BRS Party | నందినగర్‌లోనే కేసీఆర్ విచారణ..! శాంతియుత ఆందోళనలకు బీఆర్ఎస్ పిలుపు
BRS Party | ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు హాజరు కావాలని మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. రేపు మధ్యాహ్నం 3 గంటలకు నందినగర్‌లోని తన నివాసంలో సిట్ విచారణకు కేసీఆర్ హాజరు కానున్నట్లు తెలుస్తోంది.
BRS Party | త్రినేత్ర.న్యూస్ : ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు హాజరు కావాలని మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. రేపు మధ్యాహ్నం 3 గంటలకు నందినగర్‌లోని తన నివాసంలో సిట్ విచారణకు కేసీఆర్ హాజరు కానున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నందినగర్‌లోని కేసీఆర్ నివాసం వద్ద, తెలంగాణ భవన్ వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
శాంతియుత ఆందోళనలకు బీఆర్ఎస్ పిలుపు
బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై ప్రస్తుత ప్రభుత్వం అనుసరిస్తున్న అప్రజాస్వామిక, రాజకీయ కక్షసాధింపు చర్యలను నిరసిస్తూ రేపు రాష్ట్రవ్యాప్తంగా భారీ ఆందోళనలు చేపట్టాలని బిఆర్ఎస్ పార్టీ నేతలు పిలుపునిచ్చారు. ఈ మేరకు పార్టీ సీనియర్ నేతలు మాజీ మంత్రులు మధుసూదనాచారి, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, పద్మారావు గౌడ్, ప్రశాంత్ రెడ్డి, సత్యవతి రాథోడ్, బాలమల్లు, కర్నె ప్రభాకర్, ఎమ్మెల్యే వివేక్, కృష్ణారావు తదితరులు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే కేసీఆర్ గారిని వేధిస్తోందని, రాజకీయ వేధింపుల్లో భాగంగా ఆయనను అవమానిస్తూ అమానుషంగా ప్రవర్తిస్తోందని మండిపడ్డారు. టెలిఫోన్ ట్యాపింగ్ పేరిట కట్టుకథలు సృష్టించి, ఇప్పుడు సిట్ (SIT) విచారణ పేరుతో నోటీసులు జారీ చేయడం దుర్మార్గమైన, నీచమైన వైఖరి అని అభివర్ణించారు.
రేపటి నిరసన కార్యక్రమాల్లో భాగంగా రాష్ట్రంలోని 12,000 పైచిలుకు గ్రామాల్లో ప్రభుత్వ దిష్టిబొమ్మల దహన కార్యక్రమాలు నిర్వహించాలని వీరు సూచించారు. అలాగే ప్రతి మున్సిపల్, నియోజకవర్గ కేంద్రాల్లో మోటార్ సైకిల్ ర్యాలీలు, నల్ల జెండాలతో నిరసనలు, ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టడం ద్వారా ప్రభుత్వానికి నిరసన సెగ తగిలేలా చేయాలని పిలుపునిచ్చారు.
పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు ఎక్కడికక్కడ తమ సొంత జిల్లాల్లోనే ఉండి ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు ఆదేశించారు. నిరసనలు ప్రజాస్వామ్యబద్ధంగా, శాంతియుతంగా ఉండాలని, పోలీసులతో ఘర్షణలకు తావివ్వకుండా ప్రభుత్వం చేస్తున్న కుట్రలను ప్రజలకు వివరించాలని కోరారు.
సంబంధిత వార్తలు

KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
మే 21, 2026

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



