త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Congress Budget | కాంగ్రెస్ ‘బడ్జెట్’ ఒక పెద్ద బోగస్‌.. ‘కాగ్’ రిపోర్టులో బ‌ట్ట‌బ‌య‌లు

Congress Budget | కేంద్రం నుంచి నిధులు తేలేక.. ఢిల్లీ ముందు రేవంత్ ప్ర‌భుత్వం మోక‌రిల్లింద‌ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్ర‌వ‌ణ్ మండిప‌డ్డారు. చ‌ట్ట‌బ‌ద్ధ‌మైన అప్పుల ప‌రిమితిని దాటేసి.. తెలంగాణ‌ను అప్పుల‌కుప్ప‌గా మార్చిన ఘ‌న‌త కాంగ్రెస్‌ది అని ధ్వ‌జ‌మెత్తారు.

S

Telangana | Published On Feb 22, 2026, 2.43 pm IST

Congress Budget | కాంగ్రెస్ ‘బడ్జెట్’ ఒక పెద్ద బోగస్‌.. ‘కాగ్’ రిపోర్టులో బ‌ట్ట‌బ‌య‌లు
Advertisement

Congress Budget | త్రినేత్ర‌.న్యూస్ : కేంద్రం నుంచి నిధులు తేలేక.. ఢిల్లీ ముందు రేవంత్ ప్ర‌భుత్వం మోక‌రిల్లింద‌ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్ర‌వ‌ణ్ మండిప‌డ్డారు. చ‌ట్ట‌బ‌ద్ధ‌మైన అప్పుల ప‌రిమితిని దాటేసి.. తెలంగాణ‌ను అప్పుల‌కుప్ప‌గా మార్చిన ఘ‌న‌త కాంగ్రెస్‌ది అని ధ్వ‌జ‌మెత్తారు. రాష్ట్రంలో ఆర్థిక ఎమర్జెన్సీ లాంటి ప‌రిస్థితి ఉంది. అంకెల గార‌డీతో ప్ర‌జ‌ల‌ను ఇంకెంత కాలం మోసం చేస్తారు..? తెలంగాణ ప్రజలకు నిజాలు చెప్పండి.. వెంటనే బడ్జెట్ వైఫల్యాలపై 'వైట్ పేపర్' విడుదల చేయాలని దాసోజు శ్ర‌వ‌ణ్ డిమాండ్ చేశారు.

ఆర్థిక స్మ‌శానంగా తెలంగాణ‌

  • రేవంత్ ప్రభుత్వం తెలంగాణను ఆర్థిక శ్మశానంగా మారుస్తోంది. కాగ్ (CAG) రిపోర్ట్ (జనవరి 2026 వరకు) చూస్తే రేవంత్ రెడ్డి గారి "పేపర్ ప్రోస్పరిటీ" (కాగితపు సిరి) అసలు రంగు బయటపడింది. తెలంగాణ రైసింగ్ కేవలం డొల్ల నినాదం మాత్రమే, వాస్తవంగా తెలంగాణ సింకింగ్!!

అంకెల గారడీ - ఆదాయం గాలిలోనే:

  • బడ్జెట్ టార్గెట్: రూ. 2,29,720 కోట్లు
  • సాధించింది: కేవలం రూ. 1,38,371 కోట్లు (అంటే 60 శాతం మాత్రమే!)
  • మిగిలిన 40 శాతం నిధులు ఎక్కడ నుంచి తెస్తారు? ప్రజలను ఇలా ఎంతకాలం మోసం చేస్తారు?

రియల్ ఎస్టేట్ & ఇండస్ట్రీ కుప్పకూలింది:

  • "ఫ్యూచర్ సిటీ" అని గ్రాఫిక్స్ చూపిస్తున్నారు కానీ, స్టాంపులు & రిజిస్ట్రేషన్ల ఆదాయం రూ. 19,087 కోట్లు టార్గెట్ పెడితే వచ్చింది కేవలం రూ. 12,345 కోట్లే. పెట్టుబడిదారులు తెలంగాణ వైపు చూడటానికే భయపడుతున్నారు.

రేవంత్ ఢిల్లీ యాత్రలు - నిధులు సున్నా:

  • సీఎం గారు ఢిల్లీకి వెళ్లి ఫోటోలు దిగడం తప్ప సాధించిందేమిటి? రూ. 22 వేల కోట్ల గ్రాంట్లు ఆశిస్తే తెచ్చింది కేవలం రూ. 4 వేల కోట్లే (18 శాతం). బడే భాయ్ తో దోస్తీ అంతా డ్రామానేనా?

అప్పుల విస్ఫోటనం:

  • ఏడాదికి అప్పుల పరిమితి రూ. 54,009 కోట్లు అయితే, జనవరి నాటికే రూ. 69,148 కోట్లు (128 శాతం) అప్పులు చేసేశారు. చట్టబద్ధమైన పరిమితిని దాటి మరీ అడ్డగోలుగా అప్పులు చేస్తూ రాష్ట్ర భవిష్యత్తును తాకట్టు పెడుతున్నారు.

మా డిమాండ్:

  • వెంటనే బడ్జెట్ వైఫల్యాలపై, అప్పుల లెక్కలపై, మూసీ ప్రాజెక్ట్ నిధులపై శ్వేతపత్రం (White Paper) విడుదల చేయాలి. తెలంగాణ ప్రజలకు నిజాలు తెలియాలి!
Advertisement
Advertisement