త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KCR | కేసీఆర్ నియోజ‌క‌వ‌ర్గం.. గ‌జ్వేల్, తూప్రాన్‌లో బీఆర్ఎస్ గెలుపు

KCR | మాజీ మంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న గ‌జ్వేల్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో గులాబీ జెండా రెప‌రెప‌లాడింది. ఈ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో ఉన్న గ‌జ్వేల్, తూప్రాన్ మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ పార్టీ మెజార్టీ స్థానాల‌ను కైవ‌సం చేసుకుంది.

S

Telangana | Published On Feb 13, 2026, 10.33 pm IST

KCR | కేసీఆర్ నియోజ‌క‌వ‌ర్గం.. గ‌జ్వేల్, తూప్రాన్‌లో బీఆర్ఎస్ గెలుపు
Advertisement

KCR | త్రినేత్ర‌.న్యూస్ : మాజీ మంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న గ‌జ్వేల్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో గులాబీ జెండా రెప‌రెప‌లాడింది. ఈ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో ఉన్న గ‌జ్వేల్, తూప్రాన్ మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ పార్టీ మెజార్టీ స్థానాల‌ను కైవ‌సం చేసుకుంది. ఈ రెండు మున్సిపాలిటీల్లోనూ బీఆర్ఎస్ పార్టీకి చెందిన అభ్య‌ర్థులే చైర్‌ప‌ర్స‌న్‌, వైస్ చైర్‌ప‌ర్స‌న్ ప‌ద‌వుల‌ను సొంతం చేసుకోనున్నారు.

గజ్వేల్ మున్సిపాలిటీలో మొత్తం 20 వార్డులుగా ఉండ‌గా బీఆర్ఎస్ 11 వార్డుల్లో గెలుపొందింది. కాంగ్రెస్ ఏడు, బీజేపీ ఒక వార్డులో గెలుపొంద‌గా, స్వ‌తంత్ర అభ్య‌ర్థి ఒక వార్డులో విజ‌యం సాధించాడు. ఎక్స్ అఫిషియో స‌భ్యుడిగా ఎమ్మెల్యే కేసీఆర్ ఉండ‌డంతో.. ఈ మున్సిపాలిటీలో చైర్‌ప‌ర్స‌న్, వైస్ చైర్‌ప‌ర్స‌న్ ఎన్నిక‌కు ఎలాంటి ఆటంకం లేదు. ఈ ఎన్నిక స‌జావుగా జ‌ర‌గ‌నుంది.

ఇక తూప్రాన్ మున్సిపాలిటీలోని మొత్తం 16 వార్డుల్లో బీఆర్ఎస్ 9 వార్డుల్లో విజ‌యం సాధించింది. కాంగ్రెస్ నాలుగు, బీజేపీ మూడు వార్డుల్లో గెలుపొందింది. ఈ మున్సిపాలిటీలోనూ బీఆర్ఎస్ పార్టీ అభ్య‌ర్థుల‌కే చైర్‌ప‌ర్స‌న్, వైస్ చైర్‌ప‌ర్స‌న్ ప‌ద‌వులు వ‌రించ‌నున్నాయి. మొత్తానికి కేసీఆర్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న గ‌జ్వేల్ నియోజ‌క‌వ‌ర్గంలోని రెండు మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ గెల‌వ‌డంతో.. పార్టీ శ్రేణులు సంబురాలు నిర్వ‌హించుకున్నారు.

Advertisement
Advertisement