త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | రాహుల్‌కు ఇచ్చే వెయ్యి కోట్లు.. నీ అబ్బ సొమ్మా..? సీఎం రేవంత్‌ను నిల‌దీసిన కేటీఆర్

KTR | కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కుటుంబానికి ఇచ్చే వెయ్యి కోట్లు నీ అయ్య సొమ్మా..? నీ అబ్బ సొమ్మా..? అని సీఎం రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిల‌దీశారు.

S

Telangana | Published On Feb 24, 2026, 5.08 pm IST

KTR | రాహుల్‌కు ఇచ్చే వెయ్యి కోట్లు.. నీ అబ్బ సొమ్మా..? సీఎం రేవంత్‌ను నిల‌దీసిన కేటీఆర్
Advertisement

మ‌రి రెండేళ్ల‌లో రేవంత్ ఎన్ని వేల కోట్లు మింగిండో..!
రేవంత్ అవినీతిపై కేంద్రం మౌన‌మెందుకు..?
సీబీఐ, ఈడీలు ఏం పీకుతున్నాయి..?
బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిల‌దీత‌

KTR | త్రినేత్ర‌.న్యూస్ : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కుటుంబానికి ఇచ్చే వెయ్యి కోట్లు నీ అయ్య సొమ్మా..? నీ అబ్బ సొమ్మా..? అని సీఎం రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిల‌దీశారు. రేవంత్ రెడ్డి ఇంత బాహాటంగా అవినీతి చేస్తుంటే కేంద్రంలోని బీజేపీ ఏం పీకుతుంది? ఈడీ, సీబీఐలు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? అని కేటీఆర్ ప్ర‌శ్నించారు. ఆదిలాబాద్ జిల్లా జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే బాల్క సుమ‌న్‌ను ప‌రామ‌ర్శించిన అనంత‌రం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.

రాహుల్ గాంధీకి ఇవ్వ‌డానికి ముఖ్య‌మంత్రి వ‌ద్ద వెయ్యి కోట్లు ఉన్నాయ‌ట‌..! ఢిల్లీకి ఇచ్చేందుకే వెయ్యి కోట్లు ఉన్నాయంటే.. మ‌రి ఈయ‌న ఎన్ని వేల కోట్ల మింగిండో రాష్ట్ర ప్ర‌జ‌లు ఆలోచించాలి. వేల వేల కోట్లు మింగ‌డానికేమో ఈ రెండేళ్ల‌లో రేవంత్ రెడ్డికి టైమ్ దొరికింది. దోపిడీ బ్ర‌హ్మాండంగా చేస్తున్నారు. రైతుల‌కు రైతుబంధు ఇచ్చే తెలివిలేదు. యూరియా బ‌స్తా లేదు. సోయా, ప‌త్తి కొనుగోలు లేదు. రైతులు అవ‌స్థ‌లు ప‌డుతూనే ఉన్నారని కేటీఆర్ పేర్కొన్నారు.

గాంధీ కుటుంబానికి ఇచ్చే వెయ్యి కోట్లు నీ అయ్యా సొమ్మా..? నీ అబ్బ సొమ్మా..? ఎక్క‌డ్నుంచి తెచ్చావో రాష్ట్ర ప్ర‌జానీకానికి స‌మాధానం చెప్పాలి. ఎన్ని వేల కోట్లు దోపిడీ చేస్తే గాంధీ కుటుంబానికి వెయ్యి కోట్లు ఇస్తాన‌ని అంటున్న‌వ్. అది తెలంగాణ ప్ర‌జ‌ల ర‌క్త‌మాంసాలు కాదా..? తెలంగాణ ప్ర‌జ‌ల చెమ‌ట కాదా..? ఇవాళ వెయ్యి కోట్లు అని ఓపెన్‌గా చెప్తుంటే బీజేపీ ఏం చేస్తున్న‌ది. కేంద్ర సంస్థ‌లు ఏం చేస్తున్నాయి. సీబీఐ, ఈడీలు ఏం పీకుతున్నాయి. రేవంత్ రెడ్డి ఇంత బాహాటంగా అవినీతి చేస్తుంటే కేంద్రంలోని బీజేపీ ఏం పీకుతుంది? రేవంత్ రెడ్డి అవినీతిని బీజేపీ ర‌క్ష‌ణ క‌వ‌చంగా కాపాడుతుంది అని కేటీఆర్ ధ్వ‌జ‌మెత్తారు.

Advertisement

తాజావార్తలు

Advertisement