Tata Madhu | గాజాను తలపించేలా వెలుగుమట్లలో విధ్వంసం: ఎమ్మెల్సీ తాతా మధు
Tata Madhu | గాజాను తలపించేలా వెలుగుమట్లలో విధ్వంసం జరిగిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు (Tata Madhu) విమర్శించారు. తమది ఇందిరమ్మ రాజ్యం అని, పేదలకు ఇండ్లు కట్టిస్తామని చెప్పిన ప్రభుత్వం పేదల ఇండ్లను నిర్ధాక్షిణ్యంగా కూల్చివేసిందని మండిపడ్డారు.
Tata Madhu | త్రినేత్ర.న్యూస్: గాజాను తలపించేలా వెలుగుమట్లలో విధ్వంసం జరిగిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు (Tata Madhu) విమర్శించారు. తమది ఇందిరమ్మ రాజ్యం అని, పేదలకు ఇండ్లు కట్టిస్తామని చెప్పిన ప్రభుత్వం పేదల ఇండ్లను నిర్ధాక్షిణ్యంగా కూల్చివేసిందని మండిపడ్డారు. మండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా తాతా మధు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ సహా ప్రతిపక్షాల ఆందోళనలకు తలొగ్గిన ప్రభుత్వం ఎక్కడైతే కూల్చివేశారో అక్కడే పట్టాలిచ్చి ఇండ్లు కడతామని ప్రకటించిదని చెప్పారు. సంపినోడే సంతాప సభలు పెట్టినట్లుగా ప్రభుత్వ తీరు ఉందని ధ్వజమెత్తారు. అయితే 1895 మంది బాధితులు ఉంటే 311 మందికి మాత్రమే పట్టాలిచ్చిందని విమర్శించారు. కానీ మొత్తం బాధితులకు పక్కా ఇండ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇండ్లు కూలగొట్టిన అందరికి నష్ట పరిహారం ఇవ్వాలన్నారు.
మరోవైపు శాసన సభలో కూడా వెలుగుమట్ల విధ్వంసం ప్రస్తావనకు వచ్చింది. ప్రశ్నోత్తరాల సందర్భంగా మూసీపై ప్రశ్నించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను మంత్రులు పదేపదే అడ్డుకున్నారు. దీంతో కేటీఆర్.. వెలుగుమట్లలో విధ్వంసం సృష్టించారని చెప్పారు. దీనికి స్పందించిన మంత్రి తుమ్మల నాగేశ్వర రావు వెలుగుమట్ల స్వల్పకాలిక చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, బాధితులకు ఏవిధంగా సహాయం అందించనున్నామో సవివరంగా చెబుతామన్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






