BRS MPs | కొత్తగూడెంను రైల్వే డివిజన్‌గా ఏర్పాటు చేయండి.. కేంద్రానికి బీఆర్ఎస్ ఎంపీల విజ్ఞప్తి
BRS MPs | ఎంతో చారిత్రక నేపథ్యం కలిగిన కొత్తగూడెం రైల్వే స్టేషన్‌ను రైల్వే డివిజన్‌గా ఏర్పాటు చేయాలని కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు బీఆర్ఎస్ ఎంపీలు సురేశ్ రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర విజ్ఞప్తి చేశారు.
BRS MPs | త్రినేత్ర.న్యూస్ : ఎంతో చారిత్రక నేపథ్యం కలిగిన కొత్తగూడెం రైల్వే స్టేషన్‌ను రైల్వే డివిజన్‌గా ఏర్పాటు చేయాలని కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు బీఆర్ఎస్ ఎంపీలు సురేశ్ రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వినతిపత్రం కూడా అందజేశారు.
ఈ రైల్వే స్టేషన్ మూలాలు 1932లో బ్రిటిష్ కాలం నాటివని, వేగంగా విస్తరిస్తున్న సింగరేణి బొగ్గు క్షేత్రాలకు సేవలు అందించడానికి గాను దీన్ని భద్రాచలం రోడ్‌గా అభివృద్ధి చేశారని కేంద్ర మంత్రికి బీఆర్ఎస్ ఎంపీలు తెలిపారు. నాటి చారిత్రక పత్రాలు, అరుదైన ఛాయాచిత్రాలు, రైల్వే, మైనింగ్ కార్యకలాపాలతో సంబంధం ఉన్న ఆధారాలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. ఈ స్టేషన్ ఒక వ్యూహాత్మక బొగ్గు రవాణా కేంద్రంగా ఎలా రూపుదాల్చిందో ఇవి స్పష్టం చేస్తాయని రవిచంద్ర, సురేష్ రెడ్డిలు మంత్రికి వివరించారు.
శతాబ్ద కాలంగా కొత్తగూడెం దేశానికి విద్యుత్ సరఫరా చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నది. ఇది సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్‌కు ప్రధాన కేంద్రంగా కొనసాగుతున్నదని, భారతీయ రైల్వేలో సరుకు రవాణా ఆదాయానికి కీలకమైనదని తన వినతిపత్రంలో ఎంపీ రవిచంద్ర పేర్కొన్నారు. ఇంత గొప్ప వారసత్వం ఉన్నా కూడా భారతీయ రైల్వే చరిత్రలో కొత్తగూడెం స్టేషన్ తగిన గుర్తింపు పొందలేకపోయిందని మంత్రి దృష్టికి తెచ్చారు.
కొత్తగూడెం తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిషా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను కలిపే ఒక ప్రధాన రైల్వే కేంద్రంగా అభివృద్ధి చెందుతున్నది. 2032లో కొత్తగూడెం రైల్వే స్టేషన్ 100 ఏళ్ల మైలురాయిని చేరుకోనున్న తరుణంలో, ఈ చారిత్రాత్మక స్టేషన్‌కు తగిన గుర్తింపు లభించాలనేది ప్రజల చిరకాల ఆకాంక్ష అని ఆయన మంత్రికి వివరించారు. కొత్తగూడెంలో రైల్వే డివిజన్ ఏర్పాటు కేవలం అభివృద్ధి డిమాండ్ మాత్రమే కాదని, 1932 నుండి దాని చారిత్రక సహకారం, బొగ్గు, ఖనిజ రవాణాలో ప్రాముఖ్యత కలిగి ఉన్నదని, జాతీయ రైల్వే కేంద్రంగా భవిష్యత్తులో పాత్ర పోషించనున్నదని ఎంపీ వద్దిరాజు పేర్కొన్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



