త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Talasani Srinivas Yadav | బీసీల‌కు రూ. 20 వేల కోట్ల బ‌డ్జెట్ ఎక్క‌డ‌..? : ఎమ్మెల్యే త‌ల‌సాని

Talasani Srinivas Yadav | బీసీల సంక్షేమం కోసం ఏడాదికి రూ. 20 వేల కోట్ల బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెడుతామ‌ని చెప్పారు.. మ‌రి ఎక్క‌డ ప్ర‌వేశ‌పెట్టార‌ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించారు.

S

Telangana | Published On Mar 26, 2026, 5.36 pm IST

Talasani Srinivas Yadav | బీసీల‌కు రూ. 20 వేల కోట్ల బ‌డ్జెట్ ఎక్క‌డ‌..? : ఎమ్మెల్యే త‌ల‌సాని
Advertisement

Talasani Srinivas Yadav | త్రినేత్ర‌.న్యూస్ : బీసీల సంక్షేమం కోసం ఏడాదికి రూ. 20 వేల కోట్ల బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెడుతామ‌ని చెప్పారు.. మ‌రి ఎక్క‌డ ప్ర‌వేశ‌పెట్టార‌ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించారు. శాస‌న‌స‌భ‌లో బీసీ ప‌ద్దుపై చ‌ర్చ సంద‌ర్భంగా త‌ల‌సాని మాట్లాడారు.

బీసీ బిల్లుకు చట్టబద్దత కోసం ఆల్ పార్టీ ప్రతినిధులను ఢిల్లీ తీసుకెళ్తామ‌న్నారు. జనాభాలో బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలు 85 శాతం ఉన్నారు. కానీ వారికి ద‌క్కాల్సిన హ‌క్కులు ద‌క్క‌డం లేదు. బీసీల‌కు బ‌డ్జెట్‌లో రూ. 20 వేల కోట్లు కేటాయిస్తామ‌న్న హామీ ఏమైంది..? కేసీఆర్ ప్రభుత్వం 9 ఏళ్లలో 45 వేల కోట్లు ఖర్చు చేసింది. రాజ్య‌స‌భ‌కు ఇద్ద‌రు బీసీ బిడ్డ‌ల‌ను పంపారు. శాస‌న‌స‌భ తొలి స్పీక‌ర్‌గా బీసీ బిడ్డ‌ను, మండ‌లి చైర్మ‌న్‌గా కూడా బీసీ బిడ్డ‌కు అవ‌కాశం ఇచ్చారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వం మాత్రం బీసీల‌ను నిర్ల‌క్ష్యం చేస్తుంది. గొల్ల‌కురుమ‌ల‌కు, యాద‌వ సోద‌రుల‌కు మంత్రి ప‌ద‌వులు రాకుండా చేస్తుంద‌ని త‌ల‌సాని మండిప‌డ్డారు.

రెండు రాష్ట్రాలకు నేనే ఒక బ్రాండ్ నాకు ఎవరి గుర్తింపు అవసరం లేదు. నాకు కిరీటం పెట్టాల్సిన అస‌వ‌రం లేదు.. నేనే సీనియ‌ర్.. ఆ త‌ర్వాత‌ శ్రీధ‌ర్, దామోద‌ర్ అన్నా.. క‌ష్ట‌ప‌డి పైకి వ‌చ్చిన వ్య‌క్తిని. ఇక కేసీఆర్ హ‌యాంలో గురుకుల స్కూల్స్, మెడికల్, ఇంజనీరింగ్ కాలేజీలు ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వం బీసీల‌ను న‌మ్మించి మోసం చేస్తుంది. కామారెడ్డి డిక్ల‌రేష‌న్‌ను అమ‌లు చేయ‌డం లేదు. న‌మ్మించి మోసం చేయ‌కండి.. ఇచ్చిన హామీల‌ను అమ‌లు చేయాలి. 42 శాతం రిజర్వేషన్ హామీ బిజెపి ఇవ్వలేదు.. ఇచ్చిన హామీ అమలు బాధ్యత కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై ఉంది. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి, మంత్రులు ధర్నా చేస్తే అగ్రనాయకత్వం హాజరు కాలేదు. అమలుకు సాధ్యం కాని హామీలను ఓట్ల కోసం, ప్రజలను మోసం చేయడం కోసమేనా? అని నిల‌దీశారు.

42 శాతం రిజర్వేషన్ కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంటే.. బీసీ స‌బ్ ప్లాన్ మీ చేతుల్లోనే ఉంది. బ‌డ్జెట్‌లో రూ. 20 వేల కోట్ల కేటాయింపు మీ ప‌రిధిలోనే ఉంది క‌దా..? అంబేద్క‌ర్ క‌ల్పించిన హ‌క్కుల కోసం పోరాడుతాం. బడుగులకు రాజకీయ ప్రాధాన్యత దక్కొద్దా..? భూసాని కమిషన్ రిపోర్ట్ నేటి వరకు పబ్లిక్ డొమైన్‌లో పెట్టలేదు. ఏదో ఒక రోజు మ‌మ్మ‌ల్ని రిజ‌ర్వేష‌న్లు అడిగే రోజు వ‌స్తుంది. చ‌రిత్ర‌లో అనేక అనుభ‌వాలు చూశాం. బడుగుల పిల్లలు విద్యా వంతుల‌య్యారు... అన్ని గమనిస్తున్నారు. ప్రధాన వ్యవస్థలలో బీసీ ఉద్యోగులకు తగిన గుర్తింపు ఇవ్వడం లేదు అని త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ ధ్వ‌జ‌మెత్తారు.

Advertisement

తాజావార్తలు

Advertisement