త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Jagdeep Dhankhar | మాజీ ఉప రాష్ట్ర‌ప‌తి ధ‌న్‌ఖ‌డ్‌కు తీవ్ర అస్వ‌స్థ‌త.. ఢిల్లీ ఎయిమ్స్‌కు త‌ర‌లింపు

Jagdeep Dhankhar | మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి జ‌గ‌దీప్ ధ‌న్‌ఖ‌డ్ (Jagdeep Dhankhar) తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. బుధ‌వారం ఉద‌యం వాకింగ్ చేస్తుండ‌గా అక‌స్మాత్తుగా స్పృహ కోల్పోయారు.

D

National | Published On Nov 11, 2026, 6.05 pm IST

Jagdeep Dhankhar | మాజీ ఉప రాష్ట్ర‌ప‌తి ధ‌న్‌ఖ‌డ్‌కు తీవ్ర అస్వ‌స్థ‌త.. ఢిల్లీ ఎయిమ్స్‌కు త‌ర‌లింపు
Advertisement

Jagdeep Dhankhar | త్రినేత్ర న్యూస్ : మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి జ‌గ‌దీప్ ధ‌న్‌ఖ‌డ్ (Jagdeep Dhankhar) తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. బుధ‌వారం ఉద‌యం వాకింగ్ చేస్తుండ‌గా అక‌స్మాత్తుగా స్పృహ కోల్పోయారు (Jagdeep Dhankhar collapses during morning walk). 75 ఏళ్ల ధన్‌ఖడ్ కొన్ని నిమిషాల పాటూ అప‌స్మార‌క స్థితిలోకి వెళ్లిపోయారు. అప్ర‌మ‌త్త‌మైన భ‌ద్ర‌తా సిబ్బంది ఆయ‌న్ని వెంట‌నే పీసీఆర్ వాహనంలో ఇంటికి తీసుకెళ్లారు. అనంత‌రం వైద్యుల‌కు స‌మాచారం అందించారు.

ఐఎల్‌బీఎస్ (ILBS) వైద్య బృందం, ఎయిమ్స్ వైద్యుడు డాక్టర్ సందీప్ సేథ్ (AIIMS doctor Sandeep Seth) వెంట‌నే ధ‌న్‌ఖ‌డ్ నివాసానికి చేరుకుని ఆయనకు ప్రాథమిక చికిత్స అందించారు. అయితే, ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో వెంటనే ఆయన్ను ఢిల్లీ ఎయిమ్స్ (Delhi AIIMS)కు తరలించారు. ఆసుపత్రిలోని కార్డియో-న్యూరో సెంటర్‌లో చేర్పించారు. ప్రస్తుతం కార్డియాలజీ విభాగం వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొన‌సాగుతోంది. ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితిపై ఇప్ప‌టి వ‌ర‌కూ ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌నా రాలేదు.

కాగా, ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్‌ ధన్‌ఖడ్‌ (Jagdeep Dhankhar) అనూహ్యంగా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. గ‌తేడాది జూలై 21న రాజీనామా లేఖను రాష్ట్రపతికి పంపారు. అనారోగ్య కారణాలతో వైద్యుల సూచ‌న‌ల మేర‌కు తాను ఉప రాష్ట్రపతి పదవికి రాజీనామా చేస్తున్నానని ధన్‌ఖడ్‌ తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. ఆయన రాజీనామా అనేక ఊహాగానాల‌కు దారి తీసింది. రాజీనామా త‌ర్వాత ఆయ‌న బాహ్య ప్ర‌పంచానికి చాలా త‌క్కువ‌గా క‌నిపిస్తున్నారు. ఇక ఈ ఏడాది జ‌న‌వ‌రిలో కూడా ధ‌న్‌ఖ‌డ్ వారం రోజుల వ్య‌వ‌ధిలోనే రెండుసార్లు అస్వ‌స్థ‌తో ఆసుప‌త్రిలో చేరిన విష‌యం తెలిసిందే. బాత్రూమ్‌లో స్పృహ కోల్పోయారు. ఉప రాష్ట్రపతిగా ఉన్నప్పుడు కూడా ఆయన ఢిల్లీ, ఉత్తరాఖండ్, కేరళ తదితర ప్రాంతాల్లో జరిగిన పబ్లిక్ ఈవెంట్స్‌లోనూ స్పృహతప్పిన సందర్భాలు ఉన్నాయి.

ఇదీ ఆయ‌న రాజ‌కీయ ప్ర‌స్థానం..

జనతాదళ్, కాంగ్రెస్, బీజేపీ వంటి వివిధ రాజకీయ పార్టీల‌తో ధ‌న్‌ఖ‌ర్ రాజ‌కీయ ప్ర‌స్థానం సాగింది. 1989లో జనతాదళ్ తరఫున ఝుంఝును ఎంపీగా గెలిచిన ఆయన, చంద్రశేఖర్ ప్రభుత్వంలో (1990–1991) కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. 1991లో కాంగ్రెస్‌లో చేరి అదే ఏడాది అజ్మీర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి సాధారణ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత 1993లో రాజస్థాన్‌లోని కిషన్‌గఢ్ అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 1998 వరకూ ఎమ్మెల్యేగా కొన‌సాగుతూ.. శాసనసభలో వివిధ కీలక కమిటీల్లో సేవలందించారు. 1998 లోక్‌సభ ఎన్నికల్లో మ‌ళ్లీ ఝుంఝును నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు.

ఆ త‌ర్వాత 2003లో ఆయన బీజేపీలో చేరారు. 2008 రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల ప్రచార కమిటీ సభ్యుడిగా, 2016లో పార్టీ లీగల్ అండ్ లెజిస్లేటివ్ అఫైర్స్ విభాగానికి నాయకత్వం వహించారు. 2019 నుంచి 2022 మధ్య పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌గా బాధ్యతలు నిర్వహించారు. 2022 ఆగస్టులో ఉపరాష్ట్రపతిగా నియమితులయ్యారు. అయితే మరో రెండేండ్లు పదవీకాలం ఉండగానే ధన్‌ఖడ్ ఉప‌రాష్ట్ర‌ప‌తి ప‌ద‌వికి అనూహ్యంగా రాజీనామా చేసి అంద‌రికీ షాకిచ్చారు.

Also Read..

అఖిలేష్ అధికారంలోకి వ‌స్తే రామ‌మందిరంలో న‌మాజ్ చేయిస్తారు : యూపీ మంత్రి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ఐదు విడతల నీట్ కౌన్సెలింగ్ తర్వాత కూడా 411 మెడికల్ సీట్లు ఖాళీగానే.. అధిక ఫీజుల భార‌మే కార‌ణ‌మా..?

రీఎంట్రీకి రెజీనా మాస్టర్ ప్లాన్.. RXతో సాలిడ్ కమ్‌బ్యాక్‌కు రెడీ!

Advertisement
Advertisement