MLC Dasoju Sravan | జేఎన్టీయూలో గ్రూప్-1 మూల్యాంకనం : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్
MLC Dasoju Sravan | గ్రూప్-1 మూల్యాంకనం సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్‌లో జరిగిందని ప్రభుత్వం చెప్తుంది.. కానీ జేఎన్‌టీయూలో జరిగినట్లు ఆర్టీఐ ద్వారా వెల్లడైందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ పేర్కొన్నారు.
MLC Dasoju Sravan | త్రినేత్ర.న్యూస్ : గ్రూప్-1 మూల్యాంకనం సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్‌లో జరిగిందని ప్రభుత్వం చెప్తుంది.. కానీ జేఎన్‌టీయూలో జరిగినట్లు ఆర్టీఐ ద్వారా వెల్లడైందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ పేర్కొన్నారు. శాసనమండలిలో దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ.. గ్రూప్-1 అభ్యర్థుల సమస్యలతో పాటు జీవో 46 బాధితులకు సంబంధించిన అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.
గ్రూప్-1 పరీక్షతో పాటు జీవో 46 బాధితులకు సంబంధించి ఒక విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. విద్యార్థుల ఉద్యమం, వారి త్యాగాల ద్వారా తెలంగాణను తెచ్చుకున్నాం. దురదృష్టం ఏంటంటే వారి సమస్యలు పరిష్కారం కాలేదు. ఇవాళ గ్రూప్-1 పరీక్ష నిర్వహణ కూడా సరిగ్గా జరగకపోవడంతో వారు కోర్టుల చుట్టు తిరగాల్సిన ఒక దుర్భరమైన పరిస్థితి ఏర్పడింది. సుప్రీంకోర్టు, హైకోర్టు అంటూ తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి కీలకమైన అప్పీల్ చేస్తున్నాను. మన పిల్లలను కోర్టుల చుట్టూ తిప్పి, లక్షల మంది విద్యార్థులను ఇబ్బందులకు గురి చేసే బదులుగా ప్రభుత్వం ఈ సభ ద్వారా ఒక వైట్ పేపర్‌ను రిలీజ్ చేసి అసలు గ్రూప్-1 పరీక్షల ద్వారా జరిగిన లాభాలు ఏంటి..? నష్టాలు ఏంటి..? అని వెల్లడిస్తే బాగుంటుందన్నారు దాసోజు శ్రవణ్.
ఎందుకు ఇవాళ విద్యార్థులు కోర్టుల చుట్టు తిరుగుతున్నారు. కోట్ల రూపాయాలు పెట్టి ఖరీదైన లాయర్లతో వాదనలు వినిపిస్తున్నారు. వాస్తవానికి సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్‌లో మెయిన్స్ మూల్యాంకనం జరిగిందని చెప్తారు. ఆర్టీఐ ప్రకారం జేఎన్‌టీయూలో మూల్యాంకనం జరిగినట్లు వెల్లడైంది. ఇది మొత్తం అస్తవ్యస్తంగా ఉంది. సీజీజీలో జరిగిందని ప్రభుత్వం చెప్తుంది.. జేఎన్టీయూలో జరిగిందని ఆర్టీఐ సమాధానం చెప్తుంది. అలా మన పిల్లలను, భవిష్యత్ తరాలను కోర్టుల చుట్టు తిప్పి నానారకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు అని ఎమ్మెల్సీ శ్రవణ్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఇక జీవో 46 ఉన్న తప్పిదాలను సరిదిద్దుతాం అని ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు చెప్పింది. న్యాయం చేస్తామని వారిని కూడా ఎన్నికల్లో పెద్ద ఎత్తున వాడుకుంది. దాంతో లక్షల మంది విద్యార్థులు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ప్రచారం చేశారు. అధికారంలోకి వచ్చాక జీవో 46పై ఎన్నిసార్లు విజ్ఞప్తులు చేసినా కాంగ్రెస్ సర్కార్ పట్టించుకోలేదు. వారు కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మన పిల్లలను కోర్టుల చుట్టు తిరగనివ్వకుండా వారి సమస్యలను పరిష్కరించి ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నట్లు ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ పేర్కొన్నారు.
సంబంధిత వార్తలు

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026

CM Revanth Reddy | బండి భగీరథ్ సరెండర్ కాలేదు.. అరెస్టు చేశాం : సీఎం రేవంత్ రెడ్డి
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



