త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

MLC Deshapathi Srinivas | మా రక్తం తీసుకో.. కానీ రైతులకు కాళేశ్వరం నీళ్లివ్వు : ఎమ్మెల్సీ దేశపతి

MLC Deshapathi Srinivas | రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుతో నీళ్లందక, నిధులందక తెలంగాణ రైతులు ఆగమైపోతున్నారని తెలంగాణ కవి, గాయకుడు, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్( MLC Deshapathi Srinivas ) తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కావాలంటే మా బీఆర్ఎస్ నాయకుల రక్తం తీసుకో.. కానీ, రైతులకు కాళేశ్వరం నీళ్లివ్వు అని దేశపతి డిమాండ్ చేశారు.

S

Telangana | Published On Jul 19, 2026, 5.38 pm IST

MLC Deshapathi Srinivas | మా రక్తం తీసుకో.. కానీ రైతులకు కాళేశ్వరం నీళ్లివ్వు : ఎమ్మెల్సీ దేశపతి
Advertisement

MLC Deshapathi Srinivas | త్రినేత్ర‌.న్యూస్ : రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుతో నీళ్లందక, నిధులందక తెలంగాణ రైతులు ఆగమైపోతున్నారని తెలంగాణ కవి, గాయకుడు, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్( MLC Deshapathi Srinivas ) తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కావాలంటే మా బీఆర్ఎస్ నాయకుల రక్తం తీసుకో.. కానీ, రైతులకు కాళేశ్వరం నీళ్లివ్వు అని దేశపతి డిమాండ్ చేశారు.

కాళేశ్వరం జలాలతో రిజర్వాయర్లు నింపాలని డిమాండ్ చేస్తూ.. అంతగిరి రిజర్వాయర్ నుండి.. రంగనాయక సాగర్ రిజర్వాయర్ వరకు సాగే రైతు పాదయాత్ర మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే హరీశ్ రావు ఆదేశాల మేరకు ఆదివారం ఉదయం సిద్దిపేట నియోజకవర్గంలో ప్రారంభమైంది.

ఈ కార్యక్రమంలో దేశ‌ప‌తి శ్రీనివాస్ మాట్లాడుతూ.. రేవంత్ ప్రభుత్వం తీరు అంగట్లో అన్ని ఉన్నా అల్లుని నోట్లో శని అన్నట్టుగా ఉందని, నీళ్లు ఆంధ్రాకు, నిధులు ఢిల్లీకి పంపుతూ తెలంగాణకు ద్రోహం చేస్తున్నదన్నారు. ఒకవైపు తెలంగాణ నుంచి గోదావరి జలాలు పొంగిపొర్లుతూ కింద ఆంధ్రాకు వెళ్లిపోతుంటే, సీఎం రేవంత్ రెడ్డి తన రాజకీయ స్వార్థం కోసం వాటిని నిల్వ చేసి, చెరువులు నింపి పంటలకు నీళ్లివ్వకుండా రైతులకు తీరని అన్యాయం చేస్తున్నాడన్నారు. కావాలంటే మా బీఆర్ఎస్ నాయకుల రక్తం తీసుకో.. కానీ, రైతులకు కాళేశ్వరం నీళ్లివ్వు అని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు.

రేవంత్ రెడ్డీ పెద్ద కుల్లేశ్వర్

‘‘ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు పాలనలో కసాయి కరువు చూసినం. ఉమ్మడి రాష్ట్రంలో భద్రాచలం వరకు ఒక్క ప్రాజెక్టు కట్టలేదు. అందుకే, ప్రాణహిత నది కలిసే చోట 365 రోజులు నిండుగా నీళ్ళు ఉండే మేడిగడ్డ వద్ద కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారు. అంతపెద్ద ప్రాజెక్టులో కేవలం రెండే రెండు పిల్లర్లు కుంగిపోతే దాన్ని బాగుచేయడం చేతగాని ఈ ముఖ్యమంత్రి, దిక్కుమాలిన కాంగ్రెస్ నాయకులు కాళేశ్వరాన్ని కూలేశ్వరం అంటున్నారు. అది కూలేశ్వరం కాదు రేవంత్ రెడ్డీ పెద్ద కుల్లేశ్వర్. స్విచ్చులు వేస్తే నీళ్ళు వచ్చే చోట ఈ దరిద్రుడు అడ్డుకున్నడు. 98 మీటర్ల ఎత్తున గోదావరి ప్రవహిస్తుంటే, కన్నెపల్లి పంపులు ఆన్ చేయడం లేదు. రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాలు చెబుతుండు. దీంతో మల్లా అదే ఉమ్మడి రాష్ట్రం నాటి కసాయి కరువు ఈ దిక్కుమాలిన కాంగ్రెస్ పాలనలో వచ్చింది.’’ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆఖరికి ఓ మూడు నెలలు ఇరిగేషన్ డిపార్టుమెంటును అప్పజెప్పితే రైతులకు నీళ్లు ఇస్తాను అని హరీశ్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఛాలెంజ్ చేసినా ఆయనలో ఉలుకూ లేదు పలుకూ లేదని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి, పంటలకు నీళ్లిచ్చి, రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

Advertisement
Advertisement