్ స‌ర్పంచ్‌ల స‌న్మాన కార్య‌క్ర‌మానికి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజ‌రై ప్ర‌సంగించారు.

బీఆర్ఎస్ హ‌యాంలో ఖ‌మ్మం జిల్లాను స‌స్య‌శ్యామ‌లం చేసేందుకు కేసీఆర్ సీతారామ సాగ‌ర్ ప్రాజెక్టును చేప‌ట్టి 90 శాతం ప‌నుల‌ను పూర్తి చేశార‌ని కేటీఆర్ గుర్తు చేశారు. ఖమ్మం జిల్లాలో 7.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని, గోదావరి జలాలపై పూర్తి హక్కులు ఖమ్మం జిల్లాకే దక్కాలని నాడు కేసీఆర్ ఈ ప్రాజెక్టు నిర్మాణానికి పూనుకున్నారు. కానీ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆ ప్రాజెక్టును పట్టించుకోకుండా గాలికి వదిలేసిందని కేటీఆర్ విమర్శించారు.

ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు కమీషన్‌లకు కక్కుర్తిపడి ప్రాజెక్టును పక్కనపెట్టారని కేటీఆర్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఆ ముగ్గురు మంత్రులు ప్రజలకు మేలు చేయగల మొనగాళ్లు కాదని, మోసగాళ్లని కేటీఆర్‌ విమర్శించారు. వారు 30 శాతం చొప్పున కమీషన్‌లు వసూలు చేసి జేబులు నింపుకోవడమే తప్ప జిల్లాకు పనికొచ్చే పనులు ఒక్కటి కూడా చేయడంలేదని ఆరోపించారు. కాంగ్రెస్‌ నేతలు ఎన్నికల సమయంలో ఈస్ట్‌మన్ కలర్‌లో సినిమా చూపెట్టారని, ఇదిస్తాం.. అదిస్తాం అని నోటికొచ్చిన హామీలు ఇచ్చారని, అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా ఏదీ ఇవ్వలేదని విమర్శించారు.

అశ్వారావుపేటలో ఒక్క సీతారామసాగర్‌ ప్రాజెక్టు ద్వారా 1.30 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చేలా కేసీఆర్‌ డిజైన్‌ చేశారని కేటీఆర్ చెప్పారు. సత్తుపల్లి నియోజకవర్గంలో 40 వేల ఎకరాలకు, ఇల్లందు నియోజకవర్గంలో 20 వేల ఎకరాలకు, కొత్తగూడెంలో 10 వేల ఎకరాలకు, వైరాలో 20 వేల ఎకరాలకు నీళ్లిచ్చేలా కేసీఆర్‌గారు సీతారామ ప్రాజెక్టును డిజైన్‌ చేశారు. కానీ ఆ ప్రాజెక్టును ప్రభుత్వం పక్కనపెట్టింది. ఈ రెండేళ్లలో ప్రభుత్వం చేసింది ఏమైనా ఉందంటే.. అది ఎగవేతలు, కూల్చివేతలు, పేల్చివేతలేని, కేటీఆర్‌ ఎద్దేవా చేశారు.

Advertisement

తాజావార్తలు

Advertisement