MLC Deshapathi Srinivas | చిత్తశుద్ధి ఉంటే ఫోర్త్ సిటీలో అమరుల కాలనీ కట్టు
MLC Deshapathi Srinivas | చిత్తశుద్ధి ఉంటే ఫోర్త్ సిటీలో అమరుల కాలనీ కట్టు.. అసైన్డ్ భూమిలో అమరవీరుల కాలనీ ఎందుకు..? అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ప్రశ్నించారు. అమరవీరులకు, దళితులకు తగాదా పెట్టొద్దని ఆయన హెచ్చరించారు.
అసైన్డ్ భూమిలో అమరవీరుల కాలనీ ఎందుకు..?
రేవంత్ సర్కార్‌ను నిలదీసిన ఎమ్మెల్సీ దేశపతి
MLC Deshapathi Srinivas | త్రినేత్ర న్యూస్ : చిత్తశుద్ధి ఉంటే ఫోర్త్ సిటీలో అమరుల కాలనీ కట్టు.. అసైన్డ్ భూమిలో అమరవీరుల కాలనీ ఎందుకు..? అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ప్రశ్నించారు. అమరవీరులకు, దళితులకు తగాదా పెట్టొద్దని ఆయన హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమంలో రేవంత్ రెడ్డి లాంటి ద్రోహుల వల్లే యువత బలిదానాలు జరిగాయి. రేవంత్ రెడ్డి పేరు రాసి మరీ కొందరు ఆత్మాహుతి చేసుకున్నారు. ఆయనకు అమరవీరుల గురించి మాట్లాడే నైతికత ఎక్కడిది అని దేశపతి శ్రీనివాస్ నిప్పులు చెరిగారు. తెలంగాణ భవన్‌లో బుధవారం దేశపతి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు.
రేవంత్ రెడ్డి పాలనలో ప్రజల బతుకులు ప్యారడైజ్ సినిమాలో మాలిక్ చేతిలో సవారీల బతుకుల్లా మారాయి. తెలంగాణలో నీరో రాజ్యం కంటే దారుణ పరిస్థితులు ఉన్నాయి. కేసీఆర్‌పై నిరంతరం విషం చిమ్ముతున్నారు. ఢిల్లీకేమో సూట్‌కేసులు.. ప్రతిపక్షంపై కేసులు పెడుతున్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు దారుణంగా ఉన్నాయి. పోలీసులు ప్రతిపక్ష నేతల ఇండ్ల వద్ద బందీలుగా మారారు. కాంగ్రెస్ నేతల బౌన్సర్ల మాదిరి పోలీసులు వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో బరితెగింపు పాలన నడుస్తోంది అని దేశపతి ధ్వజమెత్తారు.
రాహుల్ గాంధీ ఢిల్లీలో బారికేడ్లు ఎక్కి నిరసన చేస్తున్నారు. ఆయనపై బడే భాయ్ మోదీ కేసులు పెట్టలేదు. ఇక్కడ చోటే భాయ్ కేడీ ప్రతిపక్ష నేతలను అరెస్టు చేస్తున్నారు. మెడికవర్ హాస్పిటల్ ముందు ఫ్లెక్సీలు పెడితే అరెస్ట్ చేస్తారా..? కేసీఆర్ ఫామ్ హౌస్‌పై ఫ్లెక్సీలు పెట్టిన వారిపై చర్యలు ఎందుకు తీసుకోరు. బ్యూరోక్రాట్ ఫిర్యాదు చేస్తే అరెస్టు చేస్తారా...? అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నిలదీశారు.
తెలంగాణ సాధించిన నాయకుడు కేసీఆర్‌పై వ్యక్తిత్వ హననానికి పాల్పడలేదా..? లేని రంకులు అంటగట్టి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టలేదా..? మూడేళ్ళలో కాంగ్రెస్ చేసిన ఘనత శూన్యం. ప్రజాస్వామ్యం 7వ గ్యారెంటీ అని చెప్పిన కాంగ్రెస్ ఇప్పుడు నిర్బంధాలు కొనసాగిస్తోంది. కేసీఆర్ నిరంకుశ పాలన నడుస్తోందని కొంతమంది మేధావులు అన్నారు. కాంగ్రెస్ పాలనలో ఏమైనా నిరంకుశ పాలన నడుస్తోందా...? అని ప్రశ్నించారు.
రేవంత్ రెడ్డికి సమయం దగ్గర పడింది. రేవంత్ రెడ్డి సీఎంగా,హోంమంత్రిగా, మున్సిపల్ మంత్రిగా, విద్యా శాఖా మంత్రిగా నీ పరిస్థితి ఏంటి.? కేబీఆర్ పార్క్ చుట్టూ వున్న తన అనుయాయులను కాపాడేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఫ్లై ఓవర్లు, అండర్ పాస్‌లను రద్దు చేశారు. ప్రజలకు రీ కాల్ చేసే హక్కు ఉంటే ఈపాటికే రేవంత్ రెడ్డిని చెత్తబట్టులో పడేసేవారు. రేవంత్ రెడ్డిని చరిత్ర చెత్తబుట్టలో వేయడం ఖాయం అని దేశపతి శ్రీనివాస్ హెచ్చరించారు.
సంబంధిత వార్తలు

