త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

MLA Sanjay | డీసీపీ శిల్ప‌వ‌ల్లి గారు.. సీఎం అంటే సంస్కార‌హీనుడు.. నీకు ఏమైందమ్మా సంస్కారం..?

MLA Sanjay | సోమ‌వారం అసెంబ్లీ గేటు వ‌ద్ద జ‌రిగిన ప‌రిణామాల‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్ట‌ర్ క‌ల్వ‌కుంట్ల సంజ‌య్ స్పందిస్తూ.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ప‌ట్ల ఆడ‌, మ‌గ పోలీసులు ప్ర‌వ‌ర్తించిన తీరుపై మండిప‌డ్డారు. సీఎం రేవంత్ రెడ్డి అంటే సంస్కార‌హీనుడు.. నీకు ఏమైంద‌మ్మా సంస్కారం అని ఖైర‌తాబాద్ డీసీపీ శిల్ప‌వ‌ల్లిని ఎమ్మెల్యే సంజ‌య్ ప్ర‌శ్నించారు.

S

Telangana | Published On Sep 8, 2026, 9.32 pm IST

MLA Sanjay | డీసీపీ శిల్ప‌వ‌ల్లి గారు.. సీఎం అంటే సంస్కార‌హీనుడు.. నీకు ఏమైందమ్మా సంస్కారం..?
Advertisement

MLA Sanjay | త్రినేత్ర‌.న్యూస్ : సోమ‌వారం అసెంబ్లీ గేటు వ‌ద్ద జ‌రిగిన ప‌రిణామాల‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్ట‌ర్ క‌ల్వ‌కుంట్ల సంజ‌య్ స్పందిస్తూ.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ప‌ట్ల ఆడ‌, మ‌గ పోలీసులు ప్ర‌వ‌ర్తించిన తీరుపై మండిప‌డ్డారు. సీఎం రేవంత్ రెడ్డి అంటే సంస్కార‌హీనుడు.. నీకు ఏమైంద‌మ్మా సంస్కారం అని ఖైర‌తాబాద్ డీసీపీ శిల్ప‌వ‌ల్లిని ఎమ్మెల్యే సంజ‌య్ ప్ర‌శ్నించారు.

డీసీపీ శిల్ప‌వ‌ల్లి గారు.. ముఖ్య‌మంత్రి అంటే సంస్కార‌హీనుడు. నీకు ఏమైంద‌మ్మా సంస్కారం.. నీ చ‌దువు ఎక్క‌డికి పోయింద‌మ్మ‌. మ‌గ పోలీసులు పోయి.. మ‌హిళా ఎమ్మెల్యేల చీర లాగుతారా త‌ల్లి. ఇదా నీ సంస్కారం.. నీ చ‌దువు నేర్పిన సంస్కారం ఇదేనా త‌ల్లి. ఆ ముఖ్య‌మంత్రికి సంస్కారం లేదు త‌ల్లి.. మ‌రి నువ్వు ఎందుకు ఆయ‌న ఆర్డ‌ర్స్‌ను ఫాలో అవుతున్న‌వ్. నీ చ‌దువు నీకు ఏం నేర్పించింది. మ‌హిళా ఎమ్మెల్యేల చీర‌ల‌ను మ‌గ పోలీసుల‌తో లాగ‌మ‌ని నేర్పించిందా నీ చ‌దువు.. నీ త‌ల్లిదండ్రులు నేర్పించారా ఈ సంస్కారం. నీకు నీ చ‌దువు నేర్పించిందా..? ఈ సంస్కారం. ఎందుక‌మ్మ ఇంత పెద్ద చ‌దువులు చ‌దివిన‌వ్. ఎంత సిగ్గు చేట‌మ్మ నిన్న జ‌రిగింది అని ఎమ్మెల్యే సంజ‌య్ అన్నారు.

సంస్కార హీన‌మైన ప‌నిని మీ పిల్ల‌ల‌కు కూడా చూపిస్తాం

నిన్న ఆ మ‌హిళా పోలీసుల‌ను చూస్తే బాధేసింది. ఆ ఇద్ద‌రు పోలీసుల‌కు దండం పెట్టిన.. త‌ల్లి మీరు త‌ప్పుకోండ‌మ్మ అని చెప్పాను. మ‌గ ఎమ్మెల్యేల మీద మీరు ఎందుకు ప‌డుతున్నార‌ని, ఆ మగ పోలీసులు మిమ్మ‌ల్ని తోస్తున్నార‌ని చెప్పాం. ఆ తోసిన పోలీసుల ఫొటోల‌ను కూడా భ‌ద్ర‌ప‌రిచాం. త‌ప్పించుకుని తిరుగుతాం అని అనుకుంటున్నారేమో. మీరు చేసిన సంస్కార హీన‌మైన ప‌నిని మీ పిల్ల‌ల‌కు కూడా చూపిస్తాం. మ‌గ ఎమ్మెల్యేల‌పై ఆడ పోలీసుల‌ను ఎలా తోశారో.. మీ పిల్ల‌ల‌కు చూపెట్టి ఎలా ఎక్స్‌పోజ్ చేస్తామో చూడండి. అది రాజ్యాంగ‌బ‌ద్ధంగా చేసే డ్యూటీనా..? అవి అప్ర‌జాస్వామిక మార్గాల్లో చేసిన ప‌నులు. మ‌గ ఎమ్మెల్యేల‌పైకి ఆడ పోలీసుల‌ను తోయాల‌ని ఏ పోలీసు స్టిస‌మ్‌లో లేదు. మ‌హిళా పోలీసుల‌కు అలాంటి ప‌రిస్థితి తీసుకురావొద్దు.. మీ ఇంట్లో కూడా ఇలాగే చేస్తారా..? అని డాక్ట‌ర్ సంజ‌య్ నిల‌దీశారు.

Advertisement
Advertisement