MLC Dasoju Sravan | పొంగులేటి భవిష్యత్.. చర్లపల్లి జైలుకే అంకితం : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్
MLC Dasoju Sravan | రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జీవితం చర్లపల్లి జైలుకే అంకితమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ అన్నారు. పొంగులేటి.. రియల్ ఎస్టేట్ దందాలతో పాటు కొత్తగా జ్యోతిష్యం ఏమైనా నేర్చుకున్నావా? అని శ్రవణ్ కౌంటర్ ఇచ్చారు.
MLC Dasoju Sravan | త్రినేత్ర.న్యూస్ : రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జీవితం చర్లపల్లి జైలుకే అంకితమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ అన్నారు. పొంగులేటి.. రియల్ ఎస్టేట్ దందాలతో పాటు కొత్తగా జ్యోతిష్యం ఏమైనా నేర్చుకున్నావా? అని శ్రవణ్ కౌంటర్ ఇచ్చారు. మాజీ మంత్రి హరీశ్‌రావుపై నోరు పారేసుకున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై శ్రవణ్ నిప్పులు చెరిగారు.
మా పొలిటికల్ ఫ్యూచర్ కాదు.. త్వరలోనే మీ అవినీతి లీలలు బట్టబయలై జైలు ఊచలు లెక్కబెట్టడమే నీ ఫ్యూచర్!. నువ్వు చేస్తున్న అక్రమాలకు, రియల్ ఎస్టేట్ మాఫియా దందాలకు మరో రెండేళ్లలో చర్లపల్లి జైలు ఖాయం.. రాసి పెట్టుకో! పదేళ్లలో మెట్రో కట్టలేదనడానికి సిగ్గుండాలి.. పొంగులేటి కుంభకర్ణ నిద్రపోతున్నావా.?హైదరాబాద్‌కు ప్రపంచస్థాయి మెట్రో తెచ్చి, రికార్డు సమయంలో ఫేజ్-1 పూర్తి చేసింది నాటి కేసీఆర్ ప్రభుత్వమే! హైటెక్ సిటీ - శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రో ఫేజ్-2 ప్రణాళికలను రద్దు చేసింది రేవంత్ ప్రభుత్వం కాదా? ఎల్&టీ (L&T) లాంటి ప్రతిష్టాత్మక సంస్థను బెదిరించి, బ్లాక్‌మెయిల్ చేసి ప్రాజెక్టులను అతలాకుతలం చేసింది నిజం కాదా? అని దాసోజు శ్రవణ్ నిలదీశారు.
ఫ్యూచర్ సిటీ కాదు.. అది 'ఫేక్' సిటీ.. ల్యాండ్ మాఫియాకు అడ్డా..
ఫ్యూచర్ సిటీ కాదు.. అది 'ఫేక్' సిటీ.. ల్యాండ్ మాఫియాకు అడ్డా. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం పేదలు, గిరిజనులు, రైతుల నోళ్లు కొట్టి భూములు లాక్కోవడమే మీ వ్యూహమా? నాదర్‌గుల్, లగచర్లలో రైతులను బెదిరించి, దాడులు చేసి అక్రమ కేసులు బనాయిస్తున్న నిరంకుశ ప్రభుత్వం! మీ భూ కబ్జాలు, HILTP పాలసీల వెనుక ఉన్న ఇండస్ట్రీయల్ మాఫియా దందాలన్నీ ఆధారాలతో సహా బట్టబయలు చేస్తాం! రేవంత్ రెడ్డి, పొంగులేటి.. మీ ఇద్దరి ఫ్యూచర్ జైల్లోనే.. ఇందులో ఎలాంటి సందేహం లేదు! అని శ్రవణ్ అన్నారు.
హరీష్ రావు, కేటీఆర్.. తెలంగాణ జాతిపిత కేసీఆర్‌కి రెండు కళ్ళు!
హరీష్ రావు, కేటీఆర్.. తెలంగాణ జాతిపిత కేసీఆర్‌కి రెండు కళ్ళు! స్వరాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించేందుకు సిద్ధపడిన కడిగిన ముత్యాల్లాంటి ఉద్యమ నాయకులు హరీష్, కేటీఆర్! తెలంగాణ చరిత్ర పుటల్లో వారి పేర్లు సువర్ణాక్షరాలతో నిలిచిపోతాయి.. అది వారి అజేయమైన ఫ్యూచర్! రాష్ట్రాన్ని రియల్ ఎస్టేట్ మాఫియాకు తాకట్టు పెట్టిన దోపిడీదారులుగా మీ పేర్లు చరిత్రలో చీకటి అధ్యాయం! పొంగులేటి.. నీకు జైలే ఫైనల్ ఫ్యూచర్!.. మీ అక్రమ పాలనకు ఇంకో రెండేళ్లు మాత్రమే గడువు ఉంది! ఎంత ఎంజాయ్ చేస్తావో చేసుకో.. ఎంత దోస్తావో దోచుకో.. ఆ తర్వాత ప్రజల పక్షాన ప్రతి పైసా కక్కిస్తాం! మిమ్మల్ని చర్లపల్లి జైలులో ఊచలు లెక్కపెట్టించడం ఖాయం అని దాసోజు శ్రవణ్ ధ్వజమెత్తారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల
నవంబర్ 28, 2026

V Srinivas Goud | ఓబీసీ కుల గణనకు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలలో తీర్మానాలు చేయాలి
నవంబర్ 28, 2026

High Court | బావర్చి హోటల్ ఘటనలో బీఆర్ఎస్ నేతలకు భారీ ఊరట.. అరెస్టు చేయొద్దంటూ హైకోర్టు ఆదేశాలు
నవంబర్ 28, 2026
తాజావార్తలు
- ●Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు
- ●BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల
- ●AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..
- ●HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం
- ●Special Trains | సంక్రాంతికి స్పెషల్ రైళ్లు.. ప్రయాణికులకు ఊరట.. ప్రయాణ తేదీలు, ఆగే స్టేషన్ల వివరాలు ఇవే..!
- ●Siddharth Galla | కొరియన్ అమ్మాయి మెడలో మూడుముళ్లు వేసిన మహేష్‌బాబు మేనల్లుడు

Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు

BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల

AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..

HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం



