త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

BRS Party | జూన్ 6న కౌలాలంపూర్‌లో తెలంగాణ ఆవిర్భావ దినోత్స‌వ వేడుక‌లు

BRS Party | జూన్ 6న మలేషియా కౌలాలంపూర్‌లో జరిగే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల ఏర్పాట్లను బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్, పార్టీ ప్రధాన కార్యదర్శి గ్యాదరి బాలమల్లు ప‌రిశీలించారు.

S

Telangana | Published On Jun 3, 2026, 3.04 pm IST

BRS Party | జూన్ 6న కౌలాలంపూర్‌లో తెలంగాణ ఆవిర్భావ దినోత్స‌వ వేడుక‌లు
Advertisement

BRS Party | త్రినేత్ర‌.న్యూస్ : జూన్ 6న మలేషియా కౌలాలంపూర్‌లో జరిగే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల ఏర్పాట్లను బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్, పార్టీ ప్రధాన కార్యదర్శి గ్యాదరి బాలమల్లు ప‌రిశీలించారు.

బీఆర్ఎస్ మలేషియా, MYTA ఆధ్వర్యంలో జూన్ 6, 2026న కౌలాలంపూర్‌లోని మాట్రేడ్ ఎగ్జిబిషన్ అండ్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ముఖ్యఅతిథిగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కానున్నారు. మలేషియా నగరంలో మొదటిసారి జరిగే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వేడుకలకు తెలంగాణ ప్రజలు పెద్ద మొత్తంలో హాజరయ్యే విధంగా చూడాల‌ని మలేషియా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, MYTA సభ్యులతో మాట్లాడారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ గ్లోబల్ ఎన్నారై నాయకులు సురకంటి శ్రీనివాస్, MYTA అధ్యక్షుడు ఎస్.తిరుపతి, మహిళా అధ్యక్షులు కిరణ్మయి, బీఆర్ఎస్ మలేషియా అధ్యక్షులు మారుతి, రాష్ట్ర నాయకులు ఉపేందర్ గౌడ్, పడాల సతీష్, MYTA, BRS సభ్యులు మన్సూర్, సంతోష్, సందీప్, జ్యోతి, మౌనిక, సుప్రియ, శశి, శివ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement