త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Soma Bharat Kumar | మున్సిప‌ల్ ఎన్నిక‌ల‌కు ఇంత తొంద‌ర ఎందుకు..?

Soma Bharat Kumar | మున్నిప‌ల్ ఎన్నిక‌ల‌కు నిన్న నోటిఫికేష‌న్ ఇచ్చి.. నేటి నుంచి 30వ తేదీ దాకా నామినేష‌న్ల‌కు అవ‌కాశం ఇచ్చారు.. అస‌లు ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు ఇంత తొంద‌ర ఎందుకు..? అని బీఆర్ఎస్ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమా భ‌ర‌త్ కుమార్ ప్ర‌శ్నించారు.

S

Telangana | Published On Jan 28, 2026, 5.38 pm IST

Soma Bharat Kumar | మున్సిప‌ల్ ఎన్నిక‌ల‌కు ఇంత తొంద‌ర ఎందుకు..?
Advertisement

Soma Bharat Kumar | త్రినేత్ర‌.న్యూస్ : మున్నిప‌ల్ ఎన్నిక‌ల‌కు నిన్న నోటిఫికేష‌న్ ఇచ్చి.. నేటి నుంచి 30వ తేదీ దాకా నామినేష‌న్ల‌కు అవ‌కాశం ఇచ్చారు.. అస‌లు ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు ఇంత తొంద‌ర ఎందుకు..? అని బీఆర్ఎస్ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమా భ‌ర‌త్ కుమార్ ప్ర‌శ్నించారు. తెలంగాణ భ‌వ‌న్‌లో ఆయ‌న మీడియాతో మాట్లాడారు.

నేటి నుంచి 31 వ‌ర‌కు మేడారం జాత‌ర ఉంది. ప్ర‌తి మున్సిప‌ల్ డివిజ‌న్ నుంచి జ‌నాలు జాత‌ర‌కు వెళ్తారు. అంతేకాకుండా అభ్య‌ర్థుల‌ను రాజ‌కీయ పార్టీలు ఎంపిక చేసుకోవాలి. డాక్యుమెంట్లు స‌మ‌కూర్చుకోవ‌డానికి ఈ స‌మ‌యం స‌రిపోదు. ఇంత తొంద‌ర దేనికీ..? నామినేష‌న్ల దాఖ‌లుకు మూడు రోజుల స‌మ‌యం ఇవ్వ‌డం స‌రికాదు. ఎన్నిక‌లంటే ఓ తంతు కాదు.. ఇది ఆక్షేప‌ణీయం, దుర‌దృష్ట‌క‌రం అని సోమా భ‌ర‌త్ కుమార్ పేర్కొన్నారు.

మొదట షెడ్యూల్ ఇవ్వాలి.. తర్వాత గెజిట్ ఇవ్వాలి.. కనీసం వారం రోజులైనా నామినేషన్లకు అవకాశం ఇవ్వాలి. ఈ సంప్రదాయాలను ఎన్నికల సంఘం ఉల్లంఘించింది. ప్రజాస్వామ్య పద్ధతులకు ఎన్నికల సంఘం విఘాతం కలిగించింది. ఎన్నికల సంఘం తీరుపై బీఆర్ఎస్ తీవ్ర నిరసన ప్రకటిస్తోంది. ఎన్నికలు వాయిదా వేయాలని మేము కోరుకోవడం లేదు. అధికారం ఉంది కదా అని ఎన్నికల సంఘం ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ఎట్లా..? ఇప్పటికైనా ఎన్నికల సంఘం తన పద్ధతి మార్చుకోవాలి. దేశంలో ఎప్పుడూ కూడా ఇలాంటి తప్పుడు పద్ధతుల్లో షెడ్యూల్ విడుదల కాలేదు అని భ‌ర‌త్ కుమార్ గుర్తు చేశారు.

ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసులో స్పీకర్ ఒక్కో పార్టీకి ఒక్కో నీతి అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. సుప్రీంకోర్టు ఇప్పటికే రెండు సార్లు స్పీకర్‌కు తాఖీదులు ఇచ్చింది. ఈ నెల 30 హాజ‌రు కావాల‌ని దానం నాగేంద‌ర్‌కు స్పీక‌ర్ నోటీసులు జారీ చేశారు. ఫిరాయింపులకు అన్ని ఆధారాలున్నా చర్యలు తీసుకోవడానికి స్పీకర్ వెనుకాడుతున్నారు.
స్పీకర్ రాజ్యాంగ బద్దంగా నడుచుకోవాలి. తప్పు చేసిన వారికి ఎక్కువ సమయం ఇచ్చి ఫిర్యాదు చేసిన వారికి తక్కువ సమయం ఇవ్వడం పద్ధతి కాదు అని సోమా భ‌ర‌త్ కుమార్ మండిప‌డ్డారు.

Advertisement

తాజావార్తలు

Advertisement