త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KCR | కేసీఆర్ సీఎం కావాల‌ని.. 4 రోజుల్లో 140 కి.మీ. పాద‌యాత్ర‌

KCR | తెలంగాణ‌కు మ‌ళ్లీ కేసీఆర్ ముఖ్య‌మంత్రి కావాల‌ని చాలా మంది కోరుకుంటున్నారు. అందులో ఈ యువ‌కుడు కూడా ఒక‌రు. అయితే ఈ యువ‌కుడు కేసీఆర్ సీఎం కావాల‌ని త‌న ఆకాంక్ష‌ను ఊరికే వెలిబుచ్చ‌లేదు. 4 రోజుల్లో 140 కిలోమీట‌ర్లు పాద‌యాత్ర చేశాడు.

S

Telangana | Published On Feb 26, 2026, 7.32 am IST

KCR | కేసీఆర్ సీఎం కావాల‌ని.. 4 రోజుల్లో 140 కి.మీ. పాద‌యాత్ర‌
Advertisement

KCR | త్రినేత్ర‌.న్యూస్ : తెలంగాణ‌కు మ‌ళ్లీ కేసీఆర్ ముఖ్య‌మంత్రి కావాల‌ని చాలా మంది కోరుకుంటున్నారు. అందులో ఈ యువ‌కుడు కూడా ఒక‌రు. అయితే ఈ యువ‌కుడు కేసీఆర్ సీఎం కావాల‌ని త‌న ఆకాంక్ష‌ను ఊరికే వెలిబుచ్చ‌లేదు. 4 రోజుల్లో 140 కిలోమీట‌ర్లు పాద‌యాత్ర చేశాడు.

నారాయ‌ణ‌పేట నియోజ‌క‌వ‌ర్గం కోయిల్‌కొండ మండ‌ల ప‌రిధిలోని అంకిల్ల గ్రామానికి చెందిన కావ‌లి రామ‌చంద‌ర్ ముదిరాజ్‌కు కేసీఆర్ అంటే గుండెల నిండా అభిమానం. కేసీఆర్ మ‌ళ్లీ సీఎం కావాల‌ని నిత్యం ప‌రిత‌పించేవాడు. కేవ‌లం మ‌న‌సులో అనుకుంటే స‌రిపోద‌ని చెప్పి.. వినూత్నంగా త‌న సంక‌ల్పానికి పాద‌యాత్ర‌ను తోడు చేశాడు. త‌న సొంతూరు అంకిల్ల నుంచి హైద‌రాబాద్‌కు పాద‌యాత్ర చేశాడు. కేవ‌లం నాలుగు రోజుల్లోనే 140 కిలోమీట‌ర్లు న‌డ‌క సాగించి.. చివ‌ర‌కు హైద‌రాబాద్‌కు చేరుకున్నాడు. ఈ సంద‌ర్భంగా బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను క‌లిసి త‌న మ‌ద్ద‌తును తెలియ‌జేశాడు. దీంతో రామ‌చంద‌ర్‌ను కేటీఆర్ శాలువాతో స‌న్మానించి.. శుభాకాంక్ష‌లు తెలిపారు.

https://x.com/BRSparty/status/2026665182781648901

Advertisement
Advertisement