త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy Fake Tweet | సీఎంపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు

అసెంబ్లీలో నకిలీ ట్విట్టర్ అకౌంట్ పోస్ట్‌ చదివి కేసీఆర్ పరువు తీసేలా సీఎం రేవంత్ వ్యవహరించారని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు.

J

Telangana | Published On Sep 10, 2026, 4.32 pm IST

CM Revanth Reddy Fake Tweet | సీఎంపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు
Advertisement
  • ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై రూల్ 168 కింద సభాహక్కుల ఉల్లంఘన నోటీసు (Privilege Motion)
  • అసెంబ్లీ సెక్రటరీకి పిటిషన్ సమర్పించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గూడెం మహిపాల్ రెడ్డి, బండారి లక్ష్మారెడ్డి
  • కేసీఆర్‌ను బద్నాం చేసేందుకు అసెంబ్లీలో ఫేక్ ట్వీట్ చదివారని గులాబీ నేతల ఆరోపణ
  • కాంగ్రెస్ ఐటీ సెల్ సృష్టించిన నకిలీ ఖాతాతో సభను తప్పుదోవ పట్టించారని మండిపాటు

CM Revanth Reddy Fake Tweet | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణ అసెంబ్లీ (Telangana Assembly) వేదికగా చోటుచేసుకున్న ఫేక్ ట్వీట్ వివాదం మరింత ముదిరింది. మాజీ సీఎం కేసీఆర్ ప్రతిష్టను దెబ్బతీసేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్దేశపూర్వకంగానే నకిలీ ట్విట్టర్ ఖాతా పోస్ట్‌ను సభలో చదివారని బీఆర్ఎస్ (BRS) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై సీఎం రేవంత్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్‌కు సభాహక్కుల ఉల్లంఘన నోటీసు (Breach of Privilege Notice) ఇచ్చారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గూడెం మహిపాల్ రెడ్డి, బండారి లక్ష్మారెడ్డి గురువారం అసెంబ్లీ సెక్రటరీ తిరుపతిని కలిసి ఈ మేరకు ఒక పిటిషన్ అందజేశారు. అసెంబ్లీ నియమావళి రూల్ 168 కింద ముఖ్యమంత్రిపై చర్యలు తీసుకోవాలని వారు తమ కంప్లైంట్‌లో (Complaint) డిమాండ్ చేశారు.

సెప్టెంబర్ 9న సభలో జరిగిన చర్చ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి సత్యదూరమైన విషయాలు మాట్లాడారని ఎమ్మెల్యేలు ఆరోపించారు. బీఆర్ఎస్ 'ఇంటర్నేషనల్ సెక్రటరీ' సంధ్యారావు పేరుతో ఉన్న నకిలీ ఎక్స్ (X) ఖాతాను ఆయన ప్రదర్శించారని మండిపడ్డారు. కేసీఆర్ ఆదేశాలతో దళితులు వచ్చిన తర్వాత ఇంటిని పసుపు నీళ్లతో శుద్ధి చేశామని అందులో ఉన్న ఫేక్ కంటెంట్‌ను (Fake Content) సీఎం అసెంబ్లీ సాక్షిగా చదివి వినిపించారని గుర్తుచేశారు.

అసలు తమ పార్టీలో 'అంతర్జాతీయ కార్యదర్శి' అనే పదవే లేదని బీఆర్ఎస్ స్పష్టం చేసింది. కాంగ్రెస్ ఐటీ సెల్ (Congress IT Cell) సృష్టించిన ఈ నకిలీ ఖాతా పోస్ట్‌ను ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి క్రాస్ చెక్ చేసుకోకుండా చదవడం సభా హక్కులను ఉల్లంఘించడమేనని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పవిత్రమైన చట్టసభలో నిరాధారమైన ఆరోపణలు చేస్తూ, ఫేక్ డాక్యుమెంట్స్ (Fake documents) ప్రదర్శించి సభను తప్పుదోవ పట్టించిన రేవంత్ రెడ్డిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్‌ను కోరారు.

Advertisement
Advertisement