Telangana Govt | ప్రభుత్వ ఉద్యోగులకు రెండు డీఏలు మంజూరు
అక్టోబర్ 7, 2026

Revanth Reddy Slams BJP | రాహుల్ పోరాటానికి కేంద్రం గజగజ.. సీఈసీ రాజీనామా చేసేవరకు విశ్రమించం
అక్టోబర్ 6, 2026

CM Revanth Reddy Erravalli Review | ఎర్రవల్లిలో 45 ఎకరాల భూమి మాయం.. సీఎం సీరియస్.. కేసీఆర్ కుటుంబానికి నోటీసులు
అక్టోబర్ 6, 2026
తాజావార్తలు
- ●Bharti Airtel | వినియోగదారులకు షాకిచ్చిన ఎయిర్టెల్.. పోస్ట్‌పెయిడ్ ప్లాన్ల ధరలు పెంపు..
- ●Telangana Govt | ప్రభుత్వ ఉద్యోగులకు రెండు డీఏలు మంజూరు
- ●UPI | యూపీఐ చెల్లింపులపై ఛార్జీలను విధించినా.. పెద్దగా ప్రభావం ఉండదు: ఆర్బీఐ గవర్నర్
- ●Virat Kohli | ప్రేమానంద్ మహారాజ్ ఆశ్రమాన్ని సందర్శించడానికి కోహ్లీ రూ.5 కోట్లు తీసుకున్నారా..? క్లారిటీ ఇచ్చిన విరాట్ టీమ్
- ●vivo V80 | వివో వి80 లాంచ్.. 7,200 ఎంఏహెచ్ బ్యాటరీ.. జైస్ కెమెరాతో అదిరిపోయే ఫీచర్లు..
- ●Actor Dhanush | ధనుష్ పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్ధం.. ఈసీ వద్ద పార్టీ పేరు రిజిస్టర్..?

Bharti Airtel | వినియోగదారులకు షాకిచ్చిన ఎయిర్టెల్.. పోస్ట్‌పెయిడ్ ప్లాన్ల ధరలు పెంపు..

Telangana Govt | ప్రభుత్వ ఉద్యోగులకు రెండు డీఏలు మంజూరు

UPI | యూపీఐ చెల్లింపులపై ఛార్జీలను విధించినా.. పెద్దగా ప్రభావం ఉండదు: ఆర్బీఐ గవర్నర్

Virat Kohli | ప్రేమానంద్ మహారాజ్ ఆశ్రమాన్ని సందర్శించడానికి కోహ్లీ రూ.5 కోట్లు తీసుకున్నారా..? క్లారిటీ ఇచ్చిన విరాట్ టీమ్



