త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Vaddiraju Ravi Chandra | ఖ‌మ్మంలో 10 సీట్లు మావే.. ఇక్క‌డి మంత్రుల‌కు దిమ్మ తిర‌గ‌డం ఖాయం: ఎంపీ వ‌ద్దిరాజు

Vaddiraju Ravi Chandra | అసెంబ్లీ ఎన్నికలు 2028లో లేదా 2029లో ఎప్పుడొచ్చినా గతంలో మాదిరిగా కాకుండా జిల్లాలోని ముగ్గురు మంత్రుల దిమ్మెతిరిగేలా 10 సీట్లను బీఆర్ఎస్ కైవసం చేసుకోవడం తథ్యమని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు ర‌విచంద్ర‌ ధీమా వ్య‌క్తం చేశారు. పార్టీ అధినేత కేసీఆర్‌ నిర్ణయాన్ని, ఆదేశాన్ని స్వాగతిస్తూ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో గులాబీ శ్రేణులు, అభిమానులు, శ్రేయోభిలాషులు స్వచ్ఛందంగా పాల్గొని దిగ్విజయం చేయాల‌ని కోరారు.

S

News | Published On May 15, 2026, 3.57 pm IST

Vaddiraju Ravi Chandra | ఖ‌మ్మంలో 10 సీట్లు మావే.. ఇక్క‌డి మంత్రుల‌కు దిమ్మ తిర‌గ‌డం ఖాయం: ఎంపీ వ‌ద్దిరాజు
Advertisement
  • కాంగ్రెసోళ్ల‌కు పాల‌న చేత‌నైత‌లేదు
  • రాష్ట్రం స‌మ‌స్య‌ల సుడిగుండంలో చిక్కుకుంది
  • ఎన్నిక‌లెప్పుడొచ్చినా విజ‌యం మాదే
  • స‌భ్య‌త్వ న‌మోదును విజ‌య‌వంతం చేద్దాం
  • పార్ల‌మెంటు స‌భ్యులు వ‌ద్దిరాజు ర‌విచంద్ర పిలుపు

Vaddiraju Ravi Chandra | త్రినేత్ర‌.న్యూస్‌: అసెంబ్లీ ఎన్నికలు 2028లో లేదా 2029లో ఎప్పుడొచ్చినా గతంలో మాదిరిగా కాకుండా జిల్లాలోని ముగ్గురు మంత్రుల దిమ్మెతిరిగేలా 10 సీట్లను బీఆర్ఎస్ కైవసం చేసుకోవడం తథ్యమని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు ర‌విచంద్ర‌ ధీమా వ్య‌క్తం చేశారు. ఇందు కోసం మనమందరం కూడా మరింత సంఘటితంగా ముందుకు సాగుదామన్నారు. ఖమ్మం తెలంగాణ భవన్ లో శుక్రవారం పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్ రావు, మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, కందాళ ఉపేందర్ రెడ్డి తదితర ప్రముఖులతో కలిసి ఆయ‌న విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం సమస్యల సుడిగుండంలో చిక్కుకున్నది. అన్ని వర్గాల ప్రజలు అసహనంతో ఉన్నారు. కాంగ్రెస్ నాయకులకు పాలించడం చేతకావడం లేదు. ఎన్నికలకు ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేయట్లేదు. తెలంగాణలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిపోవడంతో, సంక్షేమ ఫలాలు అందకపోవడంతో ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. రైతు భరోసా అందక, రుణమాఫీ చేయ‌క‌, ధాన్యం కొనుగోళ్లు లేక, విద్యుత్ కోతలతో అన్నదాతలు అల్లాడిపోతున్నారు. ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అని ఎంపీ రవిచంద్ర ఆవేదన వ్యక్తం చేశారు.

విద్యార్థులు, యువత, మహిళలు, కార్మికులతో అన్ని వర్గాల ప్రజలు పదేళ్ల కేసీఆర్ సుపరిపాలనను గుర్తు చేసుకుంటూ చేసిన తప్పుకు బాధపడుతున్నారు. ఇప్పుడు అంతటా కూడా డిజిటల్ యుగం నడుస్తున్నది. ఆ బాటలోనే బీఆర్ఎస్ ముందుకు వెల‌ళ‌ పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియను ఆన్ లైన్ ద్వారా మొదలుపెట్టాలని నిర్ణయించింది. పార్టీ అధినేత నిర్ణయాన్ని, ఆదేశాన్ని స్వాగతిస్తూ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో గులాబీ శ్రేణులు, అభిమానులు, శ్రేయోభిలాషులు స్వచ్ఛందంగా పాల్గొని దిగ్విజయం చేయాలి. బీఆర్ఎస్ ను మరింత శక్తివంతం చేయాలి అని వ‌ద్దిరాజు పిలుపునిచ్చారు.

పార్టీ సభ్యత్వ నమోదు, కమిటీల నిర్మాణానికి సంబంధించి ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇంఛార్జి గా నియమితులైన ఎమ్మెల్సీ తక్కళ్లపల్లిని ఎంపీ వద్దిరాజు శాలువాతో సత్కరించారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు లింగాల కమల్ రాజ్, కూరాకుల నాగభూషణం,ఆర్జేసీ, పగడాల నాగరాజు, శీలంశెట్టి వీరభద్రం, బచ్చు విజయ్ కుమార్, బెల్లం వేణు, మంజుల, కృష్ణ, గిరిబాబు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement